"లూసీ" ఫస్ట్ లుక్ విడుదల...


ఆండాలమ్మ పిక్చర్స్ మరియు నియోన్ క్రియేషన్స్ పతాకంపై చరణ్ గోపరాజు, శశాంక్ బాలు, ప్రశాంతి ముఖ్య పాత్రధారులుగా మహదేవ్ చిరంజీవి దర్శకత్వంలో, ఆశిష్, కిరణ్, ప్రవీణ్ ఆమంచ లు సంయుక్తంగా నిర్మించిన సైకలాజికల్ త్రిల్లర్" లూసీ.' అన్ని హంగులు పూరి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా హైదరాబాదులో చిత్ర యూనిట్ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొని సంయుక్తంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ మహదేవ్ చిరంజీవి మాట్లాడుతూ " ఈ సినిమాకు నేను డైరెక్షన్ అండ్ రైటింగ్ తో పాటు కెమెరా మెన్ గా కూడా వ్యవహరించాను. మా సినిమా కు అన్ని చక్కగా కుదిరాయి.మా నిర్మాతలు ఆశిష్, కిరణ్ అండ్ ప్రవీణ్ ఆమంచ లు నన్ను నమ్మి, నాకు సహక రించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను . అతి త్వరలోనే టీజర్ లాంచ్ చేయడానికి సలహాలు చేస్తున్నాం. అని అన్నారు.

ఆ చిత్ర నిర్మాతలు ఆశిష్ కిరణ్ ని మాట్లాడుతూ" చిరంజీవి మహదేవ్ గారు కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. సో అందుకే మేము ఆయనతో జర్నీ స్టార్ట్ చేసాం. ఈ చిత్రం చూసిన తర్వాత హిట్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. ఫ్యూచర్లో ఆయన మరిన్ని మంచి చిత్రాలు తీయాలని మేము కోరుకుంటున్నాం. అని అన్నారు.

సంగీత దర్శకులు సందీప్ ప్రభాకర్ మాట్లాడుతూ"ఆర్ఆర్ కి మంచి స్కోప్ ఉన్న చిత్రం ఇది.. మ్యూజికల్ గా ఇదొక డిఫరెంట్ వైబ్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా డైరెక్టర్ గారికి ఈ చిత్రం మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను." అని అన్నారు

హీరో చరణ్ మాట్లాడుతూ" ఇది నా ఫస్ట్ మూవీ . నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దర్శక నిర్మాత ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అని అన్నారు. 

మరో హీరో శశాంక్ మాట్లాడుతూ" నాక్కూడా ఇది ఫస్ట్ మూవీ నే. మా డైరెక్టర్ మహాదేవ చిరంజీవి గారు మేము కొత్త వారమైన మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'. అని అన్నారు

హీరోయిన్ ప్రశాంతి మాట్లాడుతూ "ఫస్ట్ అఫ్ ఆల్ ఈ సినిమాలో నటించిన వారందరము కొత్త వారమే. మాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రం చూసిన తర్వాత మీరు మీ అమూల్యమైన ఫీడ్ బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నాను. అని అన్నారు.

చరణ్ గోపరాజు, శశాంక్ బాలు, ప్రశాంతి ఈడే, రంజిత్ నాగిలి, సర్కార్, జగపతి శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సందీప్ ప్రభాకర్, డి ఐ: ఆర్యన్ మౌళి, సౌండ్ మిక్సింగ్: అశోక్, పి ఆర్ ఓ: వీరబాబు, అసిస్టెంట్ డైరెక్టర్స్: గంగాధర్, కుమారస్వామి నెయ్యల, హరి, రాజేష్ 

ప్రొడ్యూసర్స్: ఆశిష్, కిరణ్, ప్రవీణ్ ఆమంచ 
రైటర్, ఎడిటర్, డిఓపి, డైరెక్టర్: మహదేవ్ చిరంజీవి.

No comments