పుష్ప పుష్ప.. పాట నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. పాటకు వస్తున్న సెన్సేషనల్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇస్తోంది: స్టార్ సింగర్ దీపక్ బ్లూ
'ఇప్పటివరకూ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు మూడు వందలకు పైగా పాటలు పాడాను. ఇప్పుడు 'పుష్ప పుష్ప.. పాట నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కావడం చాలా ఆనందంగా వుంది' అన్నారు స్టార్ సింగర్ దీపక్ బ్లూ.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా పుష్ప-2 ది రూల్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇటివలే ఈ చిత్రం నుంచి విడుదలై పుష్ప పుష్ప సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ చార్ట్ బస్టర్ నెంబర్ ని స్టార్ సింగర్ దీపక్ బ్లూ పాడారు. పుష్ప సాంగ్ ప్రస్తుతం టాప్ ట్రెండ్ లో కొనసాగుతున్న నేపధ్యంలో సింగర్ దీపక్ బ్లూ విలేకరుల సమావేశంలో పుష్ప పాటకు సంబధించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
సింగర్ గా మీ ప్రయాణం గురించి చెప్పండి ?
గత 12 ఏళ్ళుగా పాడుతున్నాను. ఇప్పటివరకూ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు మూడు వందలకు పైగా పాటలు పాడాను. ఇప్పుడు పుష్ప పాట నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కావడం చాలా ఆనందంగా వుంది.
మీ నేపధ్యం గురించి చెప్పండి ?
-మా నాన్న గారిది రేపల్లి. కానీ చెన్నై లో స్థిరపడ్డారు. అమ్మ కన్నడ. నేను పుట్టింది పెరిగింది చెన్నై. మేము ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. ఇంట్లో అన్ని భాషల వారు వున్న కాబట్టి ఐపీఎల్ లో ఎ జట్టు గెలిచిన మాకు సమస్య లేదు.( నవ్వుతూ)
సింగర్ కావాలని ఎప్పుడనిపించింది ? ఆ జర్నీ గురించి చెప్పండి
-చిన్నప్పటినుంచి పాటలంటే ఇష్టం. మా అమ్మమ్మ కి సంగీత నేపధ్యం వుంది. అలాగే మా అమ్మగారు కూడా చక్కగా పాడుతారు. అలా నాకూ పాడటం వచ్చిందని అనుకుంటున్నాను. చదువుకున్న రోజుల్లోనే మ్యూజిక్ క్లాసస్ కి వెళ్లాను. కాలేజీ తర్వాత ఒక బ్యాండ్ లో కూడా చేరాను. అప్లయిడ్ మైక్రోబయాలజీ చదివాను. కొన్ని రోజులు ఉద్యోగం కూడా చేశాను. తర్వాత కొన్ని సింగింగ్ రియాలిటీ షోస్ లో పాల్గొన్నాను. అక్కడే ప్లే బ్యాక్ సింగింగ్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా ఏ అంశాలు మెరుగుపరుచుకోవాలో అర్ధమైయింది. తర్వాత సంగీత దర్శకులని కలిసి డెమోలు ఇవ్వడం జరిగింది. విజయ్ అంటోనీ గారు తొలి పాట అవకాశం ఇచ్చారు. తర్వాత తేజ గారి 'నీకు నాకు డాష్ డాష్' సినిమాలో ఓ పాట పాడాను. అలా తెలుగులో కూడా జర్నీ మొదలైయింది.
మీకు తొలి హిట్ అంటే ఏ పాటని చెబుతారు ?
-దేవిశ్రీ ప్రసాద్ గారి కంపోజిషన్ లో నాన్నకు ప్రేమతో లో పాడిన లవ్ దెబ్బ. అది చాలా పెద్ద హిట్ అయ్యింది. అలాగే తమన్ గారి కంపోజిషన్ లో పాడిన 'బ్రూస్లీ' మెగా మీటర్ పాట కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. తమన్ గారికి దాదాపు 35 పాటలు పాడాను. బీరువా( చెలియా చెలియా), పండగ చేస్కో( లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్) కిక్ 2, చుట్టాలబ్బాయి, డిక్టేటర్, ఇటీవల వారసుడు సినిమాలో కూడా పాడాను. తమన్ గారు నాకు బ్రదర్ లాంటి వారు. కలిసి సరదాగా క్రికెట్ కూడా ఆడుతాం. చెన్నై లో మ్యూజిషియన్స్ అంతా కలసి ఒక టీం కూడా ఏర్పాటు చేసుకున్నాం.(నవ్వుతూ).
