నేను ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి-సీనియర్ నటుడు మురళీ మోహన్


"నేను ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. నేను ఎప్పుడూ కూడా నా కెరియర్‌లో నాకు ఇన్ని ఏళ్ళ సినీ ప్రయాణం ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను మొదటిసారి సినిమాకి వచ్చినప్పుడు నాకు 33ఏళ్ళు ఉంటాయి. 

ఏదో ఒక 15ఏళ్ళు ఉంటానేమో అనుకున్నా. కానీ అదృష్టం కలిసిరావడం వల్ల అందరూ సహకరించడంతో నాకు ఈ అవకాశం కలిగింది. నేను అనుకోకుండా సినిమా యాక్టర్‌ని అయ్యాను. మొదటి నుంచి నాకు బిజినెస్‌ మీద ఎక్కువగా ఇంట్రస్ట్‌ ఉండేది. మధ్యలో అనుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళాను. తప్పని సరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది. దాంతో ఒక పదేళ్ళు సినిమాలకు బ్రేక్‌ వచ్చింది. వ్యాపారం కూడా నా కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ప్రస్తుతం అవన్నీ పూర్తిగా వదిలేసి కంప్లీట్‌గా సినిమాలకు అంకితం అవ్వాలనుకుంటున్నాను. 

నేను అక్కినేని నాగేశ్వరరావుగారి అభిమానిని ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని నేను చనిపోయేంతవరకు కూడా నేను సినిమాల్లో నటిస్తూ ఉంటాను అన్నారు. అలాగే ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించినప్పటికీ చివరగా ఆయన మనం చిత్రంలో నటించారు. నాగేశ్వరరావుగారే నా స్ఫూర్తి. నేను కూడా ఆయన లాగే ఇక నటనకే అంకితం అవుతాను. "

No comments