ఆలోచింపజేసేలా ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసిన ‘కలియుగం పట్టణంలో’ టైటిల్ సాంగ్
ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసే పాటలు సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఆలోచింపజేసేలా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకకుల్లో చైతన్యం కలిగించేలానూ ఉంటాయి. ఇక ఇప్పుడు చంద్రబోస్ రాసిన ‘కలియుగం పట్టణంలో’ టైటిల్ సాంగ్ అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. కలి ప్రభావం, కలియుగం ఎలా ఉందో ఆయన ఈ పాట ద్వారా అందరికీ చెప్పారు.
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పెంచారు. ఈక్రమంలోనే చిత్రం నుంచి వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్నారు. మదర్ సెంటిమెంట్, లవ్ సాంగ్‌లను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సమాజాన్ని ఆలోచింపజేసేలా చంద్రబోస్ రాసిన గీతాన్ని రిలీజ్ చేశారు. కలియుగం పట్టణంలో టైటిల్ సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు. అజయ్ అరసాద అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్రా శుక్లా తదితరులు
సాంకేతిక బృందం
దర్శకుడు : రమాకాంత్ రెడ్డి
బ్యానర్ : నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్
నిర్మాతలు : డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రామ్ ప్రకాష్ రెడ్డి
సంగీత దర్శకుడు : అజయ్ అరసాద
కెమెరామెన్ : చరణ్ మాధవనేని
సాహిత్యం : చంద్రబోస్, భాస్కర భట్ల
ఎడిటర్ : గ్యారీ బీహెచ్
ఆర్ట్ డైరెక్టర్ : రవి
స్టన్ట్స్ : ప్రేమ్ సన్
కొరియోగ్రాఫర్ : మొయిన్ మాస్టర్
పీఆర్వో : సాయి సతీష్, రాంబాబు
No comments