భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ అడుగు వేశారు. 'మేడ్ ఇన్ ఇండియా'కు శ్రీకారం చుట్టారు. ఆయన సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి జాతీయ పురస్కార గ్రహీత నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారు.
భారతీయ సినిమాకు పునాది ఎక్కడ పడింది, ఆ తర్వాత ఏ విధంగా ఎదిగింది వంటి విషయాలను సినిమాలో చూపించనున్నారు. ఇండియా సినిమాకు నివాళిగా 'మేడ్ ఇన్ ఇండియా' తెరకెక్కించనున్నారు. కథ, కథనాలతో పాటు విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయని సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా అర్థం అవుతోంది.
మాక్స్ స్టూడియోస్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని ఉన్నత నిర్మాణ విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. మరాఠీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.
ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో 'మేడ్ ఇన్ ఇండియా' - వెండితెరపై భారతీయ సినిమాకు ట్రిబ్యూట్
Reviewed by firstshowz
on
12:22 pm
Rating: 5
No comments