Home/News/ఎంత ప్రేమతో అయితే ‘స్పార్క్L.I.F.E’ సినిమా చేశానో అదే ప్రేమను ప్రేక్షకులు అందిస్తారని భావిస్తున్నాను - టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో, డైరెక్టర్ విక్రాంత్
ఎంత ప్రేమతో అయితే ‘స్పార్క్L.I.F.E’ సినిమా చేశానో అదే ప్రేమను ప్రేక్షకులు అందిస్తారని భావిస్తున్నాను - టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో, డైరెక్టర్ విక్రాంత్
విక్రాంత్, మెహరీన్ పిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విక్రాంత్ హీరోగా నటిస్తూ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో...
నటుడు గురుసోమసుందరం మాట్లాడుతూ ``నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో చేయడం. విలన్‌గా నటించాను. అంతే కాదు, నేనే ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పాను. విక్రాంత్ రెడ్డితో పనిచేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. నేను కొచ్చిలో ఉన్నప్పుడు వచ్చి నన్ను కలిశారు. నేనే విలన్‌గా చేయాలని ఫిక్స్ అయినట్టు తెలిపారు. చాలా మంచి టీమ్‌తో కలిసి పనిచేశాను. తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ. నేను మదురైలో పుట్టాను. 80 రన్నింగ్ థియేటర్స్ ఉంటాయి. నా స్కూల్‌కి ముందు 12 థియేటర్లు ఉంటాయి. అక్కడున్న థియేటర్ పేర్లన్నీ ఒక టైప్‌లో ఉంటాయి. ఇతర భాషల సినిమాలను తమిళ్‌లో అనువాదం చేసి విడుదల చేసేవారు. ముఠామేస్త్రీ ఇప్పటికీ నాకు చాలా ఇష్టమైన సినిమా. మాన్బుమిగు మేస్త్రీ అని అక్కడ విడుదల చేశారు. క్షణక్షణం సినిమాను ఎన్నమో నడక్కుదు అని విడుదల చేశారు. ఆ సినిమాలన్నీ చూసి ఎంజాయ్ చేశాను. నేను తెలుగు సినిమాలో నటించానని అనుకుంటుంటే ఈ క్షణం వరకు నమ్మలేకపోతున్నాను. అమితాబ్ బచ్చన్ అంటే నాకు ఇష్టం. షారుఖ్‌ని నేను హార్డ్ కోర్ ఫ్యాన్. బాజీగర్ చూసినప్పుడు నాకు హిందీ కూడా తెలియదు. బాజీగర్‌లో షారుఖ్‌లా కళ్లజోడు పెట్టుకునేవాడిని`` అని అన్నారు.
హీరోయిన్ రుక్సార్ మాట్లాడుతూ ``ఇండస్ట్రీలో బ్యాక్ బోన్‌గా ఉన్న చాలా మంది ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. స్పార్క్ చాలా మంచి సినిమా. మనందరిలోనూ స్పార్క్ ఉంటుంది. ఫస్ట్ టీజర్‌లో మా సినిమా స్పార్క్ అందరికీ తెలిసి ఉంటుంది. కథ వినగానే చాలా డిఫరెంట్‌గా, స్పార్క్ గా అనిపించింది. యంగ్, ఫ్రెష్ మైండ్స్ కలిసి చేసిన సినిమా ఇది. డిఫరెంట్‌గా, యూనిక్‌గా చేయాలనుకుని చేశాం. ప్రతిభావంతులైన నటీనటులు ఈ సినిమాకు పనిచేశారు. మెహ్రీన్, విక్రాంత్ అందరూ సినిమాను నెక్స్ట్ రేంజ్‌లో నిలబెట్టారు. నా ఫ్యాన్స్ కి, మా అభిమానులు అందరికీ ధన్యవాదాలు`` అని అన్నారు.
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా మాట్లాడుతూ ``చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు. చాలా రోజుల తర్వాత ఈ స్టేజ్ మీద ఉన్నందుకు హ్యాపీగా ఉంది. స్పార్క్ నాకు చాలా చాలా చాలా స్పెషల్ సినిమా. ఈ సినిమాలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. డెబ్యూ ఫిల్మ్స్, డెబ్యూ కోస్టార్స్ చాలా స్పెషల్‌గా ఉంటాయి. విక్రాంత్ చాలా బాగా కష్టపడ్డారు. చాలా ఇష్టపడి చేశారు. విక్రాంత్‌ని కలిసిన క్షణం నుంచి ఇప్పటిదాకా నేను మర్చిపోలేను. మా నిర్మాత మరిన్ని సినిమాలు నిర్మించాలని ఆకాంక్షిస్తున్నాను. సహ నటీనటులందరూ చాలా బాగా నటించారు. విక్రాంత్‌కి ఇది స్టార్టింగ్ మాత్రమే. చేయాల్సిన ప్రయాణం ఇంకా చాలా ఉంది`` అని అన్నారు.
అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ``నేను గ్లింప్స్ చూశాను. విక్రాంత్ చాలా బాగా చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ చాలా బావున్నాయి. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను`` అని చెప్పారు.
అనంతశ్రీరామ్ మాట్లాడుతూ ``ఎక్కువ మంది నిర్మాతలు వచ్చిన కార్యక్రమం ఇది. నిర్మాతల పరిభాషలో ఈ సినిమాకు ఒక కొత్త హీరోకి పెట్టాల్సిన బడ్జెట్ కన్నా ఎక్కువ పెట్టారు. కానీ, గొప్ప కథకు పెట్టాల్సినంత బడ్జెట్ పెట్టారు. పాట రూపొందడంలో జట్టుగా పనిచేశాం. పాటలో వచ్చే ప్రతి మలుపునూ ఆస్వాదించాం. పాటలు విడుదలయ్యాక అందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను`` అని అన్నారు.
నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ``ఇవాళ పొద్దునే విక్రాంత్‌తో మాట్లాడా. విక్రాంత్ యు.ఎస్.లో బిజినెస్ చేస్తాడని తెలుసు. తనే హీరో, తనే డైరక్షన్ చేశారు. రెండు పనులు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇప్పుడే టీజర్ చూశా. ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. సినిమా హిట్ కావాలి`` అని అన్నారు.
మినిష్టర్ జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ``నేను మొదటి నుంచీ సినిమాలకు దూరంగా ఉంటాను. సినిమాలు చూడను. చూస్తే విమర్శలు చేస్తా. దేన్నైనా విమర్శానాత్మకంగా చూసే అలవాటు ఉంది. విక్రాంత్ వచ్చి రమ్మని ఆహ్వానించారు. సినిమా టీజర్ రిలీజ్ ఉంది రావాలని ఆహ్వానించారు. చాలా వరకు బయట కనపడటానికి, సినిమాలో ఉండటానికి తేడా ఉంటుంది. తానే నటించి, డైరక్ట్ చేసి, నిర్మించినట్టు తెలిపారు. సినిమాలో స్పార్క్ ఉంది. విక్రాంత్‌లో స్పార్క్ ఉందనిపించింది. 10 - 15 ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. గతంలో ఫైటింగ్ ఓరియంటెంట్ సినిమాలు చాలా ఉండేవి. టీజర్ ప్రారంభం చూడగానే నాకు శివ గుర్తొచ్చింది. ఇప్పటి తరానికి మరో కొత్త ట్రెండ్‌ని పరిచయం చేస్తుందని భావిస్తున్నా. ఈ సినిమా తప్పకుండా ట్రెండ్ సెట్టర్ అవుతుంది. విక్రాంత్‌లో ఉన్న స్పార్క్ ని కొత్తగా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంది. టీమ్ అందరికీ శుభాకాంక్షలు. విజయం సాధించాలి`` అని అన్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్ మాట్లాడుతూ ``విక్రాంత్‌కి ఆల్ ది బెస్ట్. టీజర్ బావుంది.తను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించటం అనేది ఇప్పుడున్న సిట్యువేషన్‌లో తనకు ఎక్స్‌పెరిమెంట్ అనే చెప్పాలి. సినిమా మంచి విజయాన్ని సాధించాలి`` అన్నారు.
సీనియర్ నిర్మాతసి.అశ్వినీదత్ మాట్లాడుతూ ``నేను విక్రాంత్‌ని ఓసారి విమానాశ్రయంలో కలిశాను. కలిసినప్పుడే ఎంతో ఇంప్రెసివ్‌గా అనిపించింది. రెండు నెలలు తర్వాత మా ఆఫీసుకి వచ్చి తనే హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా గురించి చెప్పారు. సినిమాకు సంబంధించిన వీడియోను నాకు చూపించారు. ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సమ్‌థింగ్ అవుతారనిపించింది. సాఫ్ట్‌వేర్ రంగం నుంచి సినిమా రంగంపై ఉన్న ప్యాషన్‌తో వచ్చారు. అందులోనూ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేయటం గొప్ప విషయం`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్హేషం అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ ``విక్రాంత్ మంచి వ్యక్తి. నేను ఈ సినిమాలో భాగం కావటంపై చాలా సంతోషంగా ఉన్నాను. స్పార్క్ మ్యూజిక్ మంచి ట్రీట్ అవుతుందని చెప్పగలను`` అన్నారు.
టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ``నేను ఈ మధ్యనే విక్రాంత్‌ని కలిశాను. నేను 25 సినిమాలు చేసినా తనతో గడిపిన గంట సమయంలో చాలా విషయాలను తెలుసుకున్నాను. తను సినిమాను తెరకెక్కించిన తీరు చూసి షాకయ్యాను. నాకంటే సినిమాపై ఎంతో ప్యాషన్ ఉంది. తనకు, టీమ్‌కు ఆల్ ది బస్ట్`` అన్నారు.
వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ ``స్పార్క్` టీమ్‌కు ధన్యవాదాలు`` అన్నారు.
హీరో, దర్శకుడువిక్రాంత్ మాట్లాడుతూ ``నేను సినిమా లవర్‌గా స్పార్క్ సినిమాను స్టార్ట్ చేశాను. మా ఈవెంట్‌కి అశ్వినీదత్‌గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఆయన చేత్తో లాంచ్ చేసిన ఏ హీరో అయినా సూపర్ స్టార్. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని గారికి థాంక్స్. అలాగే అన్వేష్‌రెడ్డిగారు, జగదీష్ రెడ్డిగారు, ఎమ్మెల్యే కిశోర్‌గారు సహా అందరికీ థాంక్స్. నేను చిన్నప్పట్నుంచి సినిమాలను చాలా ఎక్కువగా ఇష్టపడేవాడిని. నాన్నకు ఉద్యోగరీత్యా ట్రాన్స్‌ఫర్స్ ఎక్కువగా అవుతుండేవి. ఎక్కడకు వెళ్లినా దగ్గరగా ఏ థియేటర్ ఉంది.. ఏ సినిమాను చూడాలి అని ఆలోచనతో ఉండే వాడిని. యు.ఎస్ వెళ్లి చదువుకుని జాజ్ చేసినప్పటికీ సినిమాపై ప్రేమ పెరిగిందే కానీ, తగ్గలేదు. ఆ ప్రేమతోనే రెండేళ్ల పాటు కష్టపడి స్పార్క్ సినిమా కథను డెవలప్ చేసుకున్నాను. ఈ జర్నీలో మా డెఫ్ ఫ్రాగ్ టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది. సినిమా చేసే క్రమంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. అందులో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతోనే ప్రయాణించాం. మా సినిమాలో నటించిన నటీనటుల విషయానికి వస్తే.. హీరోయిన్స్ మెహరీన్, రుక్సార్ థిల్లన్ గురించి చెప్పింది. ఇద్దరూ అద్భుతంగా నటించారు. గురు సోమసుందరం పోషించిన పాత్ర చాలా ఏళ్ల పాటు గుర్తుండిపోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సుహాసినిగారు కీలక పాత్రలో నటించారు. నాజర్, శ్రీకాంత్ అయ్యంగారు, వెన్నెల కిషోర్, రాజా రవీంద్ర, చమ్మక్ చంద్ర, ఆషూ రెడ్డి.. ఇలా అందరూ ఎంతో బాగా నటించారు. ఇక తెర వెనుక ఉండి నటీనటులు నడిపించారు. వారిలో మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీలో నెక్ట్స్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. హృదయం సినిమా చూడగానే ఆయనే నా మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్స్ అయిపోయాను. స్పార్క్ కోసం అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆయన సంగీతానికి అనంత శ్రీరామ్‌గారు అద్భుతమైన లిరిక్స్ అందించారు. అశోక్ కుమార్‌గారు వండర్ఫుల్ విజువల్స్ ఇచ్చారు. మా ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ రామ్ ప్రసాద్, కో డైరెక్టర్ స్వామిగారు, రైటర్స్ ఉమర్ జీ అనురాధ అందరూ బెస్ట్ మూవీ చేయాలని కష్టపడ్డారు. నేను ఎంత ప్రేమతో అయితే ఈ సినిమా చేశానో అదే ప్రేమను ప్రేక్షకులు అందిస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
ఎంత ప్రేమతో అయితే ‘స్పార్క్L.I.F.E’ సినిమా చేశానో అదే ప్రేమను ప్రేక్షకులు అందిస్తారని భావిస్తున్నాను - టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో, డైరెక్టర్ విక్రాంత్
Reviewed by firstshowz
on
12:54 pm
Rating: 5
No comments