హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి


టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, ఆప్టిమల్ మీడియా సొల్యూషన్స్ ఆధ్వర్యంలో.. ‘టైమ్స్ హోమ్ హంట్‌ ప్రాపర్టీ ఎక్స్‌పో నాలుగో ఎడిషన్ 

హైదరాబాద్: విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ సొంతిల్లు కొనుగోలు చేయాలని చాలా మందికి ఒక కల ఉంటుంది. మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అందరూ తమ తమ స్థాయిని బట్టి సొంతిళ్లు కొంటారు. అయితే, ఏ ప్రాంతంలో కొనుగోలు చేయాలి? ఏ బ్యాంకులో ఎలా రుణాలు పొందాలి? అనే విషయాల్లో చాలా మందికి సందిగ్ధాలు ఉంటాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు, మంచి ఇల్లు కొనడంలో సాయం చేసేందుకు ‘టైమ్స్ హోమ్ హంట్ ఎక్స్‌పో’ ఒక మంచి వేదిక. 40 మంది ప్రముఖ బిల్డర్స్, 100కి పైగా ప్రాజెక్టులు ఇందులో పాల్గొంటున్నాయి.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ టైమ్స్ అఫ్ ఇండియా గ్రూప్స్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ ఎక్స్ పో ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి మూడు నెలలు ఎన్నికల కోడ్ ఉండే ఎన్నికల కోడ్ కారణంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదు ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి పై ఫోకస్ పెడ్తామ్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగానికి అనువైన స్థలం అమరావతి, హైదరాబాద్ తో పోల్చితే హైదరాబాద్ స్థానం హైదరాబాద్ కె ఉంది. చంద్రబాబు నాయుడు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్న. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఆర్ఆర్ఆర్, రిజినల్ రింగ్ రోడ్, మెట్రో డెవలప్మెంట్, మూసి డెవలప్మెంట్ పై సీఎం ఫోకస్ చేసారు. రిజిస్ట్రేషన్ విషయంలో కూడా కంపెనీలు ఇచ్చే సూచనలు పరిగణలోకి తీసుకుంటాం. రెండు రోజుల్లో ఈ అంశాలపై చర్చిస్తాం. పక్కరాష్ట్రంలో వేరే ప్రభుత్వం వచ్చిందని, మన దగ్గర ఎదో జరుగుతుందని అపోహ వద్దు బిల్డర్స్ కు న్యాయమైన అన్ని అంశాల్లో సపోర్ట్ చేస్తాం. పేదవాడికి మంచి చేసే పనులకు సహకరిస్తాం. రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అని కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు. పాలసీల విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సునీల్ చంద్ర రెడ్డి, ప్రెసిడెంట్, నారెడ్కో తెలంగాణ, Mr. శేఖర్ రెడ్డి, చైర్మన్-CII-ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, వి శరత్ కుమార్-తెలంగాణ మరియు AP ఆప్టిమల్ మీడియా సొల్యూషన్స్ హెడ్ (ఎ టైమ్స్ గ్రూప్ కంపెనీ, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు,గృహనిర్మాణం, రెవెన్యూ మరియు సమాచార & ప్రజాసంబంధాల మంత్రి (తెలంగాణ రాష్ట్రం) & శ్రీ రాజశేఖర్ రెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్ హైదరాబాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments