పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ ఎపిక్ యూనివర్స్ ‘సలార్ పార్ట్ 1: సీస్ ఫైర్’ టీజర్ రిలీజ్ చేసిన హోంబలే ఫిలింస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘సలార్ పార్ట్ 1: సీస్ ఫైర్’. మూవీ గురించి ప్రకటన వెలువడిన రోజు నుంచి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను గురువారం ఉదయం 5 గంటల 12 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించటం ద్వారా ఈ ఎగ్జయిట్‌మెంట్‌ను మరింతగా పెంచారు. అందరూ ఊహించినట్లే దర్శకుడు ప్రశాంత్ నీల్ తన యూనివర్స్ నుంచి థ్రిల్లింగ్ యాక్షన్ టీజర్‌ను విడుదల చేశారు. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఉన్న టీజర్‌ను చూస్తుంటే ఈ భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తుందనిపిస్తుంది.
బిగ్గెస్ట్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సృష్టించిన ప్రత్యేకమైకమైన ప్రపంచం KGF. ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాను రూపొందించిన నీల్ దానికి కొనసాగింపుగా ఎన్నో సీక్వెల్స్‌ను రూపొందించుకునేలా ప్లాన్ చేసుకున్నారు. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రూపొందిన సలార్ మూవీ టీజర్‌లో ప్రేక్షకులకు కళ్లు చెదిరే టీజర్‌ను అందించింది. సలార్ యూనివర్స్‌లోని పార్ట్ 1కు సంబంధించిన టీజర్ మాత్రమే ఇది. ఇక థియేట్రికల్ ట్రైలర్‌లో ఇంకెన్ని ఆసక్తికరమైన విషయాలుంటాయనేది అందరిలోనూ క్యూరియాసిటీని కలిగిస్తోంది.
సలార్.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీగా ‘సలార్ 1: సీస్ ఫైర్’ తెరకెక్కుతోంది. విజయ్ కిరగందూర్ నిర్మాత. ఇదే బ్యానర్‌లో రూపొందిన కె.జి.యప్ సినిమాలో సాంకేతిక నిపుణులే సలార్ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ఇలాంటి సినిమా రాలేదనేంత గొప్పగా రూపొందిస్తున్నారు. రామో జీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం 14 భారీ సెట్స్ వేసి మ,రీ చిత్రీకరించారు. ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతీ హాసన్, జగపతిబాబు వంటి భారీ తారాగణంతో ప్రశాంత్ నీల్ అన్ కాంప్రమైజ్డ్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 28న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భౄషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదలవుతుంది.
బాహుబలి, కె.జి.యఫ్ చిత్రాలను రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఇప్పుడు ఈ చిత్రాలకు సమానంగా సలార్ సినిమాను ఆడియెన్స్‌ను అలరించనుంది. . సలార్ సినిమాను ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దడానికి విదేశీ సాంకేతిక నిపుణులు, అలాగే స్టార్ స్టంట్ మెన్స్ ను ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతీ హాసన్, ఈశ్వరీ రావు, జగపతిబాబు, శ్రియా రెడ్డి తదితరులు బిగ్ స్క్రీన్‌పై తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు.
No comments