మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ చేతుల మీదుగా సాయిధ‌ర‌మ్ తేజ్‌, క‌ల‌ర్స్ స్వాతి న‌టించిన‌ ‘సోల్ ఆఫ్ సత్య’ వీడియో సాంగ్ విడుదల


ఈ ఆగ‌స్ట్ 15న స్వాతంత్య్ర‌దినోత్స‌వం సంద‌ర్భంగా సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఓ స్పెష‌ల్ మ్యూజిక‌ల్ షార్ట్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చారు. త‌న స్నేహితులైన హ‌ర్షిత్ రెడ్డి, న‌వీన్‌ల‌తో క‌లిసి ఈ వీడియో సాంగ్‌ను రూపొందించారు. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న స్వాతి రెడ్డి న‌టించారు. ప్ర‌పంచానికి తెలియ‌కుండా దేశం కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి పోరాటం చేసే ఎంద‌రో అజ్ఞాత యోధుల‌కు నివాళిగా ఈ పాట‌ను రూపొందించారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చేతుల మీదుగా ఈ సోల్ ఆఫ్ సత్య స్పెష‌ల్ మ్యూజిక‌ల్ షార్ట్‌ను విడుద‌ల చేయ‌టం విశేషం. 


స్పెష‌ల్ వీడియో సాంగ్‌ను గ‌మ‌నిస్తే అందులో ఓ అమ్మాయి (క‌ల‌ర్స్ స్వాతి) చిన్న‌ప్ప‌టి నుంచి రాణిలా బ‌తుకుతుంది. త‌న‌కు కాబోయేవాడు కూడా రాజులా ఉండాల‌ని, త‌ను ఎంతో ప్రేమ‌గా చూసుకోవాల‌ని క‌ల‌లు కంటుంది. ఆమె క‌ల‌గ‌న్న‌ట్లే ఆమెను పెళ్లి చేసుకున్న యువ‌కుడు ఆమెను ఎంతో ప్రేమ‌గా చూసుకుంటుంటాడు. ఎంతో అంద‌మైన వారి ప్ర‌యాణంలో ఆమె త‌ల్ల‌వుతుంది. కానీ బిడ్డ‌ను క‌నే స‌మ‌యంలో భ‌ర్త‌కు ఆమెకు దూరంగా ఉంటాడు. అందుకు కార‌ణం దేశ ర‌క్ష‌ణ‌. భ‌ర్త దేశాన్ని నాశ‌నం చేయాల‌నుకునే విద్రోహుల‌తో పోరాటం చేస్తుంటే మ‌రో వైపు ఆమె బిడ్డ‌కు జ‌న్మనిస్తుంది. అలా ఓ అమ్మాయి దేశం కోసం త‌న ప్రేమ‌ను త్యాగం చేస్తుంది. అలా దేశం కోసం త్యాగాల‌ను చేసే ఎంద‌రికో ఈ పాట‌ను అంకితం చేశారు మేక‌ర్స్‌. సాయిధ‌ర‌మ్ తేజ్‌, క‌ల‌ర్స్ స్వాతి మ‌ధ్య కెమిస్ట్రీ చ‌క్క‌గా ఉంది. 

‘విరూపాక్ష‌’తో బ్లాక్ బస్టర్ సాధించిన హీరో సాయిధరమ్ తేజ్..‘బలగం’ వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ తర్వాత హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి కలిసి చేసిన ఈ మ్యూజికల్ షార్ట్‌తో చాలా మంది టాలెంటెడ్ టెక్నీషియ‌న్స్‌ను ప‌రిచ‌యం చేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మ‌ల మ‌న‌వ‌డు, సాయిధ‌ర‌మ్ తేజ్ స్నేహితుడైన‌ న‌వీన్ విజ‌య్ కృష్ణ ఈ సాంగ్‌ను డైరెక్ట్ చేశారు. ఇదే ఆయ‌న డైరెక్ష‌న‌ల్ డెబ్యూ. సింగ‌ర్ శ్రుతి రంజ‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచయం అయ్యారు. మ‌రో యంగ్ సింగ‌ర్ సాకేత్ కోమండూరి ఈ పాట‌కు బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు.

No comments