'మనమే' ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో నా ఫేవరట్ మూవీ. బ్యూటీఫుల్ ఎమోషన్స్ వున్న ఫెయిరీ టైల్ లాంటి కథ. డెఫినెట్ గా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది: డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య


డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ 'మనమే' తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. 'మనమే' జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మూవీ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

మనమే స్టొరీ ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ?

-పేరెంటింగ్ ఎమోషన్ గురించి కొంచెం డిఫరెంట్ గా చెప్పాలనే ఐడియా ఎప్పటినుంచో వుంది. అది ఫన్ గా ఫుల్ ఎనర్జీతో చెప్పాలనేది నా ఉద్దేశం. అలాగే పిల్లలతో సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అందులో తెలియని ఇన్నోసెన్స్ వుంటుంది. ఆ ఇన్నోసెన్స్ టచ్ చేయాలని అనుకున్న కథ.

బాబు పుట్టాక పెరేటింగ్ గురించి చెయ్యాలనిపించిందా?

- నేను మా పేరెంట్స్ తో చాలా ఎటాచ్ గా వుంటాను. బాబు పుట్టాక ఆ ఎటాచ్ మెంట్ ఇంకా పెరిగింది.

ట్రైలర్ లో వినిపించిన 'ఏడిస్తే ఎవరో ఒకరే ఏడవండి' అనే డైలాగ్ మీ పర్శనల్ ఎక్స్ పీరియన్స్ నుంచి వచ్చిందా ?

- చాలా డైలాగులు రియల్ లైఫ్ నుంచి రిలేట్ చేసుకునేలానే వుంటాయి (నవ్వుతూ).

ఈ సినిమా జర్నీలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజస్ ఏమిటి ?

-లండన్ లో అరవైమంది క్రూ తో వెళ్లి షూట్ చేయడం చాలా ఠఫ్ టాస్క్. లండన్ క్లైమెట్ కూడా అన్ ప్రిడిక్టబుల్ గా వుటుంది. ఒక లొకేషన్ అనుకుని షూట్ స్టార్ట్ చేశాక సడన్ గా వర్షం పడుతుంది. క్లైమెట్, అక్కడ లాజిస్టిక్స్ విషయంలో కొన్ని ఛాలెంజస్ ఎదుర్కొన్నాం.

శర్వానంద్ గారికి ఈ కథ చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏమిటి ?

- తనకి 'మనమే' కథ హోల్ నరేషన్ చెప్పాను. కథ విన్న వెంటనే 'చేసేద్దాం పక్కా' అన్నారు.

మీరు చాలా వరకూ క్రైమ్ థ్రిల్లర్స్ చేశారు కదా. సడన్ గా ఈ జోనర్ రావడం ఎలా అనిపిస్తోంది ?  

-మనమే నా ఫేవరేట్ జోనర్. నాకు హ్యుమర్ చాలా ఇష్టం. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో మనమే నా మోస్ట్ ఫేవరేట్ ఫిల్మ్. మా అబ్బాయి యాక్ట్ చేశాడనే ఒక రీజన్ వుంది కానీ సినిమా చూసినప్పుడు మీరే అర్ధమౌతుంది. ఇందులో చైల్డ్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ నుంచి విక్రమ్ ఆదిత్యనే అనుకున్నాం. తను కెమరాకి చాలా బావుంటాడనిపించింది.

ఇందులో దాదాపు 16 పాటలు వున్నాయని తెలుస్తోంది. ఇన్ని పాటలు వుండటం ఆడియన్ ఎలా ఫీలౌతారని భావిస్తున్నారు ?

-ఇందులో సాంగ్స్ సినిమా ఫ్లో కి యాడ్ అవుతాయే గానీ ఆపవు. ఇందులో ప్రతి సాంగ్ సినిమాని ఇంకా ఫాస్ట్ గా తీసుకెళుతుంది. నాకు పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా చాలా ఇష్టం. అందులో ఆర్ఆర్ ఎక్కువగా వుంటుంది. ఎమోషన్ చక్కగా యాడ్ చేస్తుంది. మనమే కథ అనుకున్నప్పుడే విజువల్ గా ఒక కలర్ టోన్ ఫిక్స్ అయిపోయాను. ఫెయిరీ టైల్ లాంటి సినిమా చేయాలని అనుకున్నాం. అలాంటి సినిమా చేయాలంటే ముజిక్కే ఆ యాడ్ ఆన్ ఇస్తుంది. హేశం చాలా బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.

