విడుదలకు సిద్దమైన “అథర్వ”.. డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్..



సస్పెన్స్, క్రైమ్ జానర్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే ఆ జానర్ తో యూత్‌కు నచ్చేలా రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జోడించి అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించిన చిత్రమే అథర్వ. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. 

అథర్వ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అథర్వ సినిమాలో క్లూస్ టీం విశిష్టతను, ప్రాముఖ్యతను చూపించేలా గ్రిప్పింగ్ కథనంతో అందరినీ ఆశ్చర్యపర్చబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ సెన్సార్ జరుగుతోంది. 

అథర్వ అవుట్ పుట్ పట్ల దర్శక నిర్మాతలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్రయూనిట్. ఈ ప్రెస్ మీట్ లో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. 'అథర్వ' సినిమాను డిసెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో భారీగా రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. 

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ప్రెస్ మీట్ కి చిత్రయూనిట్ అంతా పాల్గొని మాట్లాడారు. *ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ..* 'ఒక క్రైమ్ సీన్ లో క్లూ అనేది చాలా ఇంపార్టెంట్. రాబరీ కేస్ అయినా, మర్డర్ కేస్ అయినా దేన్నీ కూడా క్లూస్ లేకుండా ఛేజ్ చేయలేము. ఒక కేసులో ఎంతో ఇంపార్టెంట్ అయిన క్లూస్ ని, ఎవిడెన్స్ ని ఐడెంటిఫై చేసే క్లూస్ డిపార్ట్మెంట్ గురించి ఈ మూవీ. ఈ సినిమాలో కార్తీక్ రాజు బయోమెట్రిక్ అనలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. సిమ్రాన్ చౌదరి ఒక జర్నలిస్ట్ రోల్ ప్లే చేస్తుంది. యాక్టర్స్ అందరూ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. టెక్నిషియన్స్ చాలా బాగా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. అధర్వ సినిమా ప్రతి యాక్టర్ కి, టెక్నిషియన్ కి మంచి పేరు తీసుకొస్తుంది అని నమ్ముతున్నాం. రిలీజయినప్పుడు మంచి పేరు వస్తుంది. నిర్మాతకు డబ్బులు కూడా రావాలి. జనాలు థియేటర్స్ కి రావాలంటే మా సినిమాని మీడియానే వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లాలి. మీ సపోర్ట్ మాకు ఉండాలి. ఈ రోజుల్లో ఒక సినిమా వస్తుంది అని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా చాలా కష్టమైన పని. రిలీజ్ తర్వాత ఒక మంచి సినిమాని ప్రమోట్ చేశామని మీరు కూడా ఫీల్ అవుతారు. డిసెంబర్ 1న అధర్వ సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్ కి వచ్చి చూడండి' అని తెలిపారు. 

 ఇక ఈ సినిమా హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ.. 'చాలా మంది కొత్త అటెంప్ట్ చేస్తున్నామని తమ సినిమా గురించి చెప్తారు. కానీ ఇది నిజంగా కొత్త కాన్సెప్ట్. క్లూస్ టీమ్ మీద ఇండియాలో ఇప్పటివరకు ఎవ్వరూ సినిమా తీయలేదు, నాకు తెలిసినంతవరకు. డైరెక్టర్ చాలా ప్యాషన్ తో తీసిన సినిమా ఇది. రీసెంట్ గా క్లూస్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేక షో వేసినప్పుడు.. వాళ్లంతా సినిమా చూసి డైరెక్టర్ పర్ఫెక్షన్ చాలా బాగుందన్నారు. ప్రతి పాయింట్ చాలా పక్కాగా రాసుకున్నారు అన్నారు. సిమ్రాన్ ఇందులో జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తుంది. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నిర్మాత సుభాష్ కి ఇది మొదటి సినిమా, బాగా డబ్బులు వస్తాయి ఈ సినిమాకు నేను గ్యారెంటీ. ఈ సినిమా రిలీజయ్యాక దీని కోసం పనిచేసిన వారందరికీ మంచి పేరు వస్తుంది. డిసెంబర్ 1న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నారు. మేమంతా కష్టపడ్డాం. మీడియా ఎప్పుడూ సపోర్ట్ ఇస్తారు, ఈ సారి కూడా మీరే సినిమాని పబ్లిక్ లోకి తీసుకెళ్లాలి' అని మీడియాని రిక్వెస్ట్ చేశారు. 

 *నిర్మాత సుభాష్ నూతలపాటి మాట్లాడుతూ..* 'మీడియా వారందరికి మా కోసం టైం తీసుకొని ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఎంతో మంది ప్యాషన్ ఉన్న వాళ్ళు కలిసి కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా అధర్వ. మా సినిమాకు సపోర్ట్ చేసి మీడియా వాళ్ళు జనాల్లోకి తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నాను' అని అన్నారు 

అధర్వ మూవీ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ.. 'ఇక్కడకు మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకు చాలా థ్యాంక్స్. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కి మంచి పేరు వచ్చింది. చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా చేశాం. డిసెంబర్ 1న ఈ సినిమాని సురేష్ బాబు గారు గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడండి. ట్రైలర్ లాంచ్, ప్రమోషన్ ఈవెంట్స్ లో ఇంకా మాట్లాడతాను' అని తెలిపారు.

No comments