మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లాంచ్ చేసిన రామ్జ్, కృష్ణ ప్రసాద్ వథ్యం, రన్‌వే ఫిల్మ్స్ 'ఫైటర్ రాజా' థ్రిల్లింగ్ టీజర్
పచ్చీస్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన పాపులర్ స్టైలిస్ట్ రామ్జ్ తన రెండవ సినిమా 'ఫైటర్ రాజా'ని కృష్ణ ప్రసాద్ వత్యం దర్శకత్వంలో చేస్తున్నారు. రన్‌వే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.2గా దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్, ఇప్పుడు టీజర్‌ను విడుదల చేశారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ టీజర్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.
హిరో తన తండ్రి అడుగుజాడలను అనుసరిస్తూ స్క్రాప్ అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తుంటాడు. కానీ తన ఆసక్తి ఫైటింగ్ చేయడమే. అతను సినిమాల్లో ఫైటర్‌గా పనిచేస్తాడు. అతనికి అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. అతను వివిధ సమస్యలకు పరిష్కారాలను ఇవ్వడానికి సెటిల్మెంట్ వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. రామ్జ్ తన సొంత్ బిజినెస్ ని నిర్వహించే ఫైటర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. యూనిక్ కామిక్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అతని క్యారెక్టర్ సీరియస్ గా కనిపించినా ఫన్ జనరేట్ చేసింది. అయితే, దర్శకుడు సినిమాలోని కోర్ ఎలిమెంట్‌ను ఇంకా రివిల్ చేయలేదు.
తనికెళ్ల భరణి, శివ నందు, రోషన్, తాగుబోతు రమేష్, సత్య ప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో మాయ కృష్ణన్ కథానాయిక. శ్రీధర్ కాకిలేటి కెమెరా పనితనం, స్మరన్ సాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. హరిశంకర్, అవంతి రుయా ఎడిటర్స్ గా పని చేస్తున్నారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రామ్జ్ నాకు ఈ నగరానికి ఏమయింది చిత్రం నుంచి తెలుసు. తను సెలబ్రెటీలకు చాలా చక్కని స్టయిలింగ్ చేస్తారు. మొదటి సారి నాకు షూట్ వేయించింది కూడా తనే. తను ఈ వేడుకు రమ్మని పిలవగానే నాకు అదే జ్ఞాపకం గుర్తు వచ్చింది. మనస్పూర్తిగా ఈ వేడుకకు రావాలనిపించింది. ఈ సినిమాకి సంబధించిన ప్రతిది చాలా ప్రామెసింగ్ గా వుంది. పోస్టర్ డిజైన్, కలర్ గ్రేడింగ్, విజువల్స్ అన్నీ బావున్నాయి. టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. చాలా రోజుల తర్వాత చంద్రశేఖర్ యేలేటి గారి సినిమా వైబ్ ఈ టీజర్ లో కనిపించింది. టీజర్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుంది. రామ్జ్ లోని ప్రతిభ సర్ ప్రైజ్ చేసింది. తప్పకుండా అందరూ సినిమా థియేటర్స్ లో చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు
హీరో రామ్జ్ మాట్లాడుతూ.. లవ్, మనీ, ఫ్యామిలీ ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం ఫైటర్ రాజా. విశ్వక్ సేన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి సపోర్ట్ మాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. చాలా యంగ్ టీంతో చాలా హార్డ్ వర్క్ చేసి చేశాం. దర్శకుడు కృష్ణ ప్రసాద్ నిర్మాతలు – దినేష్, పుష్పక్ జైన్. టీం అంతా కలసి చాలా పాషన్ తో పని చేశాం. తప్పకుండా సినిమా మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
దర్శకుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ.. రామ్జ్ చాలా కష్టపడి తనని తాను నిరూపించుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. టీజర్ చాలా నేచురల్ గా వుంది. స్మరన్ మ్యూజిక్ చాలా బావుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రేక్షకులు తప్పకుండా సినిమాని సపోర్ట్ చేయాలి’ అన్నారు.
హీరోయిన్ మాయా కృష్ణన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన విశ్వక్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చి , తెలుగులో పరిచయం చేస్తున్న దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. టీజర్ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మా సినిమాకు సపోర్ట్ చేయండి’ అని కోరారు.
దర్శకుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. టీజర్ ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. విశ్వక్ గారికి ధన్యవాదాలు. స్మరన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. చాలా అద్భుతమైన సినిమా ఇది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
నిర్మాత దినేష్ యాదవ్ మాట్లాడుతూ.. విశ్వక్ గారికి, వేణు గారికి ధన్యవాదాలు. టీజర్ లాంచ్ కి మీరంతా రావడం చూస్తుంటే ఇదే ఒక విజయంలా అనిపిస్తుంది. మీ సపోర్ట్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.
నటీనటులు: రామ్జ్, మాయా కృష్ణన్, తనికెళ్ల భరణి, చక్రధర్, శివ నందు, రోషన్, తాగుబోతు రమేష్, సత్య ప్రకాష్, విజయ్, కృష్ణ తేజ, శశిధర్, రాము, లక్ష్మణ్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కృష్ణ ప్రసాద్ వత్యం
నిర్మాతలు - దినేష్ యాదవ్ & పుష్పక్ జైన్
బ్యానర్ - రన్‌వే ఫిల్మ్స్
సంగీతం - స్మరన్ సాయి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - శ్రీధర్ కాకిలేటి
ఎడిటర్ - హరిశంకర్ & అవంతి రుయా
లైన్ ప్రొడ్యూసర్ - ప్రదీప్
ప్రొడక్షన్ డిజైనర్ - రోహన్ సింగ్
ఆర్ట్ డైరెక్టర్ - బాల కృష్ణ
పీఆర్వో - వంశీ-శేఖర్
No comments