గ్రాండ్‌గా విజన్ వి వి కె ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెం1 'తెలంగాణ త్యాగధనులు' వెబ్ సిరీస్ ప్రారంభం

"వందనం వందనం తెలంగాణ త్యాగధనులకు ఇదే వందనం"  గీతావిష్కరణ

2 వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన తెలంగాణ ప్రాంతం భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంతో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.  ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన వేర్పాటు ఉద్యమాలు ఫలించి, 2014 జూన్ 2 నాడు కొత్త రాష్ట్రంగా అవతరించింది.కోటి లింగలలో శాతవాహన కాలంలో తెలంగాణ చరిత్రకి శ్రీకారం చుట్టింది. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళు ఎన్నో దొరికాయి. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందింది. తెలుగులో తొలి రామాయణ కర్త బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులు. అదే విధంగా తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన త్యాగధనులు కూడా ఎందరో వున్నారు. వారిలో కొందరి జీవిత చరిత్ర ఆధారంగా 'తెలంగాణ త్యాగధనులు' పేరిట వెబ్ సిరీస్ రూపుదిద్దుకోడానికి ఈ రోజు జూన్ 4న ఆదివారం సాయంత్రం ప్రారంభోత్సవం మరియు గీతావిష్కరణ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమం లో ఎఫ్ డి సి చైర్మన్ కూర్మాచలం, దర్శకులు రేలంగి నరసింహారావు, నటి రోజారమణి, నిర్మాత రాజ్ కందుకూరి, వకుళా భరణం కృష్ణ మోహన్, తుమ్మలపల్లి  రామ సత్యనారాయణ, పాల్గొన్నారు.  

విజన్ వి వి కె ఫిలిమ్స్  ప్రొడక్షన్ నెం1గా రూపుదిద్దుకుంటోన్న 'తెలంగాణ త్యాగధనులు' పీరియాడికల్ వెబ్ సిరీస్  ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. నాగబాల సురేష్ కుమార్  దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ విజన్ వి వి కె హౌసింగ్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ అధినేత వి. విజయ్ కుమార్ భారీ బడ్జెట్‌తో  నిర్మించనున్నారు. ఈ ప్రారంభోత్సవం తో పాటు ఈ వెబ్ సిరీస్ లోని "వందనం వందనం తెలంగాణ త్యాగధనులకు ఇదే వందనం"  గీతాన్నిసీనియర్ నటి రోజా రమణి  విడుదల చేసారు. ఎఫ్ డి సి చైర్మన్ కూర్మాచలం చేతులమీదుగా నిర్మాత వి విజయ్ కుమార్ కు క్లాప్ అందించడంతో  షూటింగ్ ప్రారంభం జరిగింది.

ఈ సందర్భంగా ఎఫ్ డి సి చైర్మన్ కూర్మాచలం మాట్లాడుతూ :

"తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలుగు టి వి రచయితల సంఘం ఆధ్వర్యంలో, రియల్టర్ వి విజయ్ కుమార్ నిర్మాతగా, నాగబాల సురేష్ కుమార్ దర్శకత్వం లో చేస్తున్న ఈ 'తెలంగాణ త్యాగధనులు' వెబ్ సిరీస్  ప్రారంభించడం ఒక తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మన వాళ్ళ చరిత్ర గురించి, ఈ గడ్డ పై ఇంత గొప్పవాళ్ళు పుట్టారా? అప్పట్లో అలా  వుండేవారా?  అని చెప్పుకోవడం జరిగింది. అలాంటి చరిత్రకారుల జీవిత కథలు ప్రస్తుతం డిజిటల్ యుగం లో ప్రతి ఇంట్లో చూసేవిధంగా ఈ సిరీస్ నిర్మించడం ఈ జనరేషన్ కి అందించడం తో  మీరు తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకున్నారు. మన తెలుగు వారు తీస్తున్న పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి, అవి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. 'తెలంగాణ త్యాగధనులు' అని తన గడ్డ చరిత్రను మీరు అందించడంలో శ్రీకారం చుట్టారు. అదే విధం ఇదే స్ఫూర్తితో ఇతర భాషాలవారు కూడా తమ తమ చరిత్రలను ప్రపంచానికి చూపించడానికి ముందుకు వస్తారు అనిపిస్తుంది.  మీ కృషి చాలా గొప్పది మీకు ప్రభుత్వ తరపున ఎలాంటి సహాయం కావాలన్నా నేను అందిస్తానని సభా  ముఖంగా మాట ఇస్తున్నాను." అన్నారు

