మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 3670 కోట్లు కలెక్ట్ చేసిన డెడ్ పుల్ అండ్ వాల్వరిన్
అభిమానుల్ని దిల్ ఖుష్ చేస్తున్న డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్
సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ తో విజయవంతంగా డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ తెలుగునాట థియేటర్లలో సందడి చేస్తుంది. అత్యంత భారీ అంచనాలు మధ్య ప్రపంచవ్యాప్తంగా జూలై 26న విడుదలైన ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ వారు నిర్మించారు.
రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ముఖ్య పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ మూవీ బాక్స్ ఫీస్ ని షేక్ చేస్తుంది. దాదాపుగా మూడు రోజుల్లో 3670 కోట్లు కలెక్ట్ చేసి కాసుల వరద సృష్టించింది. ఇండియాలో కూడా డెడ్ పుల్ అండ్ వాల్విరిన్ కలెక్షన్ల హవా కొనసాగుతుంది.
మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకు మార్వెల్ మూవీ అభిమానుల అదరణ దక్కింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో ఉన్న టైమ్లీ డైలాగులు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. డెడ్ పుల్ పాత్రదారు రయన్ రెనాల్డ్స్ పలికిన ప్రతి సంభాషణకి సంబంధించిన తెలుగు డబ్బింగ్ ఆద్యంతం హాస్యాన్ని పండించింది. దీంతో ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచి తెలుగులో విశేషాదరణ లభిస్తుంది.
No comments