మహారాజ కి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ అందరికీ థాంక్ యూ: మహారాజ థాంక్ యూ మీట్ లో హీరో విజయ్ సేతుపతి
మహారాజా మాస్టర్ పీస్ సినిమా. ఫ్యామిలీస్ తో కలసి వెళ్లి సినిమా చూడండి. చాలా సర్ ప్రైజ్ అవుతారు: డైరెక్టర్ మారుతి
ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా మహారాజ. మంచి కల్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్ వచ్చింది: డైరెక్టర్ గోపీచంద్ మలినేని
మహారాజ చాలా పెద్ద హిట్టు. ఏ రేంజ్ కి వెళ్లి ఆగుతుందో చెప్పలేం: డైరెక్టర్ బుచ్చిబాబు సాన
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లేటెస్ట్ మాస్టర్ పీస్ 'మహారాజ'. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్‌విఆర్ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలలోమ్యాసీవ్ గా రిలీజ్ చేసింది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా జూన్ 14న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి విమర్శకులు ప్రసంశలు అందుకొని మాస్టర్ పీస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ ని నిర్వహించింది.
థాంక్ యూ మీట్ లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. రిలీజ్ ముందు ప్రెస్ మీట్ కి వచ్చినప్పుడు మీ అందరూ చాలా ప్రేమ అభిమానం చూపించారు. మీ ప్రేమ చూసి కొంచెం భయం వచ్చింది. సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకున్నారు. మహారాజకి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీరు చూపిన ప్రేమ చూస్తుంటే.. ఇది నా హోమ్ టౌన్ లానే అనిపిస్తోంది. ఇంత కంఫర్ట్ ఇచ్చిన ఆడియన్స్ కి మీడియాకి అందరికీ థాంక్ యూ సో మచ్. తెలుగు ఆడియన్స్ ఎక్కడ కలిసి 96, మాస్టర్, విక్రమ్, ఉప్పెన.. ఇలా నా చిత్రాలన్నీ తమకు ఎంతో ఇష్టమని చెబుతుంటారు. ఆడియన్స్ అందరికీ థాంక్స్. ఈ ఈవెంట్ కి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ థాంక్ యూ. నిజానికి మీరంతా వస్తారని నేను వూహించలేదు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థాంక్. సినిమా గురించి ఇంత గొప్ప మాట్లాడటం వింటుంటే చాలా ఆనందంగా వుంది. చాలా ఎమోషనల్ గా వుంది. బుచ్చి నా యంగర్ బ్రదర్ లాంటి వాడు. ఉప్పెనలాంటి మంచి సినిమా తీశాడు. ఇప్పుడు రామ్ చరణ్ గారితో సినిమా చేస్తున్నాడు. తను ఇక్కడకి రావడం సర్ ప్రైజింగ్ గా అనిపించింది. మహరాజకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. అందరికీ థాంక్స్. లవ్ యూ ఆల్' అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. మహారాజ గురించి అందరూ చాలా హార్ట్ ఫుల్ గా మాట్లాడుతున్నారు. ఈ సినిమా చూసి షాక్ అయ్యాను. ఇంటర్వెల్ కే సినిమా గురించి ఇన్స్టా లో పోస్ట్ చేశాను. చాలా గొప్ప సినిమా ఇది. మాస్టర్ పీస్ సినిమా. దర్శకుడు చాలా అద్భుతంగా రాసి తీశారు. ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయి. ఇలాంటి సినిమా తెలుగు ప్రేక్షకులకి అందించిన టీం అందరికీ థాంక్స్. విజయ్ సేతుపతి గారు ఈ జనరేష్ కి గ్రేట్ ఆర్టిస్ట్. డైరెక్టర్స్ ఫేవరేట్ హీరో. ఆయన ఇలాంటి గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మహారాజని థియేటర్స్ లో మిస్ అవ్వొద్దు. ఫ్యామిలీస్ తో కలసి వెళ్లి సినిమా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు' అన్నారు.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ..మహారాజ లాంటి మంచి సినిమా ఇచ్చిన విజయ్ సేతుపతి గారికి, డైరెక్టర్ గారికి థాంక్ యూ. ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా ఇది. మంచి కల్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్. ఒక మంచి సినిమా చూస్తే అది చాలా కాలం వెంటాడుతుంది. నేను అదే వైబ్ లో వున్నాను. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఈ సినిమా చూస్తున్నపుడు ఒక జీవితాన్ని చూసిన ఫీలింగ్ కలిగింది. ఎక్స్ ట్రార్డినరీ స్క్రీన్ ప్లే. విజయ్ సేతుపతి గారు నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. ఇండియాలో వన్ అఫ్ ది బెస్ట్ యాక్టర్ విజయ్ సేతుపతి గారు. ఆయన జెమ్. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఎక్స్ ట్రార్డినరీ. డైరెక్టర్ అద్భుతమైన వర్క్ చేశారు. ఇదొక కల్ట్ ఫిల్మ్. రూట్స్ లోకి వెళ్ళిపోయింది. మహారాజ లాంటి మంచి సినిమా ఇచ్చిన విజయ్ సేతుపతి గారికి థాంక్ యూ' అన్నారు.
