ఏప్రిల్ 19 నుంచి ఆహాలో అల్టిమేట్ రామ్ - కామ్ మై డియ‌ర్ దొంగ‌ ప్రీమియ‌ర్స్

భార‌త‌దేశ‌పు ప్రీమియ‌ర్ లోక‌ల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా... అల్టిమేట్ రొమాంటిక్ కామెడీ సినిమా మై డియ‌ర్ దొంగ ప్రీమియ‌ర్ డేట్‌ని అనౌన్స్ చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌తో మై డియ‌ర్ దొంగ విడుద‌ల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినీ అభిమానుల్లో నూత‌న ఉత్తేజాన్ని నింపేసింది. ఏప్రిల్ 19న ఆహాలో విడుద‌ల కానుంది మై డియ‌ర్ దొంగ‌. అభిన‌వ్ గోమ‌టం, షాలిని కొండేపూడి, దివ్య శ్రీపాద కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఆహా, కేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. షాలిని కొండేపూడి ర‌చించారు. బి.ఎస్‌.స‌ర్వ‌జ్ఞ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సెల్ప్ డిస్క‌వ‌రీ, ఎంప‌వ‌ర్‌మెంట్ ప్ర‌ధానంగా సాగే సినిమా ఇది. 

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి అద్భుత‌మైన స్పందన వ‌చ్చింది. మై డియ‌ర్ దొంగ గురించి కూలంకుషంగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసింది టీజ‌ర్‌. అభిన‌వ్ గోమ‌టం పాత్ర‌కు అభిమానుల నుంచి విశేష స్పంద‌న వ‌స్తోంది. షాలిని కొండేపూడి కేర‌క్ట‌ర్ అభిన‌వ్‌ని దొంగ అని ప్రేమ‌గా పిల‌వ‌డం... ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందింది. ఇటీవ‌ల ఏర్పాటు చేసిన ప్రైవేట్ స్క్రీనింగ్‌కి అపూర్వ‌మైన స్పంద‌న వ‌చ్చింది. సినిమా విడుద‌ల ఎప్పుడెప్పుడా అని మిగిలిన వారు ఆతృత‌గా ఎదురుచూసేంత‌లా ఉన్నాయి ప్ర‌శంస‌లు.

అల్టిమేట్ లాఫ‌ర్ థెర‌పీ అందివ్వ‌డానికి తుది మెరుగులు దిద్దుకుంటోంది మై డియ‌ర్ దొంగ‌. అభిన‌వ్‌, షాలిని కొండేపూడి క‌లిసి క‌డుపుబ్బ న‌వ్వించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ న‌వ్వుల వినోదాన్ని ప్రేక్ష‌కులు ఏప్రిల్ 19 నుంచి ఆహాలో ఆస్వాదించ‌వ‌చ్చు.
 

No comments