చైతన్య రావ్ డియర్ నాన్నకు హ్యూస్టన్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 రెమి అవార్డు


యంగ్ ట్యాలెంటెడ్ చైతన్య రావ్, యష్ణ చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం 'డియర్ నాన్న'. అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి నిర్మించారు. జూన్ 14న నుంచి ఆహా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి ఇప్పుడు ఓ అరుదైన గౌరవం లభించింది. హ్యూస్టన్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 రెమి అవార్డు విజేతగా నిలిచింది డియర్ నాన్న.  

డియర్ నాన్న చూసిన ఆడియన్స్ సినిమాకి టాప్ రేటింగ్స్ ఇస్తున్నారు. కరోనా బ్యాక్ డ్రాప్ లో ఫాదర్ సన్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన ఈ సినిమా కంటెంట్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది. 

చెఫ్ కావాలని కలులు కనే చైతన్య రావ్ తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తనలో కలిగిన మార్పుని దర్శకుడు అంజి సలాది ఆలోచన రేకెత్తించే విధంగా ఎఫెక్టివ్ గా చూపించారు. కరోనా సమయంలో మెడికల్ షాప్ ల ప్రాధాన్యత, వారు చేసిన త్యాగాలు, చూపిన తెగువని దర్శకుడు చాలా ఎఫెక్టివ్ గా చూపించాడు. 

మంచి ఎమోషన్స్, వాల్యుబుల్ స్టొరీ, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, సూపర్ పెర్ఫార్మెన్స్ లతో వచ్చిన డియర్ నాన్న ప్రస్తుతం ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా స్ట్రీం అవుతోంది.

No comments