‘కలియుగం పట్టణంలో’ థియేటర్స్ లో చూడాల్సిన థ్రిల్లర్ సినిమా - నటుడు నరేన్ రామ
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాలో నటించిన ప్రముఖ నటుడు నరేన్ రామ మీడియాతో ముచ్చటించారు.
నరేన్ రామ సీనియర్ నటుడు గుమ్మడి గారికి బంధువు. గుమ్మడి గారు నరేన్ కి తాతయ్య వరుస అవుతారు. అలా మొదట్నుంచి సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. తెలుగు వారైనా నరేన్ తల్లి తండ్రులు చెన్నైలో స్థిరపడటంతో అక్కడ తమిళ పరిశ్రమలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పలు యాడ్స్, సినిమాలు చేసిన నరేన్ తమిళ్ లో మూడు సినిమాలు హీరోగా, ఒక సినిమాలో విలన్ గా చేశాను. తెలుగులో కలియుగ పట్టణంలో సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసారు నరేన్ రామ.
నేను ఛాన్సుల కోసం వెతుకుతుండగా ఈ సినిమా కో డైరెక్టర్, నా వెల్ విషర్ సాయి అన్న నన్ను పిలిచి ఈ ఆఫర్ ఇప్పించారు. డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి నా ప్రొఫైల్ చూసి ఓకే చేసారు. నా పాత్ర బాగుంటుంది. నాకు కథ నచ్చింది. అందుకే ఈ సినిమా చేసాను. డైరెక్టర్ గారు చాలా కూల్, తనకి కావాల్సినట్టుగా నాకు చెప్పి చేయించుకున్నారు. ఆయనతో ఇంకా వర్క్ చేయాలని ఉంది.
హీరో విశ్వ కార్తికేయ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసాడు. హీరోగా చేస్తున్నాడు. నాకు వర్క్ విషయంలో చాలా హెల్ప్ చేసాడు. మేమిద్దరం డిస్కస్ చేసుకొని యాక్ట్ చేసేవాళ్ళము సెట్ లో. మా ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. హీరోయిన్ అయుషీ మంచి అమ్మాయి. తనతో ఎక్కువ ర్యాపో లేదు. బట్ కలిసినప్పుడు కూల్ గా మాట్లాడతారు.
నిర్మాతలు నాని అన్న, మహేష్ అన్న కూడా బాగా క్లోజ్ అయ్యారు. బ్రదర్ లా ఉండేవారు. కెమెరామెన్ చరణ్ అన్న నన్ను చాలా బాగా చూపించారు. సినిమాలో నాకు టైటిల్ సాంగ్, అమ్మ సాంగ్ బాగా నచ్చాయి. అజయ్ మంచి సంగీతం ఇచ్చారు.
ఇది ఒక థ్రిల్లర్ మూవీ, అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. మార్చ్ 29 ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో సినిమాకు మంచి బజ్ వచ్చింది. సినిమా చూసి నచ్చిన వాళ్ళు ఇంకొంతమందికి చెప్పండి. అందరికి రీచ్ అవుతుంది. మేజర్ సిటీలలో కాలేజీ టూర్స్ కి వెళ్ళాము. అని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ వచ్చి చూస్తారని భావిస్తున్నాం.
‘కలియుగం పట్టణంలో’ సినిమా షూటింగ్ కోసం నేను ఫస్ట్ టైం కడపకు వెళ్ళాను. కడపలోనే చాలా వరకు షూట్ జరిగింది. సినిమాల్లో కడప అంటే ఫ్యాక్షన్ అలా చూపించారు, కానీ అక్కడ చాలా పీస్ ఫుల్ గా ఉంది. అక్కడి ప్రజలు కూడా మంచి సపోర్ట్ గా ఉన్నారు.
ఇక నరేన్ రామ త్వరలో తెలుగులో WHO అనే సినిమాతో రాబోతున్నారు. తమిళ్ లో కొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి.
No comments