మా ముఖ్యమంత్రి గారు నన్ను కాలీగా ఉంచితే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తా - అద్దంకి దయాకర్.!
వందేమాతరం... అని అందాం అందరం అంటున్న ఇండియా ఫైల్స్ సినిమా లో జై ఇండియా సాంగ్ కి సంగీతం సమకూర్చిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్.!
నిన్న హైదరాబాద్ లో బొమ్మకు మురళి గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియా ఫైల్స్ అనే సినిమా నుండి జై ఇండియా సాంగ్ విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో ప్రముఖ రాజకీయ నేత అద్దంకి దయాకర్, సితార, ఇంద్రజ, సుమన్. శుభలేఖ సుధాకర్, హిమజ, రవి ప్రకాష్, జీవన్ కుమార్ వంటి నటీనటులు నటిస్తుండగా బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను బొమ్మకు మురళి గారే స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ ఎమ్ కీరవాణి గారు సంగీతం అందిస్తుండగా, జై ఇండియా అనే సాంగ్ కి మాత్రం ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ సంగీతం అందించి, స్వరాన్ని సమకూర్చారు. ఈ వేడుకకి హాజరయిన అతిరధమహారధులు ఈ చిత్ర యూనిట్ కి తమ బెస్ట్ విషెస్ తెలిపి, పాట ఎంత పెద్ద హిట్టు అయిందో ఈ సినిమా కూడా అంత పెద్ద ఘనవిజయం సాధించాలి అని అన్నారు.
ముందుగా ఈ సినిమా కార్యనిర్వాక నిర్మాత కనక దుర్గ నాగులపల్లి గారు మాట్లాడుతూ, జై ఇండియా సాంగ్ వింటుంటే గూస్బూమ్స్ వస్తున్నాయి, మాకు ఈ అదృష్టం కల్పించిన రాజ్ కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా కథ గద్దర్ అన్న 70 ఏళ్ల రీసెర్చ్. ఆయన జ్ఞానం అంతా ఈ సినిమా కథ ద్వారా చెప్పాలి అనుకున్నారు. దయగారు హీరో అనగానే వద్దు అన్న ప్రతి ఒక్కరు, నివ్వెర పోయేలా దయాకర్ గారు నటించారు. మౌనశ్రీ మల్లిక్ గారు చాలా గొప్ప సాహిత్యం అందించారు. కీరవాణి గారు అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం అని అన్నారు. బొమ్మకు మురళి గారు సమాజ మార్పు కోసం కన్న కల ఈ సినిమా. ఈ సినిమా చాలా గొప్పగా వచ్చింది. చూస్తున్న ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఖచ్చితంగా అని తెలిపారు.
సినిమా హీరో అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ , ముందుగా ఈ ఈవెంట్ ని ఇంత ప్రశాంతంగా జరిగేలా చూసినందుకు అందరికి ధన్యవాదాలు. ఈరోజు విడుదల అయిన జై ఇండియా సాంగ్ యొక్క ఔన్నత్యం తెలివాలి అనుకోని ఇలా ఈవెంట్ ప్లాన్ చేసాం అని అన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక, ఈ సినిమానే మాట్లాడుతుంది. సినిమాలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక వంద కోట్ల మంది చూసే సినిమా ఇది, మన దేశ సనాతన, ఇతిహాస ధర్మాలలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎటువంటి మార్పులు చేయకుండా తీసుకోని ఈ కథ తయారు చేసారు. ఈ సినిమాకు గద్దర్ అన్న చేసిన సేవలు గురించి గుర్తుచేసుకున్నారు. గద్దర్ అన్న సాంగ్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా మీద ప్రజల్లో కూడా చాలా ఆసక్తి పెరిగింది అని అన్నారు. కీరవాణి గారు మా సినిమాకు సంగీతం చేయడం - మౌనశ్రీ మల్లిక్ గారు పాటలు రాయడం అన్నీ కలిసి వచ్చాయి. మరొక మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ వందేమాతరం అందాం అందరం సాంగ్ మనల్ని తట్టి లేపుతుంది. మన నేటి ఫంక్షన్ కి వచ్చిన నిజాం నవాబు గారికి కూడా స్పెషల్ థాంక్స్ అని తెలిపారు. ఈ సినిమా రిలీజ్ తరువాత ఖచ్చితంగా దేశం మొత్తం చర్చ జరిగేలా చేస్తది. నాకు మా రేవంత్ రెడ్డి గారు నన్ను కాలిగా ఉంచితే సమాజానికి పనికొచ్చే ఇంకా మంచి మంచి సినిమాలు కూడా చేస్తా అని అన్నారు. ఈ సినిమా డైరెక్టర్ బొమ్మకు మురళి గారు రేపు ఇండియాలో సెర్చింగ్ డైరెక్టర్ అవుతారు. ఈ సినిమా చూస్తే అందరికి మనం తెలుసుకోవాల్సిన మన చరిత్ర తెలుస్తుంది, మానవీయ కోణం అంటే ఏంటో చూపించాం, అందరికి తప్పకుండ నచ్చుతుంది అని అన్నారు.
