'హరోం హర' న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. యాక్షన్, క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా వుంటుంది. డెఫినెట్ గా ఆడియన్స్ కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక
హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర'. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు.
హరోం హర సినిమా ఎలా మొదలైయింది ?
-సెహరి సినిమాని సుధీర్ గారి వైఫ్ చూడటం, డైరెక్టర్ ని కలవమని సజెస్ట్ చేయడం, అదే టైంలో నేను హీరో గారి మ్యానేజర్ ని అప్రోజ్ అవ్వడం, స్టొరీ పిచ్ చేయడం జరిగింది. ఫస్ట్ సిట్టింగ్ లోనే సుధీర్ గారు ఓకే చేశారు. ఇందులో చాలా యాక్షన్ సీన్స్ వుంటాయి. అవి ఎలా వర్క్ అవుట్ చేయాలనే దానిపై మాట్లడుకున్నాం. ప్రొడ్యూసర్ సుమంత్ నా ఫ్రెండ్. ఇదే సమయంలో తను ఫోన్ చేసి ఏం చేస్తున్నానని అడిగారు. 'సుధీర్ గారితో డిస్కర్షన్ జరుగుతుందని చెప్పాను. మనం చేద్దామని చెప్పారు. అలా సినిమా మొదలైయింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ చాలా ఇంటెన్స్ గా చేశాం. పిరియాడిక్ ఫిల్మ్ ఇది. ప్రొడక్షన్ డిజైన్, లోకేషన్స్, కాస్ట్యుమ్స్ ఇలా అన్నిట్లో చాలా ఎఫర్ట్ పెట్టాం. దాదాపు ఆరు నెలలపాటు ప్రీప్రొడక్షన్ చేశాం.
హరోం హర స్టొరీ ఏంటి ?
-ట్రైలర్ చెప్పాం. ఇదొక అండర్ డాగ్ స్టొరీ. కుప్పంలో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేసే సుబ్రహ్మణ్యం మామూలు కుర్రాడు. తను గన్ మేకింగ్ లో ఇన్వాల్ అయి పవర్ ఫుల్ సుబ్రహ్మణ్యగా ఎలా ఎదిగాడనేది థ్రెడ్. దీంతో పాటు చాలా థ్రెడ్స్ వున్నాయి. ఇందులో స్పిర్చువల్ ఎలిమెంట్ కూడా వుంది. హరోం హర మేకింగ్ లో కూడా మేము ప్రతి లొకేషన్ లో నెమలి చూశాం. అదొక పాజిటివ్ షైన్. కర్నాటకలో దాదాపు 17 డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. ప్రతి లొకేషన్ కి నెమలి వచ్చేది. హైదరాబాదు లో షూట్ చేసిన లోకేషన్స్ లో కూడా నెమలి వచ్చేది. సుబ్రహ్మణ్య స్వామికి నేను పెద్ద భక్తుడిని. ఈ సినిమాకి హరోం హర అనే టైటిల్ పెట్టాం. ఇందులో హీరో పేరు కూడా సుబ్రమణ్యం. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు వున్నాయని నమ్ముతున్నాను.
ఈ కథకు రియల్ లైఫ్ స్ఫూర్తి ఉందా ?
-కొన్ని ఆర్టికల్స్ వున్నాయి. ఓ కామన్ మ్యాన్ గన్ తయారు చేశాడనే ఆర్టికల్ చదివాను. అయితే అది సినిమా కథకి సరిపోదు. దీని కోసం నా నేటివిటీ రూట్స్ లో ఏం చేయాలో అవన్నీ చేశాను. మాది కుప్పం పక్కన ఓ చిన్న వూరు. ఆ మట్టి వాసన కనిపించేలా కేర్ తీసుకున్నాం. కుప్పం తమిళనాడు, కర్నాటక బోర్డర్స్ లో వుంటుంది. అక్కడ మిక్స్డ్ కల్చర్ వుంటుంది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని బాగా కొలుస్తారు. అవన్నీ ఇందులో ఎక్స్ ఫ్లోర్ చేశాం. ఇందులో మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ అన్నీ వుంటాయి. సినిమా చాలా ఆర్గానిక్ గా వుంటుంది. ఈ సినిమా యాక్షన్ లవర్స్ కి, మాస్ ఆడియన్స్ కి, సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది. టెక్నికల్ గా చాలా బావుటుంది.
హరోం హర కి పార్ట్ 2 ఉందా ?
-ప్రత్యేకంగా పార్ట్ 2 ని స్క్రీన్ మీద వేయడం నాకు ఇష్టం లేదు. ఈ సినిమాని చాలా హై తో ఎండ్ చేశాం. సినిమా చూసిన తర్వాత ఆడియన్సే పార్ట్ 2 కావాలని అడుగుతారనే నమ్మకం వుంది.
గన్స్ మేకింగ్ కోసం ఎలాంటి రిసెర్చ్ చేశారు ?
-దీని కోసం బుక్స్ చదవడం, డాక్యుమెంటరీలు చూడటం జరిగింది. బుక్స్ నుంచి చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాం. గన్ మేకింగ్ ని సినిమాకి కావలసినంత స్టయిలీష్ గా చూపించడం జరిగింది.
రెండో సినిమాకే ఇలాంటి యాక్షన్ జోనర్ ఎంచుకోవడానికి కారణం ?