కృతిశెట్టి మీరు అనుకున్న క్యారెక్టర్ కి యాప్ట్ అయ్యారా ?

-కృతిశెట్టి నేను అనుకున్న క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. సినిమాలో చాలా బ్రిలియంట్ గా యాక్ట్ చేసింది.

దాదాపు సినిమాని లండన్ లో షూట్ చేశారు కదా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎలాంటి సపోర్ట్ చేసింది?

-ఫెయిరీ టైల్ లాంటి కథ అనగానే లండన్ లో అలాంటి ఆర్కిటెక్చర్ వుంటుంది. అది వుంటనే ఆ మ్యాజిక్ వస్తుంది. అందుకే లండన్ వెళ్లాం. విశ్వప్రసాద్ గారు చాలా సపోర్టివ్. దాదాపు అరవై మంది క్రూతో అక్కడి వెళ్లాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు చాలా సపోర్టివ్. సినిమాకి కావాల్సిన ప్రతీదీ ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు.

ఇందులో శర్వా, కృతి వైఫ్ అండ్ హస్బెండ్ గా కనిపిస్తారా ?

-ఇది సర్ ప్రైజ్. ఇప్పుడు చెప్పకూడదు. అయితే సినిమా మొదలైన పదినిమిషాలకు ఆడియన్స్ కి తెలిసిపోతుంది. సినిమా అంతా చాలా హై వుంటుంది.

ఇందులో శర్వానంద్ గారి క్యారెక్టర్ ఎలా వుంటుంది.

- ఇందులో తనది చాలా చిల్ క్యారెక్టర్. సినిమా అంతా ఆయన క్యారెక్టర్ చాలా లైవ్లీ గా వుంటుంది. అసలు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని శర్వాని చూపించాలని అనుకున్నాను. రన్ రాజా రన్ ఎనర్జీకి మించి వుంటుంది. సినిమా చూడండి. చాలా సర్ ప్రైజ్ అవుతారు. శర్వా చాలా ఎనర్జిటిక్ గా వుంటారు. పడిపడి లేచే మనసు సినిమా చూసినప్పుడు ఆయన ఓ చోట పవన్ కళ్యాణ్ గారిలా కనిపిస్తారు. ఆ ఎనర్జీని చూపించాలని అనుకున్నాను.  

శివ కందుకూరిని తీసుకువడానికి కారణం ?

-శివ గురించి ఇప్పుడే ఎక్కువ మాట్లాడకూడదు. సినిమా చూసినప్పుడు ఆ సర్ ప్రైజ్ ని ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. నేను అనుకున్న పాత్ర కోసం గుడ్ లుకింగ్ వుండే బ్యాలెన్స్ యాక్టర్ కావాలి. ఆ పాత్రలో శివ బావుంటాడని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది.

ఇందులో లవ్ స్టొరీ ఎలా వుండబోతుంది ?

-టామ్ అండ్ జెర్రీలా వుంటుంది( నవ్వుతూ) ఖుషిలో పవన్ కళ్యాణ్ గారు, భూమిక క్యారెక్టర్స్ మధ్య వుండే ఎనర్జీ ఇందులో వుంటుంది. ఇందులో శర్వా కృతి మధ్య వుండే రేపోని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.

ఇందులో ఇద్దరు డీవోపీలు పని చేయడానికి కారణం ?

-విష్ణు లండన్ లో షూట్ చేశారు, ఇక్కడి వచ్చాక తనకి వేరే ప్రాజెక్ట్ ఉండింది. అప్పుడు జ్ఞాన శేఖర్ గారు మిగతా పోర్షన్ షూట్ చేశారు.

అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ?

- నెక్స్ట్ ఒక ఇంట్రస్టింగ్ స్టొరీ వుంది. ఇది యాక్షన్ కామెడీ జోనర్ లో వుంటుంది.





No comments