ఆకట్టుకునేలా ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్.. ఆగస్ట్ 9న ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌



స్నేహం కంటే విలువైన‌ది ఈ ప్ర‌పంచంలో లేదు.. అలాంటి స్నేహం, స్నేహితులు మ‌ధ్య కులం, మ‌తం అడ్డుగోలుగా నిలిస్తే ఏమ‌వుతుంది.. చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్ షిప్ కంటే కులాల‌కే ఎక్కువ విలువిస్తారా!

ఒక‌వేళ నిజ‌మైన స్నేహం మధ్య కులాలు, మ‌తాలు అడ్డొస్తే ప‌రిస్థితులు ఎలా మారుతాయి.. కులాల‌తో విడిపోయిన స్నేహితుల మ‌న‌సుల్లో సంఘ‌ర్ష‌ణ ఎలా ఉంటుంది.. చివ‌ర‌కు వారు క‌లిశారా! అనే విష‌యాలు తెలియాలంటే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శకుడు యదు వంశీ.. నిర్మాతలు పద్మజ కొణిదల, జయలక్ష్మి అడ‌పాక‌. 

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఆగ‌స్ట్‌లో వ‌చ్చే ఫ్రెండ్ షిప్ డే వీక్ సంద‌ర్భంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగ‌స్ట్ 9న విడుద‌లవుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. చిన్న‌ప్ప‌టి నుంచి కులాలు, మ‌తాల‌తో సంబంధం లేకుండా ఓ ఊరిలో ఉండే కుర్రాళ్లంతా పెరిగి పెద్ద‌వుతారు. ఊరి జాత‌ర‌ను ఘ‌నంగా జ‌రుపుకునే ఆ ఊర్లో కులాలు, మ‌తాలంటూ గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. ఆ గొడ‌వ‌లు ఎంత వ‌ర‌కు వెళ‌తాయంటే స్నేహితులు ఒక‌రినొక‌రు తిట్టుకునేంత‌ వ‌ర‌కు, ఒక‌రినొక‌రు కొట్టుకునేంత వ‌ర‌కు.. వీరి గొడ‌వ‌ల‌కు భ‌య‌ప‌డి ఊర్లో జాత‌ర జ‌రుపుకోవాలంటే భ‌య‌ప‌డుతుంటారు. 

ఆ సన్నివేశాల‌ను ఈ ట్రైల‌ర్‌లో చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మంచి డైలాగ్స్‌తో సినిమాను ఆవిష్క‌రించారు. స‌న్నివేశాలు చూస్తుంటే చాలా స‌హ‌జ సిద్ధంగా అనిపిస్తున్నాయి. ఈ ట్రైల‌ర్‌తో స్నేహం గొప్ప‌ద‌నాన్ని తెలియ‌జెప్ప‌టానికి ఫ్రెండ్స్ ఏం చేశారో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి క‌లుగుతోంది. ‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. 

నటీనటులు :

సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు

సాంకతిక వర్గం :

సమర్పణ - నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు - పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక, రచన, దర్శకత్వం - యదు వంశీ, సినిమాటోగ్రఫీ - రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ - అనుదీప్ దేవ్, ప్రొడక్షన్ డిజైనర్ - ప్రణయ్ నైని, ఎడిటర్ - అన్వర్ అలీ, డైలాగ్స్ - వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల, ఫైట్స్ - విజయ్, నృత్యం - జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మన్యం రమేష్, సౌండ్ డిజైన‌ర్‌: సాయి మ‌ణింద‌ర్ రెడ్డి, పోస్ట‌ర్స్‌: శివ‌, ఈవెంట్ పార్ట్‌న‌ర్‌: యు వి మీడియా, మార్కెటింగ్‌: టికెట్ ఫ్యాక్ట‌రీ, పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి).

No comments