ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా 'రామ్ ఎన్‌ఆర్‌ఐ' చిత్రం నుంచి 'తెల్లవారే వెలుగుల్లోనా' పాట విడుదల
ఫీల్‌గుడ్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి సినిమాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే వుంటాయి. ఆ కోవలోనే రూపొందుతున్న మరో ఫీల్ గుడ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'రామ్ ఎన్‌ఆర్‌ఐ'. 'పవర్ ఆఫ్ రిలేషన్ షిప్' అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. బిగ్‌బాస్ ఫేమ్ అలీ రజా కథానాయకుడిగా, సీతా నారాయణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీ నందా దర్శకుడు. మువ్వా క్రియేషన్స్ పతాకంపై ఎస్‌ఎంకే ఫిల్మ్స్ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తెల్లవారే వెలుగుల్లోనా అనే తొలి లిరికల్ వీడియోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు.
*ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ...* ' ఈ పాటను చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అందాలను ఒడిసి పట్టి చాలా అందమైన, అద్భుతమైన లోకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించినట్లుగా కనిపిస్తుంది. ఈ పాట ద్వారా మంచి లోకేషన్స్‌ను దర్శక, నిర్మాతలు సెల్యూలాయిడ్స్‌పైకి తెచ్చినందుకు అభినందనలు. సినిమా విజువల్స్ చూస్తుంటే ది బెస్ట్ సాంకేతిక విలువలతో నిర్మించిన సినిమాలా అనిపిస్తుంది. నాగబాబు కర్రా అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ పాటలో కనిపిస్తుంది. మన మాతృభూమికి మనం ఎంతో కొంత చేయాలి. మన మూలాలను మరిచిపోకూడదు అనే ఆలోచనతో మంచి కాన్సెప్ట్‌తో, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడికి, నిర్మాతకు నా అభినందనలు. ఇంత మంచి సినిమాకు వర్క్ చేసిన టీమ్‌కు కూడా నా శుభాకాంక్షలు. ఈ నెల 21న జరగనున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకతో పాటు ఈ చిత్రం కూడా విజయవంతం కావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను' అన్నారు.
శ్రవణ్ సంగీతం సమకూర్చిన 'తెల్లవారే వెలుగుల్లోనా' అనే ఈ పాటకు రామాంజనేయులు యామినేని సాహిత్యం అందించగా, గాయకుడు రేవంత్ ఆలపించారు. పల్లె గొప్పతనాన్ని, గ్రామీణ అందాలను చూపిస్తూ తెరకెక్కిన ఈ పాట విజువల్‌గా కూడా ఆకట్టుకునే విధంగా వుంది. 'పల్లెసీమకు ఎగిరే.. మనసే ఆనందంలో ఎగిరే.. ఊరివైపు పయనించే....' అని పాడుతూ హీరో అలీ రజా ఎంతో హుషారుగా..ఎనర్జీగా ఈ పాటలో కనిపిస్తాడు. మంచి లిరికల్ విలువలతో కూడిన ఈ పాట వినగానే క్యాచీగా వుంది.
తారాగణం: అలీ రజా, సీతా నారాయణన్, విజయ్‌చందర్, గీతాంజలి, మువ్వ సత్యానారాయణ, సన, సూర్య, రఘు, జోగి నాయుడు, వేణుగోపాల్, రవివర్మ, జయవాణి, శ్రీమణి, మైనా
సాంకేతిక నిపుణులు:
కథ, స్కీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.లక్ష్మీ నందా(డీఎఫ్ టెక్)
నిర్మాత: మువ్వా సత్యనారాయణ
సమర్పణ: ఎస్‌ఎంకే ఫిల్మ్స్ సింగులూరి మోహన్‌కృష్ణ
సంభాషణలు: వీరబాబు బాసిన
సాహిత్యం: రామాంజనేయలు యామినేని
సంగీతం: శ్రవణ్
సినిమాటోగ్రఫర్: నాగబాబు కర్రా
ఎడిటర్: కె.రమేష్
ఆర్ట్: జేకే మూర్తి
ఫైట్స్: సూపర్ ఆనంద్
కొరియోగ్రఫీ: రేలంగి కిరణ్
No comments