Home/News/చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌తో సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన గ్రీన్ గోల్డ్ గ్రూప్ వెంచర్స్.. బ్యానర్ లోగోను ఆవిష్కరించిన ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, శరత్ మరార్
చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌తో సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన గ్రీన్ గోల్డ్ గ్రూప్ వెంచర్స్.. బ్యానర్ లోగోను ఆవిష్కరించిన ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, శరత్ మరార్
వరల్డ్ యానిమేషన్ రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ సంస్థ గ్రీన్ గోల్డ్ గ్రూప్ ఇప్పుడు మరో కొత్త అడుగు వేసింది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పేరుతో ఈ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యానర్ లోగోను ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, శరత్ మరార్ విడుదల చేశారు.
యానిమేషన్ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా రాణిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న గ్రీన్ గోల్డ్ గ్రూప్.. కార్టూన్ నెట్ వర్క్, పోగో, డిస్నీ ఎక్స్డీల్లో బ్యాంగ్ విక్రమ్ బేతాల్, ది కృష్ణ, చోటా భీమ్ వంటి పలు ప్రోగ్రామ్స్‌తో మెప్పించింది.
ఈ సంస్థ 2010 నుంచి వారి వ్యాపార రంగాన్ని మరింతగా విస్తరించారు. అందులో భాగంగా లైసెన్స్, మర్చెండైజింగ్లోకి రంగ ప్రవేశం చేశారు. తర్వాత చోటా భీమ్, ది కర్స్ ఆప్ దమ్యాన్లతో టీవీ, థియేట్రికల్ మార్కెట్లోకి కూడా అడుగు పెట్టారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ మాధ్యమాలకు వెబ్ సిరీస్‌లను రూపొందించారు.
2021లో గ్రీన్ గోల్డ్ విఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించి గాడ్ ఫాదర్, దసరా, బంగార్రాజు, చార్లి వంటి చిత్రాలకు వర్క్ చేసి ప్రశంసలు అందుకున్నారు. దీనికి కొనసాగింపుగా 2022లో గ్రీన్ గోల్డ్ స్టూడియోస్ సంస్థను స్థాపించారు. తాజాగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. అందులో భాగంగా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ను స్థాపించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో లాంచింగ్ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. నిర్మాత రాజీవ్ చిలక , ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత శరత్ మరార్, శ్రీనివాస చిలక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
నిర్మాత రాజీవ్ చిలక మాట్లాడుతూ ‘‘లయన్ కింగ్ సినిమా చూసి ఇలాంటి సినిమాను ఇండియాలో ఎందుకు తీయకూడదు అనిపించింది. వరల్డ్ డిస్నీ నాకు ఎప్పుడూ ఓ ఇన్స్పిరేషన్. నేను యానిమేషన్ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు చాలా ఇబ్బందులుండేవి. వాటన్నింటినీ అధిగమిస్తూ సిన్సియర్‌గా కష్టపడుతూ వచ్చాం. లయన్ కింగ్ లాంటి సినిమా చేయాలనే గోల్ తోనే గ్రీన్ గోల్డ్ సంస్థ స్టార్ట్ అయ్యింది. నాకంటే ముందు నాకు తెలిసిన స్నేహితులు చాలా మంది సినీ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ కాలేక ఇంటికెళ్లిపోయారు. వీటన్నింటినీ గమనిస్తూ వచ్చాను. నాకు ఇరవై ఏళ్లు పట్టింది. ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇవీ కాకుండా ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇండస్ట్రీలో అరవింద్ గారిలా కావాలని అనుకుంటున్నాను. అందరూ మా బ్యానర్‌కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
శ్రీనివాస్ చిలక మాట్లాడుతూ ‘‘సీనియర్ నటులు సి.ఎస్.ఆర్.ఆంజనేయులుగారు మా పెద్దతాతగారు అవుతారు. ఆయన నాటక రంగంలోకి తనదైన గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి. మా తాతగారు నాగేశ్వరరావుగారు వాహిని స్టూడియోలో అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. గుణ సుందరి కథ, మల్లీశ్వరి, మాయాబజార్ వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు వర్క్ చేశారు. మా నాన్నగారు మధుసూదన్ డి.ఆర్.డి.ఓలో వర్క్ చేశారు. మేం ఇంనీరింగ్ చదువుకుని, యు.ఎస్‌లో సెటిలయ్యాం. ఓరోజు రాజీవ్ నాకు ఫోన్ చేసి జాబ్ వదిలేస్తున్నానని అన్నాడు. శానిఫ్రానిస్కోలో యానిమేషన్ నేర్చుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. గ్రీన్ గోల్డ్ సంస్థను స్టార్ట్ చేశాం. 2004లో కృష్ణ యానిమేషన్ సిరీస్‌ను స్టార్ట్ చేశాం. 2008లో చోటా భీమ్ స్టార్ట్ చేశాం. ఇండియన్ యానిమేషన్‌కే చోటా భీమ్ దారి చూపించింది. ఇప్పటికి 15 ఏళ్లు అవుతున్నా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 2012లో చోటా భీమ్‌ను థియేటర్లో రిలీజ్ చేశాం. టీవీ, థియేటర్లో రాజీవ్ డైరెక్ట్ చేస్తూ 116 యానిమేషన్ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. ఈ జర్నీలో భాగంగా చిలకా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశాం’’ అన్నారు.
నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ ‘‘ఈ సినీ ఇండస్ట్రీలోకి చిలకా ప్రొడక్షన్స్ ద్వారా అడుగు పెడుతున్న శ్రీనివాస్ చిలకలపూడి, రాజీవ్ చిలకలపూడిలకు అభినందనలు. చోటా భీమ్, కృష్ణ సిరీస్ వంటి వాటితో యానిమేషన్ రంగంలో గ్రీన్ గోల్డ్ సంస్థ ఓ మార్క్ క్రియేట్ చేసింది. రాజీవ్ చాలా ఏళ్లుగా నాకు తెలుసు. తనలో మంచి లీడర్షిప్, క్రియేటివిటీ ఉంది. అరవింద్ గారి వంటి నిర్మాత చేతుల మీదుగా ఈ బ్యానర్ స్టార్ట్ కావటం ఆనందంగా ఉంది. గ్రీన్ గోల్డ్ బ్యానర్ నుంచి మంచి సినిమాలు వస్తుందని నేను భావిస్తున్నాను.’’ అన్నారు.
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘ఇలాంటి కొత్త ప్రయోగం చేసే మనుషులను, బ్యానర్స్ ను పరిచయం చేయటం ఆనందంగా ఉంది. 2011 రాజీవ్ నన్ను కలిశాడు. 70 ఏళ్ల ముందు మా నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనే కోరికతో పెట్టె సర్దుకుని అమ్మని ఊళ్లోని వదిలేసి మద్రాస్ వచ్చేశాడు. ఆ ప్యాషనే ఈరోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. దాన్ని ప్యాషన్ అనో, పిచ్చి అనో అనుకున్నా పర్లేదు. అలాంటి పిచ్చి ఉన్న రాజీవ్ ను అంటే నాకు తెలియని ప్రేమ, అభిమానం. రాజీవ్ చేసిన చోటా భీమ్‌ని నేను తెలుగులో రిలీజ్ చేశాను. తర్వాత ఓరోజు పంజాగుట్టలో చూస్తే బెలూన్స్ పై కూడా చోటా భీమ్ బొమ్మలు చూసి ఎంత పాపులర్ అయ్యిందోనని ఆశ్చర్యపోయాను. రాజీవ్ చిన్నదిగా స్టార్ట్ చేసిన చోటా భీమ్ చాలా పాపులర్ అయ్యింది. తను సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. అతిశయోక్తి కాకపోతే రాజీవ్‌ను రాజమౌళితో పోల్చవచ్చు. ఎందుకంటే ఆయన దగ్గరున్న ఫ్యాషన్‌ని.. రాజీవ్ దగ్గర చూశాను. చిలకా ప్రొడక్షన్స్ ఎన్నో మంచి చిత్రాలను సాధించాలని కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.
చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌తో సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన గ్రీన్ గోల్డ్ గ్రూప్ వెంచర్స్.. బ్యానర్ లోగోను ఆవిష్కరించిన ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, శరత్ మరార్
Reviewed by firstshowz
on
9:18 pm
Rating: 5
No comments