భగభగ మండే యువశక్తి కదిలింది.. గళం విప్పి సేనాని అడుగేసిన రణస్థలికి...


‘భగభగ మండే యువశక్తి కదిలింది..
ఉగ్రరూపమై జనసేన తన ఆశయానికి..
గళం విప్పి సేనాని అడుగేసిన రణస్థలికి..’ ఈ గీతం జనసేనాని అడుగులో అడుగేయిస్తోంది. 

యువభేరికి రణస్థలి వైపు యువతను కదిలిస్తోంది. పవన్‌కళ్యాణ్‌ అభిమానులు ఈ గీతానికి శ్రీకారం చుట్టారు. ఈ గీతాన్ని ప్రైమ్‌9 న్యూస్‌ చానల్‌లో మంగళవారం నాడు తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ రత్న పిల్ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. 


అద్దేపల్లి ఫణికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ గేయానికి విశేష ఆదరణ లభిస్తోంది. దాసరి వెంకట జయరాంప్రసాద్‌, ఇంద్రగంటి మురళీ ఈ పాటకు అందించిన సాహిత్యాన్ని జనసేన కార్యకర్తల్లో జోష్‌ నింపుతోంది. యువతలో ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఈ గీతావిష్కరణలో ప్రైమ్‌9 సీఈవో పైడికొండ వెంకటేశ్వరరావు, జనసేన రాక్స్‌ ప్రెసిడెంట్‌ గాదం శివ మాట్లాడుతూ ‘భగభగమండే’ అంటూ ప్రారంభమైన గీతం మాదిరే ఈరోజున యువతరం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా పవన్‌ అభిమానులైన జయరాంప్రసాద్‌, మురళీ, ఫణికుమార్‌ ఎంతో శ్రమకోర్చి ఈ గీతాన్ని ఆవిష్కరించడం పట్ల అభినందనలు తెలియజేశారు. పవన్‌ అభిమానులు ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ వంతు సహకారం అందించడం ద్వారా రాబోయే తరాలకు మంచి భవిష్యత్‌ను అందించడానికి తోడ్పడుతుందన్నారు.. ఈ బృందం నుంచి ఇలా సమాజాన్ని మేల్కొలిపే గీతాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు..


No comments