మణుగూరు లో "స్వప్న ఈవెంట్స్ " కార్యాలయం ప్రారంభం.


ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎలాంటి శుభ కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ "స్వప్న వెడ్డింగ్ ఈవెంట్స్".

ఫౌండర్ స్వప్న చౌదరి అమ్మినేని మరియు తన తమ్ముడు అమ్మినేని ప్రవీణ్ లు కలిసి ఖమ్మం సిటీ లో మొదటి బ్రాంచ్ పెట్టి సక్సెస్ ఫుల్ గా ఈవెంట్స్ ని ఆర్గనైజింగ్ చేసి ఇప్పుడు మణుగూరు ప్రజలకి అందుబాటులో రెండవ బ్రాంచ్ ని నెలకొల్పారు.
 
ఈ సందర్భంగా స్వప్న చౌదరి అమ్మినేని మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ప్రజలకి ఎల్లప్పుడూ ధన్యవాదాలు నేను చేసే యాంకరింగ్ చూసి మీరు మీ ఇంట్లో అమ్మాయి లా నన్ను భావించారు, అలానే మా స్వప్న ఈవెంట్స్ ని నమ్మి మీ మీ ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలని మా ద్వారా జరిపించి మమ్మల్ని మరింత ప్రోత్సహించారు , మీరు అందరూ ఇచ్చిన సహకారంతో మా తమ్మడు అమ్మినేని ప్రవీణ్ , స్వప్న ఈవెంట్స్ రెండో బ్రాంచ్ ని ఇప్పుడు మణుగూరు లో మొదలు పెట్టారు.మా తల్లిదండ్రుల ఆశీస్సులు, మీ అందరి ప్రోత్సాహంతో మా ఈవెంట్స్ ఏపీ & తెలంగాణ లో ఎక్కడ చేసిన మంచి పేరు వచ్చింది అని అన్నారు.

అమ్మినేనీ ప్రవీణ్ మాట్లాడుతూ "ఈ రోజు మన మణుగూరు లో మా రెండో బ్రాంచ్ ని మొదలు పెట్టాం, మీ అందరి సహకారం మాకు ఉండాలి అని కోరుకుంటున్నాం. నాకు మా అక్క రోల్ మోడల్, మా కుటుంబ సభ్యుల సహకారంతో నేను ఈ స్థాయి కి వచ్చాను".

No comments