బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే నటీనటులుగా సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’. ఆదివారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమాను అన్ కాంప్రైమజ్డ్‌గా నిర్మించారు నిర్మాత గూడూరు సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి, దర్శకుడు యాటా సత్యనారాయణ, ఎమ్మెల్యే రాజా సింగ్, హీరోయిన్ అనుష్య త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘‘నేటి యువతకు సందేశం ఇవ్వడానికే ఈ సినిమా తీశారు. మనకు స్వాతంత్ర్యం ఎలా వచ్చింది? అనేది చెప్పేందుకు ఈ మూవీని తీశాం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్‌ను ఆపేందుకు చాలా మంది ప్రయత్నించారు. కాశ్మీర్, కేరళల్లో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. కానీ సినిమా చూసి తెలుసుకున్నారు. రజాకార్ సినిమా ద్వారా నాడు ఏం జరిగిందో చూపిస్తున్నారు. ఇలాంటి సినిమాను తీసే ధైర్యం చేసిన మా డైరెక్టర్‌కు థాంక్స్. ఈ సినిమాకు నేను గెస్టుగా వచ్చాను కాబట్టి ఇంకా సమస్యలు వస్తాయి. ఈ మూవీని చాలా మంది అడ్డుకుంటారు. దీనికి కౌంటర్‌గా సినిమాలు కూడా ప్రకటిస్తారు. టీజర్ చూస్తేనే ఎంతో కోపం వస్తుంది కదా? రేపు సినిమాను చూస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. కర్ణాటక, మహారాష్ట్ర, మన రాష్ట్రాల్లోని యువతకు మంచి సందేశం ఇచ్చేలా సినిమా ఉంటుంది’’ అని అన్నారు.
అనుష్య త్రిపాఠి మాట్లాడుతూ ‘‘ఏడాదిన్నర క్రితం ‘రజాకార్’కు సంబంధించిన జర్నీ ప్రారంభమైంది. ఈరోజు ఇలా మీ ముందు నిలబడి ఉన్నాం. ఇలాంటి గొప్ప సినిమాలో నటించటం గర్వంగా ఉంది. సినిమా ఇక్కడి వరకు వచ్చిందంటే మా నిర్మాత గూడూరు నారాయణరెడ్డిగారి వల్లనే సాధ్యమైంది. మనం చరిత్ర నుంచి చాలా విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు యాటా సత్యనారాయణగారికి థాంక్స్’’ అన్నారు.
చిత్ర దర్శకుడు యాటా సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘ఎమ్మెల్యే రాజా సింగ్‌గారికి, నిర్మాత గూడూరు నారాయణరెడ్డిగారికి, హీరోయిన్ అనుష్య త్రిపాఠి సహా నా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్. మన దేశానికి ఆగస్ట్ 15న స్వాతంత్య్రం వచ్చింది. అయితే మన తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటకలకు మాత్రం స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందంటే తెలియని పరిస్థితి నెలకొంది. స్వాతంత్య్రం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో ప్రాణ త్యాగం చేశారు. అయితే దాని కోసం పోరాటం చేసిన వారి గురించి ఎవరికీ తెలియలేదు. రక్తంతో తడిసిన చరిత్ర మట్టిలో కలిసిపోయింది. చరిత్రను తొక్కేశారు. నా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు స్వాతంత్ర్యం వచ్చిన సెప్టెంబర్ 17 కథా వస్తువుగా మారింది. ఆ రోజు జరిగిన విముక్తి పోరాటం ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాను. ఇది మత పోరాటం కాదు.. స్వాతంత్య్ర పోరాటం. దీన్ని మతం దృష్టితో కాకుండా పోరాటం దృష్టితో చూడాలి. ఇది మత చరిత్ర కాదు..గత చరిత్ర. ఈ సినిమాను నేను ఇంత బాగా చేయటానికి కారణం గూడురు నారాయణ రెడ్డిగారు. మేం హీరో కోసమో మరి దేని కోసమో తాపత్రయ పడటం లేదు. స్వాతంత్ర్యం కోసం ఇక్కడ జరిగిన పోరాటమే హీరో. ఇది మన చరిత్ర, మన పెద్దల చరిత్ర. కాబట్టి అందరూ ఈ సినిమాను భుజ స్కంధాలపై తీసుకెళతారని ఆశిస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో జరిగిన పోరాటమే విమోచన పోరాటం.. అదే రోజున విలీనం జరిగింది. ఆ తర్వాత అందరం సమైక్యతా భావంతో ఉన్నాం’’ అన్నారు.
నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఇది జరిగిన కథ. ఓట్ల కోసం శవాలపై పేలాలను ఏరుకునే వ్యక్తులు ఈ చరిత్రను కప్పి పెట్టారు. ఆనాడు మన సమాజంలో జరిగిన విషయాలు గురించి ఈనాటి యువ తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది నా బాధ్యతగా భావించి రజాకార్ సినిమా చేశాను. దీన్ని ఎవరూ వక్రీకరించవద్దు. ఇక్కడి వారికి చాలా మందికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో తెలియదు. అలాంటి వారందరికీ ఈ సినిమా ఓ మంచి మెసేజ్‌ను అందిస్తుందని, మన చరిత్ర గురించి తెలియజేస్తుందని అనుకుంటున్నాను’’ అన్నారు.
నేటి యువతకు మన చరిత్ర గురించి చెప్పాల్సిన బాధ్యతగా భావించి ‘రజాకార్’ సినిమా చేశాను - నిర్మాత గూడురు నారాయణ రెడ్డి
Reviewed by firstshowz
on
7:16 pm
Rating: 5
Post Comment
No comments