ఆకట్టుకునే ఫస్ట్ లుక్ తో ప్రియాంక త్రివేది 50వ చిత్రం 'డిటెక్టివ్ తీక్షణ'


" నా 50వ చిత్రం 'డిటెక్టివ్ తీక్షణ' తో ప్రేక్షకులు ఎంటర్టైన్ అవడమే కాకుండా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కి లోనవుతారు " -  ప్రియాంక ఉపేంద్ర

బెంగాల్ కు చెందిన ప్రియాంక త్రివేది 90వ చివరి దశకం నుండి 2000 తొలి నాళ్ళ వరకు అనేక బెంగాలీ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్. ప్రముఖ కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్ర ను వివాహమాడి ప్రియాంక ఉపేంద్ర గా మారిన ఆవిడ, వివాహం తర్వాత కూడా ఎన్నో ఆఫర్లు వచ్చినా తనకు నచ్చిన క్యారెక్టర్ లను ఎంచుకుంటూ సెలెక్టివ్ గా సినిమాలు చేశారు. కానీ తను ఎప్పుడూ సినిమాలకు దూరం కాలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఆకట్టుకునే నటనతో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 

ఇప్పుడు 'డిటెక్టివ్ తీక్షణ' గా తన 50వ చిత్రంతో మన ముందుకు రానున్నారు. మేకర్స్ ఆకట్టుకునే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రియాంక ఉపేంద్ర గన్ పట్టుకుని టిపికల్ యాక్షన్ పోజ్ తో ఉన్న ఈ ఫస్ట్ లుక్, టైటిల్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహిస్తుండగా పొలకల చిత్తూర్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన గుత్తముని ప్రసన్న, జి ముని వెంకట్ చరణ్ ( ఈవెంట్ లింక్స్, బెంగళూర్)  పురుషోత్తం బి (ఎస్ డి సి) నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. 

50 సినిమాలతో, రెండు దశాబ్దాలకు పైగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న తన సినీ ప్రయాణం గురించి ప్రియాంక ఉపేంద్ర ఎక్స్ క్లుజివ్ ఇంటర్వ్యూ ....


20 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న మీ సినీ ప్రయాణం గురించి తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ?

- ఇంత సుదీర్ఘమైన కెరీర్ నాకు దక్కినందుకు నేను అదృష్టవంతురాలిని. నేను పుట్టింది బెంగాల్ లోనే అయినా పెరిగింది అంతా యూఎస్ సింగపూర్ లలో. నా 16వ ఏట మిస్ కలకత్తా గా ఎన్నికైన నేను బెంగాలీ చిత్రంతో నా సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. 1999  నుండి 2003 వరకు చాలా తక్కువ సమయంలోనే నేను బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, ఒడియా సినిమాల్లో ఎన్నో చిత్రాలు నటించాను. చాలా పెద్ద స్టార్స్ తో సినిమాలు చేశాను. విజయ్ కాంత్ సార్ తో, విక్రం సార్ తో, ప్రభుదేవా, ఉపేంద్రలతో కలిసి నటించాను.  నా మొదటి బెంగాలీ సినిమా హతట్ బ్రిష్టి కి జాతీయ అవార్డ్ దర్శకుడు బసు చటర్జీ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఇటీవలే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నా కెరీర్ తొలిరోజుల్లోనే నేను చాలా నేర్చుకోగలిగాను. తర్వాత వివాహం, పిల్లలు... జీవితం ఇలా మలుపు తిరిగింది. నేను నా ఫ్యామిలీ లైఫ్ తో చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మళ్ళీ నటిస్తానని అనుకోలేదు. కానీ మెల్లగా నాకు ఆఫర్స్ రావడం మొదలయ్యాయి.  ఆ సమయంలో సూపర్ స్టార్స్ ను పెళ్లాడిన చాలామంది నటీమణులు తిరిగి నటించేవారు కాదు. ఫ్యాన్స్ ప్రెజర్ ఒక వైపు, వేరే హీరోలతో చేస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా, ఎలాంటి పాత్రల్లో చూడాలనుకుంటారు... ఇలా ఎన్నో అంశాలు ఉండేవి. వీటి మధ్య తిరిగి నటించాలని నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద విషయం. ఈ రోజుల్లో ఆ సమస్యలు చాలా వరకు తగ్గాయి. నాకంటూ ప్రత్యేకత సంపాదించుకోగలిగాను. ప్రస్తుత ఓ టి టి వేవ్ లో రకరకాల పాత్రలను ప్రెజెంట్ చేసే అవకాశం వచ్చింది. ఈ ప్రయాణంలో అన్ని భాషల ఇండస్ట్రీల నుండి పని చేసిన అందరి నుండి నేర్చుకుంటూనే ఉన్నాను. 