వకుళాభరణం కృష్ణ మోహన్ మాట్లాడుతూ :

"ఈ సిరీస్ కి ఏ ముహూర్తం లో పేరు పెట్టారో టైటిల్ అద్భుతంగా వుంది.ప్రతి దేశ చరిత్రలో కొన్ని కారణాల కోసం సమాజానికి దిక్సూచిగా నిలవడానికి కోటి కి ఒకరు పుణ్యమూర్తులు జన్మిస్తారు. వారే త్యాగధనులుగా నిలుస్తారు.  ఈ రోజు నాగబల సురేష్ గారు, విజయ్ కుమార్ గారు చేస్తున్న సాహసం సామాన్యమైంది కాదు. దీనికి డబ్బు కంటే భాష పై, ప్రాంతం పై అభిమానం ఉండాలి. చరిత్రలో జరిగిన ముఖ్య ఘట్టాలను వున్నది వున్నట్లుగా చూపించాలి. నా సూచన ఏమిటంటే ఆ త్యాగధనులు పై తీస్తున్న ఈ సిరీస్ బాగా అన్వేషించి ఆ కాలంలో ఉన్న పరిస్థితులను చూపించాల్సిన అవసరం ఉంది.  చరిత్ర లోతుల్లోకి వెళ్లి ప్రజలకి అందించాల్సిన సిరీస్ అవ్వాలి. ఏంతో జాగ్రత్తగా చిత్రీకరించాల్సిన అవసరం ఉంది."  అన్నారు

సీనియర్ నటి రోజా రమణి మాట్లాడుతూ :

" నేను ఇక్కడకు గెస్టుగా రేలేదు! ఇది నా సొంత అన్నయ్య లాంటి వారు నాగబల సురేష్ కుమార్ గారి గురించి వచ్చాను.'తెలంగాణ త్యాగధనులు' పై వెబ్ సిరీస్ రూపొందించడం గొప్ప సంకల్పం. ఈ ఆలోచన రావడమే వీరి సక్సెస్ కి శ్రీకారం.  సినిమా అనేది తక్కువ నిడివితో ఉంటుంది మూడు గంటల్లో ఈ మహానుభావుల జీవిత చరిత్ర చెప్పడం సరిపోదు,  కాబట్టి..  వెబ్ సిరీస్ చేయడం అనేది కరెక్ట్. ఆ మహానుభావు సాహసాన్ని, ధైర్యాన్ని,త్యాగాన్ని, మనం ఎవ్వరం చూడలేదు. ఇప్పడు మన కళ్ళముండే  నిర్మాత విజయ్ కుమార్, నాగబాల సురేష్ కుమారుల  త్యాగ గుణం  మనం చూడబోతున్నాం. పరిశ్రమ తరపున  మీకు ఏ సహాయం కావాలన్న మేము సిద్ధంగా ఉంటాము. నిజంగా వెనిగళ్ల రాంబాబు గారు రాసిన సాహిత్యం, సంగీత దర్శకుడు ఖుద్దస్ ఇచ్చిన స్వరాలూ అద్భుతంగా వున్నాయి. పాట వింటూ ఉంటే కళ్ళ వెంబడి నీరు వచ్చింది. ఇంతటి గొప్ప గీతాన్ని నేను విడుదల చేయడం నా అదృష్టం." అన్నారు.