డైరెక్టర్ బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. ఈ సినిమా చూసి ఫస్ట్ గూగుల్ లో ఈ డైరెక్టర్ ఎలా ఉంటారని సెర్చ్ చేశా. చాలా డేరింగ్ క్లైమాక్స్. ఈ సినిమా గురించి ఏం చెప్పినా ఎక్స్ పీరియన్స్ పాడైపోతుంది. ఇందులో ప్రతి సీన్ అద్భుతం. విజయ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన హీరో అంతే. ఆయన ఇలాంటి సినిమాలే చేయాలనే కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్టు. ఏ రేంజ్ కి వెళ్లి ఆగుతుందో చెప్పలేం. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' చెప్పారు.
డైరెక్టర్ అనీల్ కన్నెగంటి మాట్లాడుతూ.. మాస్టర్ పీస్ అంటే మాటకు సరిగ్గా సరిపోయే సినిమా మహారాజ. ఇందులో ఎమోషన్ ని విజయ్ సేతుపతి గారు చివరి వరకూ తన కళ్ళలో చూపించారు. ఈ సినిమా చూసిన ఎక్సయిట్మెంట్ ఆగడం లేదు. ఇది అద్భుతమైన సినిమా. మహారాజ లాంటి మంచి సినిమా ఇచ్చిన విజయ్ సేతుపతి గారికి థాంక్ యూ సో మచ్' అన్నారు.
మూవీ డైరెక్టర్ నితిలన్ సామినాథన్.. తెలుగు ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. సినిమాని చాలా ఇష్టంగా ప్రేమిస్తారు. ఈ సినిమాకి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. కథ, స్క్రీన్ ప్లే, పెర్ఫార్మెన్స్ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది'' అన్నారు
డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రీరిలీజ్ విజయ్ సేతుపతి గారి నటవిశ్వరూపం చూస్తారని చెప్పాను. ఇప్పుడు స్క్రీన్ మీద అదే చూశారు. విజయ్సేతుపతి గారి తెలుగ ఆడియన్స్ ఇచ్చిన బ్రహ్మరధం ఈ కలెక్షన్స్. మొదటి రోజు నుంచు స్క్రీన్ పెంచుతూనే వున్నాం. రోజురోజుకి 200 పెర్సెంట్ గ్రోత్. రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. మహారాజతో మాకు డబ్బుతో పాటు పేరు కూడా వచ్చింది. ఈ సినిమా ఎంత రేంజ్ అనేది ఇంకా ఎవరూ చెప్పలేరు. రోజురోజుకి జనాలు పెరుగుతున్నారు. ఈ ఏడాది హనుమాన్ తర్వాత ఇంతపెద్ద హిట్ ఈ సినిమానే అని నమ్ముతున్నాను. విజయ్ గారిపై తెలుగు ప్రేక్షకులకు వున్న ప్రేమరోజురోజుకి పెరుగుతూనే వుంటుంది. ఇప్పటివరకూ సినిమా చూసిన వారికి ధన్యవాదాలు. చూడనివారు థియేటర్స్ కి రండి. ఖచ్చితంగా చాలా సర్ ప్రైజ్ అవుతారు' అన్నారు. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.
No comments