ఉపేంద్ర గారిని పెళ్ళాడక ముందు, తర్వాత మీ ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పులు ?

- నేను బెంగుళూరు కి షిఫ్ట్ అవగానే చేసిన మొదటి పని కన్నడ నేర్చుకోవడం. పిల్లలు పుట్టిన తర్వాత ఎమోషనల్ గా చాలా ఎక్స్పీరియన్సేస్ ఉన్నాయి. పిల్లలు పుట్టాక ఒక మెచ్యూరిటీ కూడా వచ్చింది. అది పూర్తిగా ఒక కొత్త జీవితం. ఉపేంద్ర గారి డైరెక్షన్లో నేను నటించలేదు. కానీ మేము ఎన్నో చిత్రాలు చూసే వాళ్ళం, సినిమాల గురించి మాట్లాడుకుంటాము. ఆయన ను కన్నడ లిటరేచర్ అంటే పిచ్చి. ఆ విషయంలో ఆయన్నుండి చాలా నేర్చుకున్నాను. నేను యాక్టర్ గా మరింత మెరుగవడానికి అదెంతో ఉపయోగపడింది. నేను కర్ణాటక లో చాలా ప్రాంతాలు తిరిగాను. దాని వలన కర్ణాటక కల్చర్, కొత్త వారితో కలిసి పనిచేయడం వల్ల కొత్త ఆలోచనలు ఎలా ఎన్నో నేర్చుకున్నాను. కానీ ఉపేంద్ర నుండే నేను ఎంతో నేర్చుకోగలిగాను.

మీరు ఒక స్క్రిప్ట్ ఫైనల్ చేయాలంటే అందులో దేనికి ప్రాధాన్యత ఇస్తారు ?

- పిల్లలు పుట్టాక కూడా నాకు 8 బెంగాలీ సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆ ఆఫర్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు నేను వివాహం చేసుకుని తల్లిని అయ్యాను అనేది అడ్డంకిగా అనిపించలేదు. కానీ నేనే పిల్లలతో కోల్ కత కి వెళ్లి వర్క్ చేయలేకపోయాను. అందుకని ఇక్కడే చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నాను. బాలీవుడ్ సినిమా అయిత్రాజ్ రీమేక్ శ్రీమతి లో ఉపేంద్ర తో కలిసి నటించాను. రవిచంద్రన్ సార్ తో క్రేజీ స్టార్ చేశాను. నేను ప్రధాన పాత్రలో నటించిన మమ్మీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆ చిత్రం నాకు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు మార్కెట్ ఉందని నిరూపించింది. ఆ సినిమా తర్వాత అలాంటి హార్రర్ సినిమాలే చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ అలాంటివే చేయడం ఇష్టం లేక ఒప్పుకోలేదు. తర్వాత సెకండ్ హాఫ్, దేవకీ సినిమాలు చేశాను. నేను ఒక స్క్రిప్ట్ చదివేటప్పుడు అది సినిమాగా తీసాక నేను ఎంజాయ్ చేయగలనా, నా పిల్లలతో కలిసి చూడగలనా అనేది ఆలోచిస్తాను. అలానే అది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. అది నాకు సరిపోతుంది అనిపిస్తే నా గట్ ఫీలింగ్ తో వెళ్ళిపోతాను. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, క్వాలిటీ ఔట్ పుట్ తీసుకురాగలరా... ఇవన్నీ ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను.

ఒక స్టార్ హీరో, దర్శకుడి భార్యగా పాత్రలను ఎంచుకునేప్పుడు మీ మీద ఎలాంటి ప్రెజర్ ఉంటుంది ?