దర్శకుడు రేలంగి నరసింహ రావు మాట్లాడుతూ :

" ఈ వెబ్ సిరీస్ కేవలం తెలంగాణ ప్రజలే కాదు మన తెలుగు జాతి, ఇంకా  ప్రపంచ వ్యాప్తంగా అందరు  చూడాల్సిన సిరీస్ఇది.  గొప్ప ఆలోచన! తన వారి ఔన్నత్యాన్ని సెల్యులౌడ్ పై ఎక్కించడం, అది తెలుగు లో మొదటిది కావడం మనం గర్వించాల్సిన విషయం. ఈ సిరీస్ చూసి భవిష్యత్తు లో కన్నడ, తమిళ్, కేరళ త్యాగధనులు అని సిరీస్ స్టార్ అవుతుందనడం లో  ఎలాంటి సందేహం లేదు.  నిర్మాత కు ఇచ్చే గౌరవం  దాసరి గారి నుంచే  గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. నిర్మాత అనేవాడు లేకపోతే పరిశ్రమ ఎక్కడ ఉంటుంది? ఈ రోజు ఈ సిరీస్ తీయడానికి ముందుకు వచ్చిన వి విజయ్ కుమార్ గారిని అభినందించాలి.  ఎందుకంటె అతను చేసిన సేవా కార్యక్రమాలతో పాటు ఈ వెబ్ సిరీస్ లో నాకు లాభాలు రాకపోయినా సరే! ఒక మంచి పని చేశానన్న తృప్తి ఉంటుందని అనడం.   కానీ నా మనసా వాచా ఈ నిర్మాతలు నష్ట పోకూడదు మాలాంటి సాంకేతిక నిపుణులను, నటి నటులను ఆదరించి పరిశ్రమలో నిలపడాలని భగవంతుడిని కోరుకుంటున్నాను." అన్నారు.    

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ :

"ఈ ఫ్లెక్సీ పై ఇక్కడ కనిపించే వారే  కాదు ఇంకా ఎంతో మంది తెలంగాణ  త్యాగధనులు, వీరులు వున్నారు. వారి వారి చరిత్రలపై రీసెర్చ్ చేసి ఈ వెబ్ సిరీస్ అందిస్తారని అనుకుంటున్నాను.  ఈ కార్యక్రమం చేపట్టినా  నిర్మాత విజయ కుమార్ గారిని, నాగబాల సురేష్ కుమార్ గారిని  ఓ తెలంగాణ బిడ్డగా అభినందిస్తున్నాను."

నిర్మాత తుమ్మపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ :

ఈ వెబ్ సిరీస్ తీయడానికి సాహసం చేయాలి ఎంతో గుండె ధైర్యం కావాలి! చరిత్రను ఏ మాత్రం మరిచిపోయినా.. లేకపోతే తప్పుగా చూపించినా మన మక్కెలిరగదీస్తారు ప్రజలు. ఒకటికి పదిసార్లు రీసెర్చ్ చేసి వున్నది వున్నట్టుగా తెస్తారని నమ్ముతున్నాను. ఇప్పటివరకు ఇలాంటి సినిమా గాని, సిరీస్ గాని రాలేదు. సరి కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఈ సిరీస్ తప్పక సక్సెస్ అవుతుంది." అన్నారు.      

దినేష్ చౌదరి మాట్లాడుతూ :

"ఈ రోజే ప్రారంభం జరిగిన ఈ వెబ్ సిరీస్ పెద్ద సక్సెస్ అవుతుందని  ముందుగానే మీకు తెలియచేస్తున్నా! ఎందుకంటె ఈ సిరీస్ కి ముగ్గురూ నంది అవార్డు విన్నర్స్ కలిసి పనిచేస్తున్నారు. దర్శకుడిగా నాగబాల సురేష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఖుద్దూస్ గారు, గేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు గారు ఈ ముగ్గురు నంది అవార్డు  సొంతం చేసుకున్నవారే కావడం విశేషం. " అన్నారు.      

