'అలనాటి రామచంద్రుడు' క్లాసిక్, యూనివర్సల్ లవ్ స్టొరీ. ఇందులో అందరూ రిలేట్ చేసుకునే బ్యూటీఫుల్ క్యారెక్టర్ చేశాను: హీరోయిన్ మోక్ష
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 2న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మోక్ష విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు.
మీ నేపధ్యం గురించి ?
-నేను బెంగాలీ అమ్మాయిని. కోల్‌కాతా నుంచి వచ్చాను. తెలుగులో నా మొదటి సినిమా లక్కీ లక్ష్మణ్. అలనాటి రామచంద్రుడు నా రెండో సినిమా. గత రెండేళ్ళుగా తెలుగు మలయాళం తమిళ పరిశ్రమల్లో పని చేస్తున్నాను. తెలుగు అర్ధం అవుతుంది. మాట్లాడటం కూడా చాలా వరకూ వచ్చింది. అలనాటి రామచంద్రుడు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
అలనాటి రామచంద్రుడు లో మీ పాత్ర ఎలా వుండబోతుంది ?
-ఇందులో నా క్యారెక్టర్ పేరు ధరణి. ఇదొక కమర్షియల్ పోయిటిక్ మూవీ. ట్రైలర్ చూస్తే బ్యూటీఫుల్ పోయిట్రీ వుంటుంది. నా క్యారెక్టర్ చాలా హైపర్, అల్లరిగా వుంటుంది, దర్శకుడు ఏం చెప్పారో అదే అద్భుతంగా ప్రజెంట్ చేశారు. చాలా బ్యూటీఫుల్ క్యారెక్టరైజేషన్, ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకునేలా వుంటుంది.ఈ సినిమాలో నాకు చాలా మంచి డైలాగులు వున్నాయి.
అలనాటి రామచంద్రుడులో మీకు చాలెంజింగ్ గా అనిపించిన అంశం ఏమిటి ?
-ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సెకండ్ హాఫ్ కంప్లీట్ గా మనాలిలో వుంటుంది. షూటింగ్ లో చాలా ఛాలెంజ్స్ ఎదురుకున్నాం. వింటర్ లో మైనస్ డిగ్రీలలో షూటింగ్ చేశాం. ఈ కథలో నేచర్ ఒక ఫీలాసఫీ గా వుంటుంది, ఆ నేచర్ క్యాప్చర్ చేయడం సవాల్ గా అనిపించింది.
హీరో కృష్ణ వంశీ గారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా వుంది ?
కృష్ణ వంశీ ఇందులో తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు. తన పెర్ఫర్మెన్స్ చాలా నేచురల్ గా వుంటుంది.
డైరెక్టర్ ఆకాష్ రెడ్డి గురించి ?
-దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఈ పాత్ర నా కోసమే పుట్టిందేమో అనిపించింది. నా ఆడిషన్ ఆయనకి నచ్చింది. దిని కోసం వర్క్ షాప్ కూడా చేశాం. డైరెక్టర్ గారు చాలా మంచి విజన్ తో అద్భుతంగా ఈ సినిమా చేశారు. చాలా హానెస్ట్ గా కష్టపడి తీసిన సినిమా ఇది.
అలనాటి రామచంద్రుడు టైటిల్ గురించి ?
-ఇందులో హీరో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే టైటిల్ ఇది. ఇందులో తనది స్వార్ధం లేని ప్రేమ. ప్రజెంట్ జనరేషన్ లో శ్రీరాముని క్యారెక్టర్ తో హీరో క్యారెక్టర్ ని కోరిలేట్ చేసుకునేలా వుంటుంది. ఇదొక క్లాసిక్ యూనివర్సల్ లవ్ స్టొరీ.
ప్రొడక్షన్ హౌస్ గురించి ?
-మనాలి, అమలాపురం, వైజాగ్ ఇలా డిఫరెంట్ లోకేషన్స్ లో సినిమాని షూట్ చేశాం, నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా కథకు కావాల్సిన ప్రతిది సమకూర్చారు. ఒక పెద్ద సినిమాలానే చేశారు. వారికి హ్యాట్సప్ చెప్పాలి. చాలా విజనరీ ప్రొడ్యూసర్స్.
మ్యూజిక్ గురించి ?
అలనాటి రామచంద్రుడు మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది. నేపధ్యం సంగీతం అన్ బిలివబుల్ అనిపిస్తుంది. సరికొత్త మ్యూజిక్ ని ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ చేస్తారు.
తెలుగు సినిమాలు చూస్తుంటారా ? మీ ఫేవరేట్ హీరో ఎవరు ?
-చాలా తెలుగు సినిమాలు చూశాను. సావిత్రి గారు చేసిన దేవదాస్ నుంచి అనుష్క గారి అరుంధతి, లేటెస్ట్ సాయి పల్లవి గారి విరాట పర్వం వరకూ ఎన్నో సినిమాలని ఎంజాయ్ చేశాను. సీతారామం, హనుమాన్ ఎంతగానో నచ్చాయి. అందరూ ఇష్టమే. నాని గారు అంటే ఇష్టం, ఆయన శ్యామ్ సింగారాయ్ లో బెంగాల్ నేపధ్యం వుంటుంది. ఆయనతో వర్క్ చేయాలని వుంది.
-తెలుగు సినిమాలు చేయడం చాలా ఆనందంగా వుంది.
తెలుగు పాన్ ఇండియా ఇండస్ట్రీ. ఇక్కడ ఆడియన్స్ చాలా లవబుల్ గా వుంటారు. ప్రమోషన్స్ లో ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని వుంది ?
-ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే క్యారెక్టర్స్ చేయాలని వుంది.
నెస్ట్ ప్రాజెక్ట్స్ ?
-రామం రాఘవం సినిమా చేస్తున్నాను. అలాగే ఒక మలయాళం సినిమా విడుదలకు రెడీ అవుతుంది.
No comments