ప్రేమించొద్దు మూవీ రివ్యూ & రేటింగ్


చిత్రం: ప్రేమించొద్దు

నటీ నటులు : అనురూప్, దేవమలిషెట్టి, సోనాలి గార్జే,
సారిక, మానస, లహరి, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తదితరులు 

సాంకేతిక నిపుణులు 

బ్యానర్ : సిరిన్ శ్రీరామ్ కేఫ్ 
రైటర్, ఎడిటర్,ప్రొడ్యూసర్, డైరెక్టర్ : సిరిన్ శ్రీరామ్ 
డి . ఓ. పి : హర్ష కొడాలి
సంగీతం : చైతన్య స్రవంతి
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ : కామరాన్ 
లిరిక్స్ : శ్రీ సాయి కిరణ్
సౌండ్ మిక్సింగ్ : అరవింద్ మీనన్ 

ఒక అమ్మయి ఇద్దరు అబ్బాయిలు ట్రయాంగిల్ ప్రేమకథ ఈ ప్రేమించొద్దు, ప్రేమకథలు ఎప్పుడు వచ్చినా చూసి ఆదరించే ప్రేక్షకుల ముఖ్యంగా యూత్ ఎప్పుడూ ముందు ఉంటారు. ప్రేమించొద్దు సినిమా కథ కథనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. యూత్ ను టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా మంచి ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు సిరిన్ శ్రీరామ్ ఎంచుకున్న పాయింట్ దాన్ని స్క్రీన్ మీద చూపించడంలో సక్సెస్ అయ్యారు. పూర్తి వివరాలు రివ్యూ లో చూద్దాం. 
 
విశ్లేషణ:

లాలస ( సారిక ) కమల్ ( అనురూప్) తో ప్రేమలో ఉంటుంది , అనుకోకుండా సారాస్ ( దేవ మలిశెట్టీ ) తో ప్రేమలో పడుతుంది. కమల్ అండ్ సారస్ ఇద్దరు లాలస నీ గాఢంగా ప్రేమిస్తారు ... తన కోసం ప్రాణాలు ఇవ్వడానికైన సిద్ధపడతారు. లాలస కూడా ఇద్దరితో చాలా చనువుగా ఉంటుంది ఇద్దరినీ ఇష్టపడుతుంది కానీ తను ఒక కన్ఫ్యూజన్ లో ఉంటుంది, లాలస, కమల్ జీవితంలోకి సారాస్ ఎందుకు వచ్చాడు ? చివరికి లాలస కమల్ వైపు మొగ్గు చూపిందా ? సారాస్ వైపు మొగ్గు చూపిందా ? వీరి ప్రేమకథతో ఇంకెన్ని ట్విస్టులు జరిగాయో తెలియాలంటే ప్రేమించొద్దు సినిమా చూడాల్సిందే.

సినిమా మొదలవ్వడం కాలేజీ బ్యాక్ డ్రాప్ తో మొదలవుతుంది.. ఫస్ట్ అంత చాలా సరదాగా కామెడీ తో ఉంటుంది సెకండ్ ఆఫ్ మొత్తం కామెడి విత్ కంటెంట్.. ఒక స్ట్రాంగ్ ఇంటర్వల్ బ్యాంగ్.. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మెయిన్ హైలెట్. లాలస ఇద్దరిలో ఫైనల్గా ఎవరిని ఇష్టపడింది అనేది సినిమాకే హైలెట్, ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ ను బాగా ఎంజాయ్ చేస్తారు.

లాలస కేరక్టర్ లో సారిక మంచి పర్ఫామన్స్ ఇచ్చింది . అలాగే కమల్ అండ్ సారస్ గా చేసిన అనురూప్, దేవ మలిషెట్టి కేరక్టర్ లో లీనమై పోయారు అండ్ క్లైమాక్స్ లొ చాలా బాగా చేశారు.. ఫ్రెండ్స్ గా చేసిన అందరు చాలా బాగా చేసారు . మిగతా నటీనటులు అందరు క్యారెక్టర్స్ లో చాలా బాగా సెట్ అయ్యారు.

ఫస్ట్ ఆఫ్ అండ్ సెకండ్ ఆఫ్ లో ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ చాలా బాగా తీసుకెళ్ళాడు..

ముఖ్యంగా కథ చప్పటంలో ఎక్కడ ఫీల్ మిస్ అవ్వలేదు.లొకేషన్స్ అండ్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి.

టెక్నికల్ గా...ఎడిటింగ్ , కెమెరా వర్క్, మ్యూజిక్, పాటలు, బాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని బాగున్నాయి.కొత్త కథలు ఇష్టపడేవాళ్ళు కచ్చితంగా ఈ సినిమా చూడాలి.

రేటింగ్: 3/5

No comments