- హైదరాబాద్ తో పాటు ప్రతిష్ఠాత్మక న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వేదికలుగా ప్రారంభించిన సితార కలెక్షన్స్...
హైదరాబాద్, 04 జూలై 2023: నాణ్యత ప్రమాణాల్లో దక్షిణ భారత్ లోనే అత్యంత ప్రసిద్దిగాంచిన పీఎంజే జ్యువెలరీ బ్రాండ్ ఆధ్వర్యంలో రూపొందించబడి, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "సితార సిగ్నేచర్ కలెక్షన్స్' అంతర్జాతీయ వేదికపై ఆవిష్కృతం కాబోతుంది. అనూహ్యంగా జూలై 4వ తేదీన యూ ఎస్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈ ఆవిష్కరణతో మరింత వినూత్నంగా జరపనున్నారు పీఎమ్ జే జ్యువెల్స్. ఎంటర్టైన్మెంట్ వేదికలపై వెలిగిపోతున్న టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారను పీఏమ్ జే తమ కలెక్షన్స్ కు బ్రాండ్ ఫేస్ గా ఎంచుకుంది. విభిన్న డిజైన్లతో రూపొందించిన సితార కలెక్షన్స్ ను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో జూలై 4న ప్రారంభించారు. అదే కోవలో 6వ తేదీన భారత్ వేదికగా హైదరాబాద్ నగరంలో ప్రారంభించనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికలతో పాటు జూలై 13న విజయవాడలో ప్రత్యేకంగా అతి పెద్ద వివాహ ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు.
సున్నితమైన హస్తకళతో తయారు చేసిన ఆకర్షణీయమైన ఈ డిజైన్‌లు..పీ ఎమ్ జే సంస్థకు చెందిన ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన పది వేల కన్నా ఎక్కువ డిజైన్ల నుంచి ఎంపిక చేసినవి. అందరినీ ఆకట్టుకునేలా పీఎంజే జ్యువెల్స్ తమ ఉత్పత్తులలో డి బీర్స్ ఫరెవర్‌మార్క్‌ని ఉపయోగించిన చరిత్రను కలిగి ఉంది. ఎందుకంటే అవి అత్యంత ప్రతిష్టాత్మకమైనవే కాకుండా విలువైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ నూతన ఆభరణాల శ్రేణి 'ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఎ స్టార్' అనే థీమ్ తో పాటు రాబోయే శతాబ్దాలపాటు కుటుంబాలలో కీలకంగా ఆదరించబడటమే లక్ష్యంగా పెట్టుకుంది.
SITARA కలెక్షన్‌ను ప్రారంభించడంతో, PMJ జ్యువెల్స్ అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది. అధునాతన డిజై్లకు సున్నితమైన హస్తకళల ప్రావీణ్యాన్ని జోడించడంతో ఈ బ్రాండ్ ఈ తరం కుటుంబాల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. దీనితో పాటు భవిష్యత్ తరాలకు ఆకట్టుకునే ఆభరణాలను రూపొందించడమే పీ ఎమ్ జే లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని తరాల సంస్కృతులను, నవీన ట్రెండ్ లను 'సితార కలెక్షన్స్'లో భాగం చేసుకుంటుంది. కళాత్మకత నింపుకున్న ఈ కలెక్షన్స్ విషయంలో బ్రాండ్ విలువను పెంచుకుంటూ, నాణ్యతను కొనసాగించడంలో పీ ఎమ్ జే తన అంకితభావం, నిబద్ధతను మరో సారి చాటుకుంది.
న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ఏర్పాటు చేస్తున్న అద్భుత కలెక్షన్స్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి PMJ జ్యువెల్స్ జూలై 4న ఉదయం 9.30 గంటలకు IST ఆధ్వర్యంలోని సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్ష ప్రసారం.
పీఎంజే జ్యువెల్స్ నూతన కలెక్షన్స్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార బ్రాండ్ ఫేస్ గా "సితార కలెక్షన్స్' ఆవిష్కరణ…
Reviewed by firstshowz
on
5:16 pm
Rating: 5
No comments