నిర్మాతగా ఇంద్రాణి, సునామి వంటి అనేక చిత్రాలను నిర్మించి సినీ సంబంధిత పలు శాఖలలో పనిచేసిన గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి) ని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా నియమిస్తూ సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా , విజయ్ వర్మ లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం లో తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అధ్యక్ష కార్యదర్సులు అందజేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ :- జాతీయ స్థాయిలో సినిమా టెలివిజన్ కి సంబందించిన 24 సబ్ కమిటీల సమన్వయ చైర్మన్ గా ఆయా విభాగాల సమస్యల పరిష్కారానికి , సంక్షేమానికి మధుకర్ కృషి చేస్తారని అన్నారు.
మధుకర్ మాట్లాడుతూ :- అంతర్ రాష్ట్ర సినీ టెలివిజన్ రంగాల విస్తృత అవకాశాల కై కృషి చేస్తానని అన్నారు.ఇప్పటికే 10 రాష్ట్రాలలో శాఖలను ఏర్పాటు చేసిన తాము ఈశాన్య రాష్ట్రాల కమిటీలను అతిత్వరలో ఏర్పాటు చేయనున్నామని , తద్ఫలితంగా నట సాంకేతిక అవకాశాలు ఇచ్చిపుచ్చుకొనే అవకాశాలు మెరుగవుతాయని ప్రధాన కార్యదర్శి వీస్ విజయ్ వర్మ పాకలపాటి అన్నారు.
ఎఫ్ టీ పి సి ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
Reviewed by firstshowz
on
8:01 pm
Rating: 5
No comments