-నాకు ఇష్టమైన జోనర్ ఇది. అయితే ఫస్ట్ సినిమాకే ఇలాంటి కథ చెబితే అంత ఈజీగా యాక్సప్టెన్సి రాదు. అందుకే ఈ కథ నా దగ్గర ఉన్నప్పటికీ తొలి సినిమాగా లవ్ స్టొరీ సెహరి చేయడం జరిగింది. హరోం హర మై కైండ్ అఫ్ ఫిల్మ్.
సెహరి కి ముందు మీ ఎక్స్ పీరియన్స్ ఏమిటి ?
-నేను యాడ్ ఫిల్మ్ మేకర్ ని. దాదాపు వందకుపైగా యాడ్ ఫిల్మ్స్ చేశాను.
హరోం హర కలర్ పేలెట్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది. దిని గురించి ?
-హరోం హర ఇంటెన్సిటీ వున్న కథ. ఆ ఇంటెన్సిటీ ఫ్రేం లో కనిపించడానికి ఆ కాంట్రాస్ట్ ని ఎంచుకున్నాం. ముందే మా డీవోపీకి దీని గురించి క్లారిటీ చెప్పాను.
-ఇప్పటివరకూ సినిమా చూసిన అందరికీ పిచ్చిపిచ్చిగా నచ్చింది. మైత్రీమూవీ మేకర్స్ వారు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ చూశారు. అందరికీ చాలా నచ్చింది. వారు చెబుతున్న ఒకొక్క ఎలిమెంట్ నాకు చాలా కిక్ ఇచ్చింది.
హరోం హరలోని ఎమోషన్ ఏమిటి ?
-హరోం హరలో మంచి ఫాదర్ ఎమోషన్ వుంటుంది. ఆ ఎమోషన్ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. దాన్ని ఇప్పుడే ఎక్కువ రివిల్ చేయడం లేదు.
మహేష్ బాబు గారికి సినిమా చూపించారా ?
మహేష్ బాబు గారికి ట్రైలర్ చాలా నచ్చింది. రిలీజ్ డే సినిమా చూస్తానని చెప్పారు.
సుధీర్ బాబు గారు ఎలా చేశారు ?
-సుధీర్ బాబు గారు ఎక్స్ ట్రార్డినరీ గా పెర్ఫార్మ్ చేశారు. యాక్షన్, ఎమోషన్ టెర్రిఫిక్ గా చేశారు. ఆయనలో ఒక స్వాగ్ వుంటుంది. అది బెస్ట్ గా డెలివెరి అయ్యింది. ఇందులో కుప్పం యాస కూడా అద్భుతంగా మాట్లాడారు. నాలుగు రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేశారు.
-సినిమాలో ప్రతి క్యారెక్టర్ కుప్పం యాస మాట్లాడారు. ఇందులో సునీల్ గారు లెన్తీ క్యారెక్టర్ చేశారు. చాలా మంచి క్యారెక్టర్. మాళవిక, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మన్, అక్షర గౌడ క్యారెక్టర్స్ కూడా బావుంటాయి.
కుప్పం అంటే చంద్రబాబు గారు గుర్తొస్తారు. ఇందులో పొలిటికల్ టచ్ ఉందా?
-పొలిటికల్ టచ్ ఏమీ లేదు. సుధీర్ బాబు గారు చంద్రబాబు గారిని కలిశారు. హైదాబాద్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ కలిసిన వ్యక్తి చంద్రబాబు గారే.
ఇది 90s బ్యాక్ డ్రాప్ లో వుంటుంది కదా. ఎలాంటి కేర్ తీసుకున్నారు ?
-అట్మోస్ట్ కేర్ తీసుకున్నాం. కర్ణాటక, ఉడిపి, ద్రాక్షారామం.. ఇలా డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. కుదరదనే వాటిని సెట్స్ వేసి షూట్ చేశాం. సినిమా చాలా అర్గానిక్ గా వుంటుంది. హరోం హర న్యూ ఏజ్ కమర్షియల్ ఎంటర్ టైనర్. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. క్లైమాక్స్ మతిపోతుంది.
ప్రొడ్యూసర్స్ గురించి ?
-నా ఫ్రెండ్ అని చెప్పడం కాదు. హై బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్. మేకర్స్ గా చాలా ఇంప్రస్ అయ్యాను.
ఫైనల్ గా సినిమా గురించి ఆడియన్స్ కి ఏం చెబుతారు ?
-హరోం హర న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలోని ఎలిమెంట్స్ అన్నీ వుంటాయి, ఆర్గానిక్ అప్రోచ్ వుంటుంది. మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా వుంటాయి. సుధీర్ బాబు గారి నుంచి ఎవరూ ఊహించిన సినిమా హరోం హర అవుతుందనే గట్టినమ్మకం వుంది. హరోం హర మాస్ సంభవం అవుతుంది. సుధీర్ బాబు గారి పెర్ఫార్మెన్స్ చూసి ఓ ట్యాగ్ లైన్ ఇచ్చాం. అది సినిమా చివర్లో వస్తుంది. ఈ ట్యాగ్ లైన్ పర్మినెంట్ గా వుండిపొతుందని నమ్ముతున్నాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ?
ఇదే ప్రొడక్షన్ హౌస్ లో వుంటుంది. త్వరలోనే టైటిల్ తో పాటు ఎనౌన్స్ చేశాం.
No comments