PRL గార్డెన్స్ లో 1000వాలా సినిమా షూటింగ్ ప్రారంభం


సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాతగా, నూతన నటుడు అమిత్ హీరోగా, 10రూపీస్ సినిమాతో అందరిని మెప్పించిన యువ దర్శకుడు అఫ్జల్ దర్శకత్వంలో ద్వితీయ చిత్రంగా రాబోతున్న "1000 వాలా".

ఈ చిత్ర ప్రారంభోత్సవం PRL గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు శ్రీ ఆంజనేయం ఫేమ్ సీనియర్ యాక్టర్ పిల్లా ప్రసాద్, PRL గార్డెన్స్ అధినేత ప్రసాద్ పాల్గొని సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో హీరో అమిత్, నిర్మాత షారుఖ్, దర్శకుడు అఫ్జల్, రచయిత గౌస్ ఖాజా, కెమరామెన్ చందు AJ, సంగీత దర్శకుడు వంశీకాంత్ రేఖన మరియు యూనిట్ సభ్యుల బంధు మిత్రులు హాజరయ్యారు.

మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో నిండిన ఈ చిత్రం ఫిబ్రవరి లో రెగ్యులర్ షూట్ ప్రారంభించి, అతిత్వరలో పాటలు విడుదల చేసి, సమ్మర్ కానుకగా థియేటర్స్ లో విడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపారు.

No comments