"తెప్ప సముద్రం" సినిమా లోని మంగ్లీ పాట విడుదల

శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా నుండి సింగర్ మంగ్లీ పాడిన “యాడున్నాడో” మాస్ బీట్ పాట MRT MUSIC లో విడుదల అయింది. ఈ పాటను వినాయక చవితి సందర్భంగా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది.


నిర్మాత రాఘవేందర్ గౌడ్  మాట్లాడుతూ “తెప్ప సముద్రం” కథ నచ్చి  ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడం జరిగింది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం.

దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ “గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో పని చేసాను. తెప్ప సముద్రం కథనచ్చి నిర్మాత ముందుకు రావడం జరిగింది. అర్జున్, చైతన్య, కిశోరి, రవి శంకర్ గారు అద్బుతంగా సపోర్ట్ చేసారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. 

ఈ చిత్రానికి మాటలు : శ్ర1, 
పాటలు: మంగ్లీ, పెంచల్ దాస్, హేమచంద్ర 
సాహిత్యం : పెంచల్ దాస్, పూర్ణాచారి, బాలాజీ, పి.ఆర్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శేఖర్ పోచంపల్లి
సంగీతం : పి.ఆర్
నిర్మాత :నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : సతీష్ రాపోలు

No comments