- ఆ విషయంలో నాకు చాలా స్వేచ్ఛ ఉంది. మేమిద్దరం ఒకరికి ఒకరం ఏమి చేయాలి, ఏది చేయకూడదు అనే రేస్ట్రిక్షన్స్ పెట్టుకోము. మేము డిస్కస్ చేసుకుంటాము. ఆయన తన అభిప్రాయాన్ని చెప్పి నిర్ణయాన్ని నాకే వదిలేస్తారు. ఆయన విషయంలో నేనైనా అంతే. కానీ నా సినిమాలకి సంబందించిన ఫైనల్ డెసిషన్ నాదే ఉంటుంది. ఫ్యాన్స్ అనే ఒక పెద్ద ప్లాట్ ఫామ్ ఉంది, వాళ్ళ అపరిమిత ప్రేమ, అభిమానం ఉంది. వాళ్ళను డిజప్పాయింట్ చేయకూడదనే ప్రెజర్ ఉంటుంది. నాకు స్ట్రాంగ్ రోల్స్, మెసేజ్ ఓరియంటెడ్ చేయాలంటే ఇష్టం. ఆడవాళ్ళను, పిల్లలను ఇన్స్పైర్ చేసే పాత్రల్లో నటించడానికి ఇష్టపడతాను. సోషల్ మీడియా లో ఎంతో మంది ఆడవాళ్ళు నన్ను పవర్ఫుల్ రోల్ లో చూసి తాము అది ఫీల్ అయ్యము అని చెబుతుంటారు. నాకు అది బాగా నచ్చుతుంది అలా వారిని ఇన్స్పైర్ చేయగలుగతున్నందుకు గర్వంగా ఉంటుంది.

డిటెక్టివ్ తీక్షణ చిత్రాన్ని ఎంచుకోవడానికి ట్రిగ్గరింగ్ పాయింట్ ఎంటి ?

- ఇది నా 50వ సినిమా. దర్శకుడు రఘు చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ప్యాషనేట్. ఆయన ఈ సినిమా వన్ లైన్ చెప్పినప్పుడే నేను ఇంప్రెస్స్ అయిపోయాను. ఎందుకంటే ఇలాంటి ప్రధాన పాత్ర ఇంతక ముందు ఎప్పుడూ ఒక మహిళ చేయలేదు. బ్యోంకేష్ బక్షి, నాన్సీ డ్రూ లాంటి సినిమాలు నాకు గుర్తొచ్చాయి. అలాగే డిటెక్టివ్ తీక్షణ ఒక స్ట్రాంగ్, ఇంటెలిజెంట్, బ్రేవ్ ఉమన్. రఘు కి విజువల్స్ పట్ల ఒక ప్రత్యేకమైన విజన్ ఉంది. ఆయన తాను అనుకున్న దాన్ని తెరమీదకి ఎంత సమర్థవంతంగా తీసుకురాగలడో మొదటి రెండు రోజుల షూటింగ్ లోనే నాకు అర్ధం అయిపొయింది. ఎంటైర్ టీం చాలా టాలెంటెడ్. నా పిల్లలు నన్ను ఈ సినిమాలో చూడటానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు.

ఇలాంటి ఒక సూపర్ హీరో తరహా సినిమా చేసేటప్పుడు చాలా ఇతర చిత్రాల ప్రభావం ఉంటుంది. అలాంటి రిఫరెన్స్ లు ఉన్నప్పుడు మీరు ఎలాంటి హోమ్ వర్క్ చేస్తారు ?

- యాక్షన్ సినిమా చేయాలంటే చాలా ఫిట్ గా ఉండాలి. నేను ఆ పాత్రలో కన్విన్సింగ్ గా కనిపించాలి. ఆ పాత్ర గురించి చాలా శ్రద్ధ తీసుకున్నాం. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలాంటి రియాక్షన్స్ ఉండాలి ఇలా ప్రతి విషయం ఆ క్యారక్టర్ గురించి డిజైన్ చేసుకున్నాం. ఇవన్నీ స్క్రీన్ మీద కు వచ్చే సరికి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చాయి.

కొన్ని పాత్రల కోసం ఫిజికల్ గా కష్టపడాల్సి వస్తే కొన్నిటి కోసం మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. ఈ సినిమాలో ఆ రెండు ఉన్నాయా. వాటికి మీరు ఎలా బ్యాలన్స్ చేశారు ?