ఈ సినిమా దర్శక నిర్మాత బొమ్మకు మురళి గారు మాట్లాడుతూ, ఈ సాంగ్ లాంచ్ చేసిన ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా మనం గుర్తించుకోవాల్సిన వ్యక్తి గద్దర్ అన్న. ఆయన ఈరోజు మన ముందు లేరు. కానీ ఆయన ఇచ్చిన కథ ఇది. ఈ సినిమాలో మనిషి మనుగడ గురించి చెప్పా, మనిషి పుట్టుక నుండి ఇప్పటి వరకు మన జీవన విధానంలో జరిగిన మార్పులు, సనాతన ధర్మం మన మధ్య ఎలా నడుస్తుంది, మన జీవితాన్ని ఎలా నడిపిస్తుంది అనేది కథ గా చెప్పా. కల్చరల్ డి ఎన్ ఏ అనే కాన్సెప్ట్ తో, చట్టాలు మనల్ని కంట్రోల్ లో పెట్టేలా ఎలా వచ్చాయి అని ఈ సినిమా కథ. ఈ సినిమాకు కీరవాణి గారి సంగీతం చాలా బాగా ఉపయోగపడింది. మా సినిమాకు మౌనశ్రీ మల్లిక్ గారు అందించిన సాహిత్యం కూడా బాగా పనికొచ్చింది. అలాగే మా సినిమాలో హీరో గా నటించిన అద్దంకి దయాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన నా సినిమా కథకు హీరోగా కరక్ట్ గా సెట్ అయ్యారు. ఈ సినిమా గ్రాండ్ గా రావడానికి నాకు సపోర్ట్ గా వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నా కో డైరెక్టర్ కస్తూరి గారు నాకు చాలా అండగా ఉన్నారు. వారితో పాటు మా కార్యనిర్వాహక నిర్మాత దుర్గ గారు మరో బ్యాక్ బోన్ గా ఈ సినిమాకు నిలబడ్డారు. తనకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో ఒక సాంగ్ అందించిన రాజ్ కిరణ్ గారు అత్యద్భుతంగా అందించారు ఈ జై ఇండియా సాంగ్. కథ మాత్రం ప్రస్తుత సమాజానికి మన చరిత్ర గురించి తెలిపేలా ఉంటుంది, అందరికి బాగా నచ్చుతుంది అని తెలిపారు.
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ గారు మాట్లాడుతూ ఇండియా ఫైల్స్ అనే సినిమాకు నాకు అవకాశం ఇచ్చి మరొక జన్మ ను ఇచ్చారు అని చెప్పాలి. అలాగే నాకు ఎంతో హెల్ప్ చేసిన తల్లి లాంటి తల్లి కనక దుర్గ గారికి థాంక్స్ చెప్పాలి. నేను సంగీతం అందించిన ఈ జై ఇండియా అనే సాంగ్ కి సాహిత్యం రాసిన మౌనశ్రీ మల్లిక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను చేసిన సాంగ్ కి కీరవాణి గారి ఆశీర్వాదం దక్కడం నా అదృష్టం. కీరవాణి గారి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నేను కూడా ఒక సాంగ్ చేస్తుండటం కూడా నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నా. ఈ సినిమా కథ చాలా బాగా వచ్చింది. నాకు బాగా నచ్చిన రాజకీయ నేత అద్దంకి దయాకర్ గారు. మీరు ఈ సినిమా కథకు ఒక నటుడిగా గౌరవాన్ని అందించారు. ఈ సినిమా రిలీజ్ తరువాత సూపర్ హిట్టుగా నిలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేసారు.
