సుప్రీమ్ హీరో సాయితేజ్ చేతుల మీదుగా విడుదలైన ‘సుందరం మాస్టర్’ టీజర్

హ‌ర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్ర‌ధాన తారాగ‌ణంగా ఆర్‌.టి.టీమ్ వ‌ర్క్స్‌, గోల్ డెన్ మీడియా బ్యాన‌ర్స్‌పై క‌ళ్యాణ్ సంతోష్ దర్శ‌క‌త్వంలో ర‌వితేజ‌, సుధీర్ కుమార్ కుర్రు నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం ‘సుందరం మాస్టార్’.  సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథే ఇది. తను గవర్నమెంట్ టీజర్. సోషల్ స్టడీస్ బోధిస్తుంటాడు. అయితే మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అందులో అన్నీ వ‌య‌సుల‌వారు ఇంగ్లీష్ నేర్చుకోవ‌టానికి విద్యార్థులుగా వ‌స్తారు. మ‌రి సుంద‌రం మాస్టార్ వారికెలా ఇంగ్లీష్‌ను బోధించారు అనే విష‌యం ఎంట‌ర్‌టైనింగ్‌గా రూపొందించిన చిత్ర‌మే ఇది. ఈ సినిమా టీజ‌ర్‌ను సుప్రీమ్ హీరో సాయితేజ్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం వైజాగ్‌లో జ‌రిగింది. ఈ కార్యక్రమంలో...

సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ ‘‘సుందరం మాస్టర్ టీజర్ రిలీజ్ చేయటానికి ఐదు కార‌ణాలు, అక్ష‌ర‌, ర‌మ‌గారు, రావుగారు మొద‌టి మూడు కార‌ణాలు. హ‌ర్ష వాళ్ల‌బ్బాయే. త‌ను బాగా న‌టిస్తాడు. ఇంకా మంచి స్థాయికి చేరుకుంటాడ‌ని ఆశిస్తున్నా వాళ్ల‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఇక నాలుగో కార‌ణం.. నా ఫేవ‌రెట్ హీరో ర‌వితేజ‌గారు. ఆయ‌న నాకు చాలా చిన్న చిన్న విలువైన విష‌యాల‌ను నేర్పించారు. ఆయ‌న కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఐదో కార‌ణం.. ప్రేక్ష‌కుల ప్రేమను పొంద‌డానికే వచ్చాను. మా సుంద‌రం మాస్ట‌ర్ టీమ్‌.. డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ సంతోష్‌, సుధీర్ వ‌ర్మ‌గారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్‌గారికి.. అంద‌రికీ మీ ప్రేమ‌ను అందిస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నాను. 

హర్ష చెముడు మాట్లాడుతూ ‘‘నేను చాలా మందికి చాలా థాంక్స్. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన శబరీష్‌కి థాంక్స్‌. నా త‌ల్లిదండ్రులు, నా భార్య అంద‌రూ నా బిహేవియ‌ర్‌ను భ‌రించారు. క‌ళ్యాణ్ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు నువ్వే హీరో అన్నాడు. ఊరుకో బాసూ! ఏం మాట్లాడుతున్నావ్ అన్నాను. పూర్తి క‌థ విన్న త‌ర్వాత ఎవ‌రికీ చెప్ప‌కు ఇది నేనే చేస్తాను అని అన్నాను. అంత బాగా ఉంది. వైవా రిలీజ్ అయ్యి 10 ఏళ్లు అవుతుంది. ప‌దేళ్ల ముందు షార్ట్ ఫిల్మ్ వ‌స్తే.. 10 ఏళ్లలో మీరు న‌న్ను ఇక్క‌డ నిలుచో బెట్టారు. క‌ష్ట‌ప‌డితే అంద‌రూ మీ ల‌క్ష్యాల‌ను చేరుకుంటారు. నాకు ఇది చాలా ఎమోష‌న‌ల్ మూమెంట్‌. క‌ళ్యాణ్ స్క్రిప్ట్‌ను బ్యూటీఫుల్‌గా రాస్తే సుధీర్‌గారు, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌గారు అద్భుతంగా నిర్మించారు. ర‌వితేజ‌గారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి.. ఇక్క‌డ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారికి స‌పోర్ట్ అందిస్తున్నారు. మా టీమ సినిమా కోసం ప‌డ్డ క‌ష్టం ముందు నేను న‌థింగ్‌. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. సాయి బ్రో వ‌చ్చి టీజ‌ర్ విడుద‌ల చేసినందుకు థాంక్స్‌’’ అన్నారు. 

