యూత్ ను ఆకట్టుకుంటున్న ఎమోషనల్ మ్యూజికల్ యూత్ ఎంటర్టైనర్‘ప్రభుత్వ జూనియర్ కళాశాల'
బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకం పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'. ఓక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, నిర్మాత గా భువన్ రెడ్డి కొవ్వూరి గారు ఈ సినిమా ని నిర్మించారు . . 2024, జూన్ 21 న విడుదలైన ఈ చిత్రం యూత్ మరియు ఫామిలీ ప్రేక్షకుల మనసులను దోచింది.
‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143' జూన్ 21న విడుదలై నేటి యువతను ఉర్రూతలూగిస్తోంది. ఈ వారం మొత్తం 11 చిత్రాలు విడుదల అయ్యాయి, అన్నిచిత్రల కంటే మా ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రం కలెక్షన్స్ లో ముందుది. డిస్ట్రిబ్యూటర్స్ సైతం మా చిత్రం బాగుంది అని థియేటర్స్ పెంచుతున్నారు. అలానే సినిమా బాగుంది అనే మాట సోషల్ మీడియా లో కూడాచక్కర్లు కొడుతోంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఉన్న కాలేజీ సన్నివేశాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మరియు తమ కాలేజీ రోజుల్లుని గుర్తు చేసుకున్నారు. సెకండ్ హాఫ్ లో తల్లీ సెంటిమెంట్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని భావోద్వేగనికి గురి చేసాయి. పాటలు సైతం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. మ్యూజిక్ లవర్స్ కి కూడా మా చిత్రం నచ్చుతుంది.
క్లైమాక్స్ చూసి ప్రతి ప్రేక్షకుడు ఎంతో ఎమోషనల్ గా థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు.
మార్నింగ్ షో కన్నా మాట్నీ ఆట కి, మాట్నీ కన్నా ఫస్ట్ షో కి కలెక్షన్ లు పెరిగాయి. సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరు సినిమా బాగుంది అని సినిమా ని పొగుడుతున్నారు అని దర్శకుడు శ్రీనాథ్ పులకురం తెలిపారు.
నటీనటులు:
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల
సాంకేతిక వర్గం:
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్
రైటర్, ఎడిటర్ అండ్ డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం
నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి
డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
పాటలు: కార్తీక్ రోడ్రిగజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సయ్యద్ కమ్రాన్
కొ డైరెక్టర్ : వంశీ ఉదయగిరి
No comments