ఈ సినిమా గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు మాట్లాడుతూ, తాను టెలివిజన్ రంగంలో 1000 కి పైగా సాంగ్స్ రాసానని, సినిమా ఇండస్ట్రీ లో 200 లకు పైగా పాటలు రాసానని, అయితే ఈ ఇండియా ఫైల్స్ సినిమా లో రాసిన పాటలు కీరవాణి గారి సంగీత సారధ్యంలో ప్రాణం పోసుకోవడం నా జన్మను చరితార్థం చేసింది అని తెలిపారు. వందేమాతరం సాంగ్ ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు అత్యద్భుతంగా సంగీతం అందించి మరీ తనే స్వయంగా పాడారు, ఈరోజు ఆ పాట వింటున్న అందరూ చాలా గొప్పగా వుంది అని అంటుంటే నా సక్సెస్ నాకు గొప్పగా వుంది అని అన్నారు. ఇండియా ఫైల్స్ అనేది మన గొప్ప చరిత్ర, అలాగే ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఆశాభావం వ్యక్తం చేసారు.
మరొక నిర్మాత మరియు నటుడు అల్లాబక్షు గారు మాట్లాడుతూ, ఈ సినిమా దర్శకుడు తీసిన గత సినిమాలు నేను చూసాను. నాకు అవి బాగా నచ్చాయి. ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చి ఉంటుంది అని భావిస్తున్నాను. ఈ సినిమా హీరో అద్దంకి దయాకర్ గారు నటన చాలా బాగుంది. జై ఇండియా అనే సాంగ్ కి సంగీతం అందించిన రాజ్ కిరణ్ నాకు బాగా తెలుసు. నేను చేస్తున్న నా తదుపరి సినిమాలకు రాజ్ కిరణ్ గారే సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలి అని కోరుకుంటున్నా అని అన్నారు.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడుతూ, ఈ సినిమా గురించి ఆల్రెడీ టాక్ బయట గట్టిగ వినిపిస్తుంది, మంచి బజ్ కూడా వచ్చింది. నాకు బొమ్మకు మురళి గారు మంచి సన్నిహితులు. ఈ జై ఇండియా అనే సాంగ్ కి సంగీతం అందించిన రాజ్ కిరణ్ గారు కూడా నాకు ఎప్పటి నుండో తెలుసు. ఈ సాంగ్ విన్నాకా తన టాలెంట్ చిత్ర పరిశ్రమకు బాగా తెలుస్తుంది. ఈ ఇండియా ఫైల్స్ లో హీరోగా నటించిన అద్దంకి దయాకర్ గారు అటు రాజకీయాల్లో ఎంత పాపులర్ అయ్యారో, ఇటు సినిమాలో కూడా అంత పాపులర్ అండ్ బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు. అలాగే సినిమాకు పనిచేసి ప్రతి ఒక్కరికి తన బెస్ట్ విషెస్ తెలిపి సినిమా పెద్ద హిట్టు అవుతుంది అనే నమ్మకం నాకు వుంది అని అన్నారు.
మరో ప్రముఖ నిర్మాత గురు రాజ్ మాట్లాడుతూ - ఈ రోజు హీరో రాజ్ కిరణ్ నాకు చాలా బాగా తెలుసు. మంచి టాలెంట్ ఉన్న సంగీత దర్శకుడు. తన కృషి కి ఈరోజు మంచి గుర్తింపు దక్కుతుంది. తను ముందు ముందు ఇంకా ఇంకా ఫేమస్ కావాలి అని కోరుకుంటూ మా ప్రియతమ నేత అద్దంకి దయాకర్ నటించిన ఈ ఇండియా ఫైల్స్ మంచి హిట్టు కొట్టాలని ఆశిస్తున్నా అని తెలిపారు.
అలాగే ఈరోజు ఈ ఈవెంట్ లో పాల్గొన్న లయన్ సాయి వెంకట్ గారు, ఎస్ పి గారు, డైరెక్టర్ భరత్ గారు, శ్రీ మటపం విరూపాక్ష గారు మొదలగు వారు హాజరయి, జై ఇండియా సాంగ్ విని, సాంగ్ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని, ఆ సాంగ్ కి సంగీతం అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారిని అభినందించి.., ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని టీం కి తమ బెస్ట్ విషెస్ తెలిపారు.
No comments