ప్ర‌శాంత్‌ మాట్లాడుతూ ‘‘హర్ష ఇంజ‌నీరింగ్‌లో మా జూనియ‌ర్‌. అప్ప‌ట్లో ఎవ‌రైనా త‌న‌ను కామెంట్ చేసినా దాన్ని పాజిటివ్‌గానే తీసుకునేవాడు. మ‌న వ‌ల్ల ఒక‌రు న‌వ్వుతున్నారు క‌దా! అని లైట్ తీసుకునేవాడు. ఈరోజు త‌న టాలెంట్‌తో ఇక్క‌డ నిల‌బ‌డ్డాడు. త‌నే కాదు.. ఎవ‌రైనా గ‌ట్టిగా ట్రై చేస్తే మంచి స్టేజ్‌కి వ‌స్తార‌న‌టానికి హ‌ర్ష ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

చిత్ర దర్శకుడు కళ్యాణ్ సంతోష్ మాట్లాడుతూ ‘‘మా ఆర్ట్ డైరెక్ట‌ర్‌, కాస్ట్యూమ్ టీమ్ సినిమాకు ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఇంత బాగా రావ‌టానికి మెయిన్ రీజ‌న్ ముగ్గురు వ్య‌క్తులు. అందులో మొద‌టివాడు హ‌ర్ష‌. మా సినిమాను ర‌వితేజ‌గారు ప్రొడ్యూస్ చేస్తున్నార‌ని చెప్ప‌గానే ముందు న‌మ్మ‌లేదు. త‌ను ప్రామిస్ చేసిన స‌ర్‌ప్రైజ్‌ల‌ను పూర్తి చేశాడు. ఇక సినిమా బాగా రావ‌టానికి కార‌ణ‌మైన వ్య‌క్తుల్లో రెండో వ్య‌క్తి సుధీర్ వ‌ర్మ‌గారు. న‌న్ను న‌మ్మి సుధీర్ వ‌ర్మ‌గారు సినిమాను ఇంత వ‌ర‌కు తీసుకొచ్చారు. ఆయ‌న నా స‌పోర్ట్ సిస్ట‌మ్‌గా నిలిచారు. ఇక సినిమా బాగా రావ‌టానికి మూడో కార‌ణం ర‌వితేజ‌గారు. ప్ర‌తి డైరెక్ట‌ర్ ర‌వితేజ‌గారితో సినిమా చేయాల‌నుకుంటారు. నేను కూడా చేశాను. అయితే ఆయ‌న నిర్మాణంలో సినిమా చేశాను. ఆయ‌న కొత్త వాళ్ల‌తో సినిమా చేస్తూ ఎంక‌రేజ్ చేస్తున్నందుకు ఆయ‌న థాంక్స్‌. ఇక ఇక్క‌డ‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చిన సాయితేజ్‌గారికి థాంక్స్‌. త‌ను చాలా మంచి పాజిటివ్ వ్య‌క్తి. మా సినిమాకు స‌పోర్ట్ చేస్తున్న ఆయ‌న‌కు థాంక్స్‌’’ అన్నారు. 

సుధీర్ వ‌ర్మ మాట్లాడుతూ ‘‘హర్ష హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి తెలుసు. తను ఈరోజు కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నాడు. త‌ను ఇంకా గొప్ప స్థానాకి వెళ్లాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


చందు మొండేటి మాట్లాడుతూ ‘సుందరం మాస్టర్’ మూవీ టీజ‌ర్ చాలా బావుంది. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. డైరెక్ట‌ర్ సంతోష్‌, నిర్మాత సుధీర్‌ల‌కు ఈ సినిమా హిట్టై చాలా మంచి పేరు వ‌స్తుంది. హ‌ర్ష హార్డ్ వ‌ర్కర్ మాత్ర‌మే కాదు... స్మార్ట్ ప‌ర్స‌న్ కూడా. త‌న‌కు ఈ సినిమా పెద్ద స‌క్సెస్‌గా నిలుస్తుంది’’ అన్నారు. 

హీరోయిన్ దివ్య శ్రీపాద మాట్లాడుతూ ‘‘సుంద‌రం మాస్ట‌ర్‌ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు కథ విన్నాను. హర్షకి ఫోన్ చేసి నీకు తగిన మంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌న చెప్పాను. పాజిటివ్ ఎన‌ర్జీతో సినిమాను పూర్తి చేశాం. టీజ‌ర్‌ను మించి సినిమా ఉంటుంది. అంద‌రూ థియేట‌ర్‌లో మూవీని ఎంజాయ్ చేస్తారు. యాక్ట‌ర్‌గా హ‌ర్ష నుంచి చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను’’ అన్నారు. 

నటీనటులు:  హ‌ర్ష చెముడు, దివ్య శ్రీపాద త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్‌: ఆర్‌.టి.టీమ్ వ‌ర్క్స్‌, గోల్ డెన్ మీడియా 
నిర్మాత‌లు:  ర‌వితేజ‌, సుధీర్ కుమార్ కుర్రు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  క‌ళ్యాణ్ సంతోష్‌
మ్యూజిక్‌:  శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్స్‌:  శ్వేత కాక‌ర్లపూడి, షాలిని నంబు
సినిమాటోగ్ర‌ఫీ:  దీప‌క్ ఎరెగ‌డ‌
ఆర్ట్‌:  చంద్ర‌మౌళి
కాస్ట్యూమ్స్‌:  శ్రీహిత కోట‌గిరి, రాజ‌శేఖ‌ర్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  హేమంత్ కుర్రు
ఎడిట‌ర్‌:  కార్తీక్ ఉన్న‌వా
సౌండ్‌:  సాయి మ‌ణింద‌ర్ రెడ్డి
కొరియోగ్ర‌ఫీ:  విజ‌య్ బిన్ని
పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా

No comments