శివ రాజ్‌కుమార్, కార్తీక్ అద్వైత్, పద్మజ ఫిల్మ్స్, భువనేశ్వరి పిక్చర్స్ కన్నడ- తెలుగు బైలింగ్వల్ మూవీ అనౌన్స్‌మెంట్
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ "హ్యాట్రిక్ హీరో", కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ సౌత్ ఇండియాలో బిజియస్ట్ యాక్టర్స్ లో ఒకరు, లీడ్ రోల్స్ తో పాటు, జైలర్, కెప్టెన్ మిల్లర్. ఇతర ప్రముఖ చిత్రాలలో ప్రత్యేక పాత్రలు చేయడంలో శివన్న పాపులర్.
నిన్న శ్రీమతి గీతా శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా శివ రాజ్‌కుమార్ నెక్స్ట్ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ కన్నడ తెలుగు బైలింగ్వల్ ఫిల్మ్ ని కార్తీక్ అద్వైత్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో భువనేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, సుధీర్ పి నిర్మిస్తున్నారు.
మేకర్స్ కొత్తగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా శ్రీమతి గీతా శివ రాజ్‌కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, అనౌన్స్ మెంట్ కి పర్శనల్ టచ్ జోడించి, ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఎక్సయిట్మెంట్ ని పెంచడం ద్వారా మూవీని అనౌన్స్ చేశారు.
కార్తీక్ అద్వైత్ గతంలో విక్రమ్ ప్రభుతో 'పాయుమ్ ఒలి నీ యెనక్కు' తమిళ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌తో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టారు, ఇది అతని సెకెండ్ డైరెక్షనల్ వెంచర్.
శివరాజ్ కుమార్‌ని కంప్లీట్ కొత్త లుక్, క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసే ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది, ఇప్పటికే మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతోంది. అఫీషియల్ లాంచ్ వేడుక ఆగస్ట్‌లో వుంటుంది, షూట్‌ను ఫార్మల్ గా కిక్ స్టార్ట్ చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న నిర్మాత ఎస్ ఎన్ రెడ్డి ఈ బైలింగ్వల్ వెంచర్ కోసం సుధీర్ పి.తో కొలబరేట్ అవుతున్నారు. SN రెడ్డి రీసెంట్ ప్రాజెక్ట్ "జీబ్రా," తెలుగు, కన్నడ రెండింటిలోనూ విడుదల కానుంది.
మిగిలిన ప్రధాన పాత్రల కోసం నటీనటుల ఎంపిక ఖరారైంది, శివరాజ్ కుమార్ నటనకు అనుగుణంగా ట్యాలెంటెడ్ స్టార్ కాస్ట్ వుంటుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్స్ త్వరలో రిలీజ్ అవుతాయి. ఈ చిత్రం హై-బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎ.జె శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ దీపు ఎస్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ రవి సంతే హక్లే.
ఈ కన్నడ - తెలుగు బైలింగ్వల్ ఫిల్మ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
నటీనటులు: కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కార్తీక్ అద్వైత్
నిర్మాతలు: SN రెడ్డి, సుధీర్ P
బ్యానర్: భువనేశ్వరి పిక్చర్స్
సమర్పణ: పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
సంగీతం: సామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: ఎ.జె. శెట్టి
ఎడిటర్: దీపు ఎస్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: రవి సంతే హక్లే
పీఆర్వో: వంశీ శేఖర్
No comments