డబ్బింగ్ కార్యక్రమాల్లో సుహాస్ హీరోగా దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.4 చిత్రం... మే 24న మూవీ గ్రాండ్ రిలీజ్

గ‌త ఏడాది బ‌ల‌గం వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని నిర్మించిన ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్ దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ ఇప్పుడు క్రేజీ చిత్రాల‌ను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ సినిమాల‌ను రూపొందిస్తోన్న ఈ నిర్మాణ సంస్థ‌లో డిప‌రెంట్ రోల్స్‌తో మెప్పిస్తూ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న సుహాస్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు.

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.4గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మే 24న విడుదల చేస్తున్నారు. సుహాస్ జ‌త‌గా సంకీర్త‌న విపిన్ న‌టిస్తుంది. నిర్మాత శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌లార్ చిత్రానికి డైలాగ్ రైట‌ర్‌గా వ‌ర్క్ చేసిన సందీప్ రెడ్డి బండ్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

ఈ సినిమా ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న‌ ఒక ఫ‌న్నీ కోర్టు డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం టైటిల్‌ను ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. బేబి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రానికి సంగీతాన్ని అందించిన‌ విజ‌య్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. బ‌ల‌గం వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ఆకాశం దాటి వ‌స్తావా సినిమాను రూపొందిస్తోంది. అలాగే ఇటీవ‌ల ఈ బ్యాన‌ర్ ఆశిష్ హీరోగా మూడో ప్రాజెక్ట్‌ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇప్పుడు సుహాస్ హీరోగా నాలుగో సినిమా సిద్ధ‌మ‌వుతుంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌నున్నారు. 

న‌టీన‌టులు: 

సుహాస్‌, సంకీర్త‌న విపిన్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, గోప‌రాజు, ర‌ఘుబాబు, పృథ్వీ, శివ‌న్నారాయ‌ణ‌, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: సందీప్ రెడ్డి బండ్ల‌
స‌మ‌ర్ప‌ణ‌:  శిరీష్‌
బ్యాన‌ర్ :  దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌లు : హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌
సినిమాటోగ్ర‌ఫీ:  సాయిశ్రీరామ్‌
సంగీతం:  విజ‌య్ బుల్గానిన్‌
ఆర్ట్:  రామ్ అర‌స‌విల్లి
పి.ఆర్.ఒ:  వంశీ కాకా

No comments