అభిరామ చంటి నటించిన చిత్రం మహాబల్ అధికారిక పూజతో ప్రారంభం

టాలెంట్‌ని టాలీవుడ్ ఇండస్ట్రీ ఏమాత్రం సంకోచం లేకుండా స్వాగతిస్తోంది. ఈసారి యంగ్, ఎనర్జిటిక్ మరియు టాలెంటెడ్ టీమ్ మహాబల్ అనే తమ పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

ఈరోజు అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట అనే పవిత్రమైన రోజున అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో అభిరామ చంటి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, బ్రహ్మారెడ్డి దర్శకుడిగా సాయి బాలాజీ ఆర్ట్స్‌పై అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషన్స్‌తో కలిసి లోకేష్ రెడ్డి మరియు నారాయణ స్వామి ఈ కొత్త చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారు.

కాస్టింగ్ వివరాల అధికారిక ప్రకటనతో మహాబల రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.

సాంకేతిక బృందం:

దర్శకుడు - బ్రహ్మారెడ్డి
నిర్మాతలు - లోకేష్ రెడ్డి, నారాయణ స్వామి.ఎం
ఎడిటర్ - లోకిత్ లీ
డి ఓ పి- బ్రహ్మా రెడ్డి
స్టిల్స్ - ఎన్ జీ నాని
డైరెక్షన్ టీమ్- పి. సంతోష్ కుమార్, రాకేష్, కిరణ్
పి ఆర్ ఓ - గౌతమ్ యర్రంశెట్టి


No comments