మ్యూజిక్ డైరెక్టర్ ఖుద్దూస్ మాట్లాడుతూ :

"రచయిత ఎం వి యస్ హరనాథ్ రావు గారి ప్రోత్సహంతోపరిశ్రమలోకి వచ్చిన  నేను ఇప్పటివరకు ఎందరో దర్శకులతో, నిర్మాతలతో 46 సినిమాలకు పని చేశాను. 5 నంది అవార్డులను కూడా అందుకున్నాను. మన కెరీర్ లో ఎన్నో సినిమాలకు పనిచేసివుంటాం. కానీ, చరిత్రలో నిలిచిపోయే సినిమాలు ఒకటో రెండో వుంటాయి. అలాంటి అవకాశం నాకు  'తెలంగాణ త్యాగధనులు' ద్వారా ఈ రోజు వచ్చిందని గర్వంగా చెపుతున్నాను." అన్నారు.    

గేయ రచయిత వెనిగళ్ల రాంబాబు మాట్లాడుతూ :

"అందరూ బతకాలి అందరిని బతికించుకోవాలంటే  వారి వారి చరిత్రలను ప్రజలకు తెలియచేయాలి అప్పుడే ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిపోతారు. ఈ రోజు ఈ సిరీస్ లో నేను కూడా భాగమైనందుకు నా జన్మ ధన్యమైందని అనుకుతున్న్నాను. అక్షరాన్ని ప్రాణ ప్రతిష్ట చేసి తెలంగాణ మాండలికంతో  ఈ  పాట రాయడం నా జన్మ సార్ధకం అయ్యింది.   ఈ రోజు అమర గాయకులూ ఎస్ బాలసుబ్రమణ్యం గారి పుట్టిన రోజు  ఆయన జీవించి  ఉంటే ఈ పాట ఆయనతోనే పాడించేవారం. ఆ లోటు భర్తీ చేయడానికి జ్ఞాపకార్థముగా ఈ పాట ఆయనకు  అంకితం ఇస్తున్నాము. " అన్నారు

నిర్మాత వి విజయ్ కుమార్ మాట్లాడుతూ :

"గత 30 సంవత్సరాలుగా నేను రియల్ ఎస్టేట్ రంగం లో వ్యాపారం చేస్తున్నాను. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటివరకు 40 వేచెర్స్ వేసాను. నా వద్ద తొలుత  కొనుగోలు చేసిన కస్టమర్స్ నేను ఎక్కడ కొత్తగా ప్రారంభించినా బుక్ చేసుకోవడం జరుగుతుంది. అంటే వారికి మా వేచెర్స్ పై  అంత నమ్మకం వుంది. నేను సంపాదించిన దానిలో లేని వారికి  నా వంతు సహకారం చేయాలనే తలంపుతో గత ఏడాది ఇదే రోజు నా పుట్టిన రోజున పెద్దలు రమణా చారీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ గార్ల సమక్షంలో 101 మంది టి వి కార్మికులకు నివాస స్థలం ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ రోజు వెబ్ సిరీస్ ఆలోచన నాగబాల సురేష్ గారు నా ముందుంచారు. నిజానికి నేను వ్యాపార పరంగా ఆలోచిస్తే... ఓ కమర్షియల్ సినిమా తియ్యొచ్చు! ఆ సినిమా పై డబ్బు సంపాదించొచ్చు! కానీ అలాంటి సినిమా ఇలా వచ్చి అలా కనుమరుగవుతుంది. చరిత్రలో నిలిచిపోయే సబ్జెక్టులు కొన్నే ఉంటాయి అలాంటి గుర్తుండి పోయే సిరీస్ 'తెలంగాణ  త్యాగధనులు'. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సిరీస్ ని మీకు అందించాలనే సంకల్పం తో మీ ముందుకొచ్చాము ఆదరించండి! ఆశీర్వదించండి. ఈ వెబ్ సిరీస్ ఏ ఓటిటి కంపెనీ సొంతం చేసుకుంటుందో ఫస్ట్ సీజన్ షూటింగ్ పూర్తి అయ్యాక తెలియ చేస్తాం. " అన్నారు.          

