నిఖిల్, భరత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియో పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభూ' కోసం 8 కోట్ల బడ్జెట్‌తో 12 రోజుల ఎపిక్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్
కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభూ'తో వస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ లెజెండరీ వారియర్ పాత్రలో కనిపించనున్నారు.
నిఖిల్ తనపాత్ర కోసం ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక, నిర్మాణ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం, టీమ్ ప్రముఖ తారాగణంతో ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. వియత్నామీస్ ఫైటర్స్‌తో సహా 700 మంది ఆర్టిస్టులపై 12 రోజుల పాటు చిత్రీకరించనున్న ఈ ఎపిసోడ్‌లో నిఖిల్ అద్భుతమైన స్టంట్స్ చేయనున్నారు. రెండు మ్యాసీవ్ సెట్లలో ప్రతిష్ఠాత్మకంగా వార్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్‌కి మేకర్స్ రూ.8 కోట్లు చేస్తున్నారు. ‘స్వయంభూ’లోని మెయిన్ హైలెట్స్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఒకటి. ఈ యాక్షన్ ఎపిసోడ్ బిగ్ స్క్రీన్ పై గొప్ప అనుభూతిని కలిగించనుంది.
వర్కింగ్ స్టిల్‌లో నిఖిల్ మజిల్డ్ ఫిజిక్ తో బీస్ట్ మోడ్ లో ఫైటింగ్ రింగ్‌లోకి దిగుతున్నట్లుగా కనిపించారు. ఈ పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయిన నిఖిల్ ఒక లెజెండరీ యోధుడిగా కనిపిస్తారు. సెటప్, భారీ జనసమూహం ఫైట్ సీక్వెన్స్ గ్రాండియర్ ని సూచిస్తున్నాయి.
ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. KGF, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించగా, M ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్.
తారాగణం: నిఖిల్, సంయుక్త, నభా నటేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
సంగీతం: రవి బస్రూర్
ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్
కో-డైరెక్టర్: విజయ్ కామిశెట్టి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
No comments