ఏకాగ్ర చెస్ అకాడమీ చిన్నారులు చిచ్చరపిడుగుల్ల చెస్ టోర్నమెంట్స్ లో సత్తా చాటుతున్నారని, ఛాంపియన్స్గా నిలుస్తున్నారని ఏకాగ్ర చెస్ అకాడమీ సీఈఓ, కోచ్ సందీప్ నాయుడు, చీఫ్ కోచ్ చైతన్య అన్నారు.
సోమవారం జూబ్లీహిల్స్ గాయత్రిహిల్స్ లోని ఏకాగ్ర చెస్ అకాడమీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అకాడమీ చిన్నారులు సాధించిన విజయాలను వెల్లడించారు వెల్లడించారు.
నగరంలో తెలంగాణా చెస్ అకాడమీ నిర్వహించిన చెస్ టోర్నమెంట్లో అండర్-7 క్యాటగిరిలో అన్య రంగినేని మంచి విజయాలను పొంది ఛాంపియన్ గా నిలిచి రెండవ స్థానాన్ని సాధించిందన్నారు. వారాస్ ఆలిండియా స్కూల్ చిల్డ్రన్స్ టోర్నమెం ట్లో అండర్-7 క్యాటగిరిలో అనయశర్మలు ఛాంపియన్ గా నిలిచిందన్నారు.
అదేవిధంగా వరల్డ్ ఛాంపియన్స్ సూపర్ ట్విన్స్ అయయ అగర్వాల్, అనయ్ అగర్వాల్ లు దేశంలోని పలు టోర్నమెంట్స్ లో ఛాంపియన్స్ గా నిలిచారని తెలిపారు. తక్కువ సమయం శిక్షణలోనే వీరు తమలోని సృజనాత్మక ప్రతిభను చాటి విజయాలు సాధించడం సంతోషంగా ఉం దన్నారు. చెస్ అకాడమీలో చాలా మెళకువలు నేర్పారని, మరింత శిక్షణతో దేశానికి ఖ్యాతి తీసుకొచ్చేలా పోటీపడ తామని చెస్ క్రీడాకారులు తెలిపారు. కార్యక్రమంలో కోచ్ షీతల్ తదితరులు పాల్గొన్నా రు.
No comments