డిసెంబర్ 30 న బిగ్ బాస్ కౌషల్ "రైట్ " సినిమా


మణి దీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైనలూకాలపు మధు, మహంకాళి దివాకర్ కలిసి నిర్మిస్తున్న సినిమా " రైట్". శంకర్ దర్శకుడు గా చేస్తున్న ఈ సినిమా లో బిగ్ బాస్ కౌషల్ హీరో గా చేస్తున్న సంగతి విదితమే, విక్టరీ వెంకటేష్ 1స్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుండి మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 30 న విడుదల కి సిద్ధమైనది.ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, రిలీజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా నిర్మాత మధు మాట్లాడుతూ "మేము అనుకున్నట్లుగా సినిమా వచ్చింది, కౌషల్ ఆర్మీ కి, సాధారణ ప్రేక్షకులకు సైతం సినిమా బాగా నచ్చుతుంది. డిసెంబర్ 30 న సినిమా ని విడుదల చేస్తున్నాం" అని అన్నారు.

డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ "మంచి కమర్షియల్ సినిమా ఇది, కౌషల్ కి పక్కా హిట్ పడుతుంది, దీపావళి రాకెట్ లా కచ్చితంగా మా సినిమా దూసుకుపోతుంది అని నమ్ముతున్నాం"అని అన్నారు.

హీరో కౌషల్ మాట్లాడుతూ "మొదటగా ప్రేక్షకులకు అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు, నన్ను ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా మరింత దగ్గర అవుతాను,డిసెంబర్ 30 న ప్రపంచ వ్యాప్తంగా సినిమా ని విడుదల చేస్తాం ,మ్యూజికల్, యాక్షన్, సోషల్ ఫాంటసీ ఇలా అన్ని అంశాలు మా సినిమా లో ఉన్నాయి, సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది" అని అన్నారు.

No comments