- ఇందులో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. కానీ ఇది ప్రధానంగా ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్. ' డిటెక్టివ్ తీక్షణ' చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎంటర్టైన్ అవడమే కాకుండా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కి లోనవుతారు. 

ఏదైనా సన్నివేశం తాలూకా రిఫరెన్స్ ఇంకో సినిమా నుండి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రేక్షకులకు ఆ సినిమా గుర్తు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.

- నిజానికి ప్రతిదీ ఇంకొక దాన్నుండి ప్రేరణ పొందుతుంది అనేది నేను నమ్ముతాను. నేను మరీ ఎక్కువగా అన్ని భాషా చిత్రాలు, సీరీస్ లు చూడను. కనుక నా స్టైల్ లో నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను.

ఇది మీకు 50వ సినిమా. దీన్నుంచి ఏమి నేర్చుకున్నారు, ఏది మార్చుకున్నారు ?

- ఈ సినిమాలో కొన్ని మూమెంట్స్ లో ఎమోషన్ వైజ్ కాస్త లైట్ గా ట్రై చేశాను. నేను ఇంత ముందెప్పుడూ ఇలాంటి రోల్ చేయలేదు. ఈ పాత్ర చాలా బాగా రాశారు. స్క్రిప్ట్ పక్కగా ఉంటే సగం విజయం సాధించేసినట్టే. నా తరపు నుండి నేను యాడ్ చేయలిగినవి ఇంప్రూవ్ చేయగలిగినది చేశాను.

ఇది ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్. మార్కెట్ లో కమర్షియల్ గా ఎలా పే చేస్తుంది అనుకుంటున్నారు ?

- నేను ఈ సినిమాని కంటెంట్ ఓరియంటెడ్ అంటాను. నేను ఇందులో ఒక ప్రధాన పాత్ర పోషించాను. ఇందులో ఇంకా ముఖ్య పాత్రలు చాలా ఉన్నాయి. ఇది కథ ప్రధానంగా సాగే సినిమా. ఒక ఫ్రెష్ లుక్ తో ఎంటర్టైన్మెంట్ తో థ్రిల్ చేసేలా రూపొందిన సినిమా 'డిటెక్టివ్ తీక్షణ'. నేను ఈ సినిమా విషయంలో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. 

మీ 50 సినిమాల్లో, దాదాపు 30 మందికి పైగా దర్శకులతో పని చేసి ఉంటారు. ఈ చిత్ర దర్శకుడు రఘు ప్రత్యేకత ఏంటి?

- రఘు కి టెక్నికల్ గా చాలా గ్రిప్ ఉంది. తనకి అద్భుతమైన టీం ఉంది. తన ఆలోచనలను అద్భుతంగా తెర మీదకి తీసుకు రాగలడు. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ కే జీ ఎఫ్, కాంతార చిత్రాలతో పీక్ లో ఉంది. ఇక్కడి దర్శకులకు ఒక ప్లాట్ ఫామ్ కావాలి, తమని తాము నిరూపించుకోవడానికి. ఒక మంచి టెక్నికల్ టీం తో అలాంటి ప్లాట్ ఫామ్ ఈ సినిమాకి దక్కింది. రఘు ఈ చిత్రంతో తన మార్క్ చూపిస్తాడు.

బాహుబలి, కే జీ ఎఫ్, కాంతార చిత్రాలతో సినిమాల్లో భాషా సరిహద్దులు చేరిగిపోయాయి. ఒక నటీమణి గా ఈ మార్పు ను చూసినప్పుడు ఏమనిపిస్తుంది ?

- నేను నా కెరీర్ ను అన్ని భాషల్లో నటిస్తూ ప్రారంభించాను. ఇది నాకు కొత్త విషయం కాదు. నేను ఒక బెంగాలీ, పెరిగింది స్టేట్స్ లో, పెళ్లాడింది సౌత్ ఇండియన్ ను, అన్ని భాషా చిత్రాల్లో నటించాను. నాకు ఇండియా మొత్తం ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ లాగానే అనిపిస్తుంది. కానీ సౌత్ సినిమా చేసినందుకు గర్వంగా ఉంటుంది. నేను బెంగాలీ అయినప్పటికీ, సౌత్ సినిమాలు చేయడానికే ఇష్టపడతాను. ఎందుకంటే ఇక్కడి వర్క్ కల్చర్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఈ మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. బెంగాలీ లకి ఇప్పుడు యాష్ అంటే ఎవరో తెలుసు, మా అమ్మ ఉపేంద్ర ప్యాన్ ఇండియా ఫిల్మ్ కబ్జా కోసం ఎదురు చూస్తోంది. వాళ్ళు కాంతర చూసారు. ఇదంతా బాహుబలి తో ప్రారంభం అయింది. ఎంత ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటే అంత భారీ, క్వాలిటీ సినిమాలు తీస్తాము. ఇది ఇంటర్నేషనల్ స్థాయికి కూడా వెళ్లాలని కోరుకుంటున్నాను.

