బిగ్ బాస్ అమరదీప్ & సుప్రీత సురేఖవాణి కొత్త సినిమా లొకేషన్ లో సెలబ్రేషన్స్


M3 మీడియా & మహా మూవీస్ బ్యానర్లో మహేంద్ర నాధ్ కూoడ్ల నిర్మాత గా, మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే, ఈ సినిమా లో హీరో హీరోయిన్లు గా బిగ్ బాస్ ఫెమ్ అమర్ దీప్ చౌదరి, సుప్రీత సురేఖవాణి లు చేస్తున్నారు. 


స్టార్ మా లో నిర్వహించిన నీతోనే డాన్స్ షో లో విన్నర్ గా అమర్ దీప్ చౌదరి & తేజు విజయం సాధించారు .

ఈ సందర్భంగా అమర్ దీప్ చౌదరి & సుప్రీత కొత్త సినిమా షూటింగ్ లోకేషన్ లో సినిమా టీం సభ్యులు అందరూ కలసి కేక్ కట్ చేసి, అమర్ దీప్ చౌదరి ని సన్మానించారు.


ఈ సందర్భంగా అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ, నిజంగా చాలా సంతోషంగా ఉంది , కష్టపడితే విజయం వస్తుంది అని అనడానికి నిదర్శనం ఇది అని, ప్రేక్షకుల సపోర్ట్ వలనే ఇదంతా జరుగుతుంది అని, అలానే మా సినిమా ని సైతం ప్రేక్షకులు ఆదరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత మహేంద్ర నాధ్ కూoడ్ల , డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి, హీరోయిన్ సుప్రీత తదితరులు లు పాల్గొన్నారు.

No comments