ఆకట్టుకునేలా 'అలా నిన్ను చేరి' ట్రైలర్
మంచి కథతో వచ్చే చిత్రాలను జనాలు ఆదరిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారు. కంటెంట్ కొత్తగా ఉంటే బ్రహ్మరథం పడుతున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ జానర్‌ల వచ్చే చిత్రాలకు ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. అలాంటి ఓ చిత్రమే త్వరలో రాబోతోంది. యంగ్ హీరో దినేష్ తేజ్, అందాల తారలు హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన చిత్రం 'అలా నిన్ను చేరి'. ఈ సినిమాతో ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వాలని మేకర్లు ప్రయత్నిస్తున్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్న క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్,మోషన్ పోస్టర్, గ్లింప్స్, హీరో బర్త్ డే స్పెషల్ పోస్టర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అలా నిన్ను చేరి సినిమా ట్రైలర్‌ను యూనిట్ విడుదల చేసింది.
‘ఈ భూమ్మిద పుట్టిన ప్రతీ మనిషికి ఎదిగేందుకు ఓ కల ఉంటుంది.. నాకూ ఓ కల ఉంది’ అనే డైలాగ్‌తో హీరో ఇంట్రడక్షన్ ఇస్తూ మొదలైన టీజర్‌లో.. ‘దూరంగా ఉంటున్నావో.. దూరం అవుతున్నావో.. దూరం చేస్తున్నావో ఏమీ అర్థం కావడం లేదు’.. అంటూ హీరోయిన్ చెప్పే ఎమోషనల్ డైలాగ్ బాగుంది. ‘అవసరం లేని చోట యుద్దాలు చేయను.. అవసరం అనిపిస్తే కురుక్షేత్ర యుద్దానికి కూడా వెనుకాడను’ అంటూ హీరో చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌తో పాటు ట్రైలర్ చివర్లో.. ‘నీ ఆశయం గొప్పదైతే.. నువ్వు చేసే ప్రయత్నం అంతకంటే గొప్పగా ఉండాలి’.. అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి.
ట్రైలర్‌లో సుభాష్ ఆనంద్ ఆర్ఆర్.. ఐ ఆండ్రూ కెమెరాపనితనం కనిపిస్తోంది. విజువల్స్ బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పని చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్ని పాటలు కూడా ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయడం విశేషం. ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అతిత్వరలో ఈ మూవీ విడుదల తేదిని దర్శక నిర్మాతలు ప్రకటించనున్నారు.
No comments