శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విడుదల చేసిన ‘ప్రణయగోదారి’ చిత్రంలోని సాయికుమార్ ఫెరోషియస్ లుక్!
ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి, వాటికి జీవం పోసి ప్రేక్షకులను మెప్పించే నటుడు డైలాగ్ కింగ్ సాయికుమార్... త్వరలో ఆయన మరో ఫెరోషియస్ పాత్రతో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చెయ్యబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `ప్రణయగోదారి`లో సాయికుమార్ పెదకాపు అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ రావినూతల ముఖ్య పాత్రలో నటిసున్నారు.
పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా సాయికుమార్ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం తెలంగాణ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ‘మా మునుగోడు ప్రాంతానికి చెందిన పారుమళ్ళ లింగయ్య ‘ప్రణయగోదారి’అనే ఓ మంచి సినిమాను నిర్మించినందుకు అభినందనలు. సినిమా రంగంలో ఆయనకు మంచి భవిష్యత్ వుండాలని కోరుకుంటున్నాను. పారుమళ్ళ లింగయ్యకు నా సహకారం ఎప్పుడూ వుంటుంది. తప్పకుండా "ప్రణయగోదారి" సినిమా ప్రేక్షకుల ఆదరణతో మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను. భవిష్యత్‌లో లింగయ్య ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మించాలని కోరుకుంటున్నాను' అన్నారు.
చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ `సాయికుమార్ లుక్‌ను విడుదల చేసి, మా కంటెంట్‌ను మెచ్చుకొని అభినందించి, శుభాకాంక్షలు అందజేసిన మునుగోడు ఎమ్మేల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారిని అలరించే అంశాలున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి కలిగించే కథతో వస్తోంది. టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్ లో చిత్రీకరణ చేస్తున్నాం. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు చిత్రంలో కనిపిస్తాయి. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చతుందనే నమ్మకం వుంది. అతి త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం' అన్నారు.
“చూడగానే గంభీరంగా కనిపించే లుక్‌లో..రౌద్రంగా కనిపంచే మీసకట్టు, తెల్లని పంచె, లాల్చీతో, మెడలో రుద్రాక్షమాల, చేయికి కంకణంతో..చేతిలో సిగార్‌తో... చాలా పవర్‌ఫుల్‌గా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు సాయికుమార్. ఈ పోస్టర్‌ను చూస్తే చిత్రంలో ఆయన పాత్ర ఎంత శక్తివంతంగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు”
సదన్, ప్రియాంక ప్రసాద్, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్కండేయ, కెమెరా: ఈదర ప్రసాద్, చీఫ్ కో-డైరెక్టర్: జగదీష్ పిల్లి, డిజైనింగ్: టీఎస్ఎస్ కుమార్, అస్టిస్టెంట్ డైరెక్టర్: గంట శ్రీనివాస్, కొరియోగ్రఫీ: కళాధర్, మోహనకృష్ణ, రజిని, ఎడిటర్: కొడగంటి వీక్షిత వేణు, ఆర్ట్: విజయకృష్ణ, క్యాస్టింగ్ డైరెక్టర్: వంశీ ఎమ్
Post Comment
No comments