డిటెక్టివ్ తీక్షణ ఆడవాళ్ళని ఏ విధంగా ఇన్స్పైర్ చేయగలదు అనుకుంటున్నారు ?

-  ఈ చిత్రం తప్పకుండా ఆడవాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలను. ఇప్పటివరకు సూపర్ హీరో పాత్రలో మగవారిని చూసిన వాళ్లు ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక ఫిమేల్ సూపర్ హీరో ని చూడబోతున్నారు. ఇది వారి మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆడవారు కూడా పవర్ ఫుల్ గా ఇంటెలిజెంట్ గా ఉండగలరని, ఒక క్రైమ్ ని సాల్వ్ చేయగలరని వారికి అర్థమయ్యేలా చేస్తుంది ఈ చిత్రం. మరొక విషయం ఏంటంటే ఈ జానర్ చిత్రాలు కమర్షియల్ గా కూడా బాక్సాఫీస్ దగ్గర పే చేయగలవని నిరూపించబోతోంది 'డిటెక్టివ్ తీక్షణ' 


మీ 50 చిత్రాల కెరియర్ లో మిమ్మల్ని ఆందోళనకి, ఖంగారుకి గురిచేసిన సన్నివేశం ఏదైనా ఉందా ? అలాంటి సిట్యువేషన్ ని మీరు ఎలా ఓవర్ కమ్ చేశారు ?

- నాకు సినిమాలంటే ఎంతో ఇష్టం చాలా పేషనెట్ గా ఉంటాను. వాటి విషయంలో ఎప్పుడూ ఆందోళన పడను. నా హోంవర్క్ నేను చేసుకుంటాను కానీ కొన్నిసార్లు కొంచెం టైం కావాల్సి ఉంటుంది. ఒక్కోసారి చివరి నిమిషంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. అలాంటప్పుడు వాటిని రిహార్సల్ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి కొంత సమయం అవసరం అవుతుంది అంతే తప్ప ఎప్పుడూ ఆందోళన పడింది లేదు.

ఈ సినిమాలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పండి ?

- మ్యూజిక్ అనేది ప్రతి సినిమాకి అత్యంత అవసరం. మనం కథ చెప్పడానికి ఉపయోగపడే మెయిన్ ఇన్స్ట్రుమెంట్ అది. మీరు ఏదైనా ఒక ట్యూన్ విన్నప్పుడు ఆ ట్యూన్ కి సంబంధించిన సన్నివేశం మీకు గుర్తుకొస్తుంది. మ్యూజిక్ మిమ్మల్ని మీ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ సినిమాని ఇంకో లెవెల్ కి ఎలివేట్ చేస్తుంది. ఏ సినిమా అయినా సరైన సంగీతం లేనప్పుడు అసంపూర్తిగానే ఉంటుంది. డిటెక్టివ్ తీక్షణ విషయంలో అద్భుతమైన మ్యూజిక్, బిజిఎం కుదిరింది.

మీరు మీ చిత్రాలని ఉపేంద్ర సార్ కి చూపిస్తారా ఆయన ఏమన్నా ఇన్పుట్స్ ఇస్తారా ?

-  నేను డిటెక్టివ్ తీక్షణ సినిమా రషస్ ని ఉపేంద్రకు చూపించాను. ఆయన రషెస్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయారు  అది రా ఫుటేజ్ లాగా లేదని, పూర్తి డిఐ వర్కు కంప్లీట్ అయ్యాక వచ్చే అవుట్ పుట్ ఎలా ఉంటుందో అంత క్వాలిటీతో ఆ విజువల్స్ ఉన్నాయని ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన ఈ చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆయన చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఈ సినిమాతో యాక్షన్ జోన్ లోకి ఎంటర్ అవ్వడాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. నేను ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా హ్యాపీగా ఉన్నాను  ప్రేక్షకులకి కూడా తప్పకుండా నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాను.

