బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రేపు రిలీజ్ కానున్న ప్రిన్స్, నరేష్ అగస్త్య "కలి" మూవీ టీజర్


యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మించింది. శివ శేషు రచించి దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ తుది దశకు చేరుకుంది . త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్..

రేపు సాయంత్రం అనగా 07 వ తారీకు 4.05 నిమిషాలకు "కలి" సినిమా టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేయబోతున్నారు. కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.
 
నటీనటులు - ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు.
 
టెక్నికల్ టీమ్:
 
సంగీతం - జీవన్ బాబు
ఎడిటర్ – విజయ్ కట్స్.
సినిమాటోగ్రఫీ – నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి.
పాటలు – సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి,
క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ - రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఫణీంద్ర
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
సమర్పణ – కె. రాఘవేంద్ర రెడ్డి
నిర్మాత - లీలా గౌతమ్ వర్మ
రచన, దర్శకత్వం - శివ శేషు

No comments