అల్లు అర్జున్ గారి, సుకుమార్ గారిని కలిశారా ?
-ఇంకా లేదండి. వారిని కలవాలని ఎదురుచూస్తున్నాను. సాధారణంగా సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్ తోనే ట్రావెల్ అవుతారు. ఆడియో లాంచ్ లో అల్లు అర్జున్ గారిని, సుకుమార్ గారిని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
పుష్ప పుష్ప.. సాంగ్ అవకాశం ఎలా వచ్చింది ?
-దేవిగారికి మొదట లవ్ దెబ్బ పాడాను. తర్వాత సరిలేరు నీకెవ్వరు లో ప్రమో సాంగ్ పాడాను. పుష్ప పాట కోసం ఓ పవర్ ఫుల్ వాయిస్ కోసం చూస్తున్న క్రమంలో నన్ను ఎంపిక చేశారు. ఈ పాటని చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదరుచూస్తున్నాను.
దీపప్ బ్లూ.. మీరు పేరు కొంచెం విశేషంగా వుంది. దీనిని గురించి కొంచెం వివరిస్తారా?
-నా పూర్తి పేరు దీపక్ సుబ్రహ్మణ్యం కప్పగంతులు. మొదట్లో దీపక్ అనే టైటిల్ క్రెడిట్ వుండేది. అయితే అదే పేరుతో ఓ భోజ్ పురి సింగర్ రావడంతో సెర్చ్ చేస్తున్నప్పుడు పాటలు కలిసిపోవడం గమనించాను. పేరు కొంచెం యూనిక్ గా వుంటే బావుంటుందనిపించింది. నాకు ఇష్టమైన కలర్ బ్లూ. నా సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా బ్లూ అనే వుంటుంది. నా స్నేహుతులు కూడా బ్లూ అనే పిలిస్తారు. అలా పేరుని దీపక్ బ్లూ గా మార్చడం జరిగింది.
సింగర్స్ లో మీ స్ఫూర్తి ఎవరు ?
-ఒకరిని చెప్పలేం. చాలా మంది స్ఫూర్తిని ఇస్తారు. నా ఆల్ టైం ఫేవరేట్ బాలు గారు. అలాగే హరిహరన్ గారి గజల్స్ ఇష్టం. శంకర్ మహదేవన్ గారి ఎనర్జీ అద్భుతంగా వుంటుంది. అలాగే జేసుదాసు గారి ఫీల్ ఇష్టం.
హీరోల్లో కూడా ఇప్పుడు చాలా మంది పాడుతున్నారు కదా అందులో మీకు ఇష్టమైన సింగర్ ?
-ధనుష్ గారి వాయిస్ టోన్ బావుటుంది. ఆయనకి తగిన పాటలే పాడుతారు. అలాగే సిద్ధార్ద్ గారి వాయిస్ కూడా బావుటుంది. హీరోలు పాడుతుంటే మాకు కాంపిటేషనే. (నవ్వుతూ). ఐతే పాన్ ఇండియా ట్రెండ్ లో మరో సానుకూల అంశంవుంది. ఒకటే పాట అన్ని భాషల్లో పాడే అవకాశం వుంది. పుష్ప పాట తెలుగు, తమిళ్ లో నేనే పాడాను.
దేవిశ్రీ, తమన్.. ఇద్దరితో వర్క్ చేశారు కదా.. వారి వర్కింగ్ స్టయిల్ లో ఎలాంటి తేడాలు గమనించారు ?
-దేవిశ్రీ, తమన్ ఇద్దరూ క్లారిటీ వున్న సంగీత దర్శకులు. పాటకు ఏం కావాలో అది చక్కగా తీసుకుంటారు.
భవిష్యత్ లో సంగీత దర్శకత్వం వహించే ఆలోచనలు ఉన్నాయా?
-కోవిడ్ సమయంలో సంగీతానికి సంబధించిన విషయాలు నేర్చుకున్నాను. ఒక ఇండిపెండెంట్ ఆల్బం చేయాలని వుంది. అలాగే నాకు మెలోడి పాటలు పాడటం ఇష్టం. కానీ ఇప్పటివరకూ మాస్ పాటలే వచ్చాయి. మెలోడీ పాటలు కూడా వుండేలా ఇండిపెండెంట్ ఆల్బం చేయాలనే ఆలోచన వుంది.
కొత్తగా పాడిన పాటలు గురించి ?
-కొన్ని పెద్ద సాంగ్స్ పాడాను. వాటి రిలీజ్ ఎప్పుడన్నది మేకర్స్ చేతిలోనే వుంటుంది.
No comments