ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను నిర్మాత కె .ఎస్ . రామారావు అభినందించారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు బాబు నాయుడు గారి మంత్రి వర్గంలో కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ శాఖను నిర్వహిస్తున్నారు .
సోమవారం రోజు అమరావతిలో మంత్రి దుర్గేష్ తో నిర్మాత రామారావు సమావేశమయ్యారు . త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమై సినిమారంగ సమస్యల గురించి చర్చిద్దామని దుర్గేష్ రామారావుతో చెప్పారు .
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, అందుకు సహజమైన లొకేషన్లు , ప్రోత్సహించే ప్రభుత్వం ఉన్నాయని రామారావు తెలిపారు .
సినిమా పరిశ్రమ పట్ల అవగాహన వున్న కందుల దుర్గేష్ మంత్రిగా ఉండటం పట్ల రామారావు హర్షం వ్యక్తం చేశారు .
మంత్రి దుర్గేష్ తో కె.ఎస్.రామారావు సమావేశం
Reviewed by firstshowz
on
8:13 pm
Rating: 5
No comments