దర్శకుడు నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ : 

"2 వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన తెలంగాణ ప్రాంతం భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంతో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.  ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన వేర్పాటు ఉద్యమాలు ఫలించి, 2014 జూన్ 2 నాడు కొత్త రాష్ట్రంగా అవతరించింది.కోటి లింగలలో శాతవాహన కాలంలో తెలంగాణ చరిత్రకి శ్రీకారం చుట్టింది. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళు ఎన్నో దొరికాయి. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందింది. తెలుగులో తొలి రామాయణ కర్త బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులు. అదే విధంగా తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన త్యాగధనులు కూడా ఎందరో వున్నారు. వారిలో కొందరి జీవిత చరిత్ర ఆధారంగా 'తెలంగాణ త్యాగధనులు' పేరిట ఈ  వెబ్ సిరీస్ స్క్రిప్ట్ రాసుకున్నాం. ఎన్నో అవార్డ్ లను తీసుకోవడం కాదు తెలంగాణ చరిత్ర ను ప్రపంచవ్యాప్తంగా అందించాలనే మన ఇంటి సినిమా థియేటర్ అయినా ఓ టి టి లో మీకు అందించడం కోసం వెబ్ తో ముందుకొచ్చాము. ఇవి 10 సీజన్లో  50 ఏపిసోడ్స్ అవుతాయో? లేక 100 సీజన్లో 500 ఏపిసోడ్స్ అనేది ఇప్పుడు చెప్పలేము. తెలంగాణ చరిత్ర తవ్వుకుంటూ పోతే చాలా వుంది.  ఇది కేవలం ఒక ప్రాంతానికి తెలియాల్సిన చరిత్ర కాదు  జాతీయ స్థాయిలో తెలియాల్సి సిరీస్ ఇది.   ఏ లాభాపేక్ష లేకుండా నిర్మాత  విజయ్ కుమార్ గారు ముందుకు రావడం ఆయనను అభినందించితీరాలి. మీరు అందరు మెచ్చిన ఈ గీతాన్ని రాసిన వెనిగళ్ల  రాంబాబు గారికి , దానికి స్వరాలు అందించిన ఖద్ధుస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.  
 
కార్యక్రమం లో అతిధులను, టి వి ఫెడరేషన్ అధ్యక్షులను, కార్యదర్శులను, అతిధులను శాలువా మెమెంటోలతో సత్కరించారు. నటి రోజా రమణి నిర్మాత విజయ్ కుమార్, నాగబాల సురేష్ కుమారులను శాలువా మెమెంటోలతో ప్రత్యేకంగా సత్కరించారు. ఇంకా నటులు అశోక్ కుమార్,జె యల్ శ్రీనివాస్, బోస్ బాబు, చల్లా భాను కిరణ్, లీగల్ అడ్విజర్ నరసింహ రావు, మాట్లాడారు.  చివరగా నిర్మాత వి విజయ్ కుమార్ జూన్ 4న పుట్టిన రోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేయడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు ఆయన్ని పుష్ప మాలలతో సత్కరించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

తారాగణం:

వైభవ్ సూర్య, రామ కృష్ణ, విజయ్, లోహిత్, అమర్, చిత్తరంజన్, సత్యం యబి, ప్రేమ్, బాబ్జి, సుస్మా,పద్మావతి, ప్రీతి, స్వప్న, శ్యామల తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం:

నిర్మాణ సంస్థ : విజన్ వి. వి. కె. ఫిలిమ్స్,
స్క్రీన్ ప్లే : నాగబాల సురేష్ కుమార్,
నిర్మాత: వి విజయ్ కుమార్,
సంగీతం: ఎస్ ఏ ఖుద్దూస్,
D O P : గోపి, శంకర్,
పాటలు : డా.  వెనిగళ్ళ రాంబాబు, మౌనశ్రీ మల్లిక్,
ఎడిటర్: ప్రవీణ్,
ఆర్ట్ : రాజేష్,
పి ఆర్ ఓ : రాంబాబు వర్మ.

No comments