అప్ కే, ఆస్పైరింగ్ హీరోయిన్స్ కు మీరిచ్చే సలహా.. అలాగే కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్న వారికి కూడా...

-  పిల్లలు పుట్టిన తర్వాత ఉపేంద్ర సినిమాల్లో వచ్చిన మార్పుని మీరు ట్రాన్సిషన్ అంటారు కానీ మా విషయంలో మాత్రం కం బ్యాక్ అనే వర్డ్ యూస్ చేస్తారు (నవ్వుతూ) కానీ ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి తర్వాత కూడా కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఈమధ్య కియారా పెళ్లి చేసుకుంది. హన్సిక పెళ్లి చేసుకుంది వారు వారి వర్క్ ని కంటిన్యూ చేస్తున్నారు. పరిస్థితులు ఇంతకుముందు లాగా లేవు. మైండ్ సెట్ చాలా మారాయి. కొత్తగా వచ్చే వారికి నేను చెప్పేది ఒకటే, మీరు మీలాగే ఉండండి మీరు అనుకున్నట్లు జరగకపోతే డిప్రెషన్ కి లోన్ కావొద్దు ఎందుకంటే మానసికంగా దృఢంగా ఉండడం చాలా అవసరం నిజాయితీగా ఉండండి, కష్టపడండి. ఫిజికల్ గానే కాదు మెంటల్ గా కూడా మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి అందంగా కనపడటం మాత్రమే కాదు లోపల కూడా చాలా దృఢంగా ఉండాలి.

మీరు చేయాలనుకుంటున్న డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా ? 

 - ఇప్పటివరకు నేను బయోపిక్ లో నటించలేదు. ఎంతోమంది ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు. సుధా మూర్తి గారు. జాక్ కెన్నెడీ, మదర్ థరీసా వంటి వారు. అలాంటివారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతుంటాను. బయోపిక్ లో నాది ప్రధాన పాత్ర అవ్వాల్సిన అవసరం లేదు బయోపిక్ లో కీలకమైన పాత్ర పోషిస్తే చాలు. నేను ఎవరి పాత్రను పోషిస్తున్నానో వారిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీదకి తీసుకురాగలిగితే చాలు అదే నాకు పెద్ద ఛాలెంజ్. అలాగే నేను ఇప్పటి వరకు నెగిటివ్ క్యారెక్టర్ చేయలేదు.

డిటెక్టివ్ తీక్షణ మీ గత చిత్రాలతో పోలిస్తే ఏ విధంగా భిన్నంగా ఉండబోతుంది ?

-  మహిళా ఇన్వెస్టిగేటర్ ప్రధాన పాత్రలో ఇప్పటివరకు పెద్దగా సినిమాలు ఏమీ రాలేదు. అవన్నీ హీరో ఓరియంటెడ్ గానే ఉన్నాయి. ఒకసారి ప్రేక్షకులు సినిమాలు చూశాక తేడా ఏంటో వారే గమనిస్తారు. ఇంతకంటే ఎక్కువ చెప్తే నేను స్టోరీ ని రివీల్ చేసినట్లు అవుతుంది. కానీ, డిటెక్టివ్ తీక్షణ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉంటూనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. విజువల్ పరంగా ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఖాయం.

డిటెక్టివ్ తీక్షణ ను ఎన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు ? 

- ఈ సినిమాను కన్నడ తో పాటు తెలుగు, తమిళ్, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదల చేస్తున్నాం.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?

- డిటెక్టివ్ తీక్షణ త్వరలో విడుదల కాబోతోంది. కర్త కర్మ క్రియ, విశ్వరూపిణి, గుల్లిగమ్మ, ఖైమర తో పాటూ మరో బెంగాలీ ఫిలిం మాస్టర్ అన్షుమన్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవికాక వైరస్, కమరట్టు చెక్ పోస్ట్ - 2, ఉగ్ర అవతారా చిత్రాలు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధమవుతున్నాయి.

No comments