పారిస్ ఒలింపిక్స్ 2024లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..రైమ్‌లతో పి.వి.సింధు ఆత్మీయ కలయిక
పారిస్ ఒలింపిక్స్ 2024 అట్టహాసంగా ప్రారంభమైంది. అందరిలోనూ ఈ పోటీలపై ఎగ్జయిట్‌మెంట్ పెరుగుతోంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల మధ్య జరిగే పోటీయే కాదు.. అథెట్లు, సెలబ్రిటీలు పంచుకునే ఆత్మీయ క్షణాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బాడ్మింటన్ సెన్సేషన్ పి.వి.సింధు, రామ్‌చరణ్ పెంపుడు కుక్క బ్రాట్ మధ్య ఆహ్లాదకరమైన, ఆత్మీయమైన కలయిక జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ కలయిక, కలుసుకున్నప్పుడు జరిగిన సంఘటనలు అభిమానులు సహా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
కొణిదెల ఫ్యామిలీ ఒలింపిక్స్ ఎక్స్‌పీరియెన్స్ :
చిరంజీవి, సురేఖ దంపతులతో కలిసి రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన దంపతులు పారిస్ ఒలింపిక్స్‌లో సందడి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ ఒలింపిక్స్‌లో వీరు సందడి చేయటం గ్లామర్ టచ్‌నిచ్చింది. ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. వీరితో రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార వేడుకకి రాలేదు. అయితే పారిస్ సిటీలో మాత్రం క్లీంకార, రైమ్‌లు కుటుంబంతో కలిసి సందడి చేశారు.
రైమ్‌తో పి.వి.సింధు.. హృదయాన్ని ఆకట్టుకునే అపూరక్షణాలు:
పారిస్‌లో రామ్ చరణ్, రైమ్‌లతో బాడ్మింటన్ సెన్సేషన్ పి.వి.సింధు కలిశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. చరణ్, రైమ్‌లను సింధు కలిసినప్పుడు వారు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. అలాగే రైమ్‌ను ముద్దులాడుతూ సింధు అపూరమైన సమయాన్ని గడిపారు. ఈ వీడియోతో పాటు సింధు ఆటతీరుని ప్రశంసిస్తూ ఆమె రాబోయే మ్యాచుల్లో అద్భుతంగా రాణించాలని కోరుతూ రైమ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
ఒలింపిక్స్ జర్నీ సెలబ్రేషన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈఫిల్ టవర్ దగ్గర గడిపిన అద్భుతమైన క్షణాలను ఫొటో రూపంలో షేర్ చేశారు. అలాగే పారిస్ సిటీలో తన వ్యక్తిగతమైన అనుభవాన్ని ఆయన తెలియజేశారు. చరణ్ సతీమణి ఉపాసన విషయానికి వస్తే, కుటుంబం అంతా ఒలిపింక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆ అనుభవంతో పాటు అక్కడ గడిపిన క్షణాలను ఫొటోలు, వీడియోల రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒలింపిక్స్ లో పాల్గొనడం పట్ల తమ ఆనందాన్నితెలియజేయటంతో పాటు భారత బృందానికి శుభాకాంక్షలను అందించారు చిరంజీవి. ఈ క్రమంలో ఆయన సురేఖతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.
హృదయాలను ఆకట్టుకునేలా పి.వి.సింధు పెర్ఫామెన్స్ :
భారత బాడ్మింటన్ సెన్సేషన్ పి.వి.సింధు మాల్దీవులకు చెందిన ఫాతిమాత్ అబ్దుల్ రజాక్‌పై పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. మహిళలకు సంబంధించి సింగిల్స్ గ్రూప్ మ్యాచుల్లో సింధు ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో టోర్నమెంట్‌లో ఆమె అద్భుతమైన ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 అనేది క్రీడాకారులకు అత్యుత్తమమైన ప్రదర్శన చేసే గొప్ప వేదిక మాత్రమే కాదు.. ఒకరి సంస్కృతిని మరొకరు తెలుసుకోవటానికి, వ్యక్తిగతంగా తామేంటో తెలియజేసే వేదిక కూడా. ఎక్కడైతే క్రీడల్లో స్నేహాన్ని ప్రదర్శించే క్షణాలు వచ్చినప్పుడు చూసేవారికి అవి ఎంతో అపూరంగా అనిపిస్తాయి. అలాంటిదే రామ్ చరణ్, పి.వి.సింధు, రైమ్ మధ్య జరిగిన ఆహ్లాదకరమైన కలయిక అని చెప్పొచ్చు.
No comments