సాఫ్ట్ బాయ్ మస్కులినిటీ : ‘డంకీ’ ప్రమోషన్స్‌లో భాగంగా నేటి ట్రెండ్‌కి తగినట్లు షారూక్ సినిమాలకు సంబంధించిన వైరల్ థ్రెడ్‌ను ఆవిష్కరించిన నిఖిల్ తనేజా
షారూక్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. డిసెంబర్ 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది. డైరెక్టర్ రాజ్‌కుమార్ ఆవిష్కరించిన భావోద్వేగ ప్రపంచాన్ని డంకీ డ్రాప్ 4గా విడుదలైన ట్రైలర్‌తో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఆల్ఫా మేల్ అనే ఆలోచనకు వ్యతిరేకంగా షారూక్ ఖాన్ సాఫ్ట్ బాయ్ చార్మింగ్‌తో ఇందులో అందరినీ ఆకట్టుకోవటం అందరికీ చక్కటి అనుభూతిని కలిగించింది.
డంకీ సినిమాలో షారూక్ లుక్ చూసిన తర్వాత రైటర్, కథకుడు అయిన నిఖిల్ తనేజాకు ఓ ఆలోచన వచ్చింది. నిఖిల్ సినిమా సెలబ్రేషన్స్ అనే ట్రెండ్‌ను పరిచయం చేసిన వ్యక్తి. షారూక్, అతని చిత్రాలను మృదువైన పురుషత్వాన్ని తెలియజేసేదిగా ఉంటుందని నిఖిల్ భావించారు. ఇంతకు ముందు ఈయన షారూక్ నటించిన పఠాన్, జవాన్ చిత్రాలకు సంబంధించి వైరల్ థ్రెడ్‌ను పరిచయం చేశారు. నిఖిల్ మాట్లాడుతూ .. పఠాన్ చిత్రాన్ని గమనిస్తే అందులో హీరోయిన్ దీపికా పదుకొనె పాత్ర ఓ యాక్షన్ సన్నివేశంలో షారూక్ పాత్రను కాపాడుతుంది. ఆ సమయంలో పఠాన్ ప్రత్యర్థులపై ఎలాంటి ఎదురు దాడి చేయడు. కనీసం ప్రయత్నం కూడా చేయడు. ఎందుకంటే అతన్ని కాపాడుతున్న రుబీనా పాత్ర విలన్స్‌ను చితకకొడుతుంటుంది.
జవాన్ సినిమా గురించి నిఖిల్ మాట్లాడుతూ ‘‘జవాన్ చిత్రంలో షారూక్‌ని సపోర్ట్ చేసే ఆజాద్ ఆర్మీలో అందరూ మహిళలే ఉంటారు. వారందరూ జైలులో శిక్షను అనుభవించే ఖైదీలే. జైలులో నీ మనుషులే ఉన్నారు. అయితే ఈ జైలు మా స్త్రీలకు సంబంధించింది అనే డైలాగ్‌ను కూడా ప్రత్యేకంగా రాయించారు. ఇలాంటి పాత్రల్లో నటించటానికి షారూక్ బాగా ఇష్టపడుతుంటారు. అలాగే మరో చోట దీపికా పదుకొనెతో కుస్తీ పోటీల్లో ఓడిపోతాడు షారూక్. అలాగే నయనతార పవర్‌ఫుల్ పాత్ర ముందు షారూక్ తడబడుతుంటాడు. స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటానికి షారూక్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు’’ అన్నారు.
‘‘షారూక్ పాత్రను గమనిస్తే తనే నిజమైన ఆల్ఫా మేన్ అని పిలవటానికి ఎవరూ సందేహించరు. జవాన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థను, సెక్యూలరిజాన్ని నాశనం చేసే వారిపై షారూక్ ఓ సైనికుడిలా పోరాడుతాడు. అలాగే జవాన్ చిత్రంలో షారూక్ పాత్రను గమనిస్తే తనలో నిజమైన ఆల్ఫా తండ్రి కూడా కనిపిస్తారు. తను చెప్పాలనుకున్న విషయాన్ని ఎలాంటి ఊగిసలాట లేకుండా చెప్పారు. జవాన్‌లో కనిపించే రెండు షారూక్ పాత్రలు ఎంత డేంజర్‌గా ఉంటాయో అంతే దయను కలిగి ఉంటాయి. మహిళలపట్ల సానుభూతి, గౌరవాన్ని కలిగిఉంటారు’’ అని కూడా అన్నారు నిఖిల్.
డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్ సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, కణిక థిల్లాన్ ఈ చిత్రానికి రచయితలు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.
No comments