ప్రముఖ విఎఫ్ఎక్స్ (VFX) ఆర్టిస్ట్ సునీల్ చరణ్ కి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డ్


వైజాగ్ , హైదరాబాద్ నందు సుమారు 10 సంవత్సరాలుగా పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో నడిపిస్తూ విఎఫ్ఎక్స్ ఆర్టిస్టు గా పలు టివి సీరియల్స్ లో విశేష ప్రతిభ కనపరిచి సుమారు 70 సినిమా లకి పైగా పని చేసి, ఇటీవల విఎఫ్ఎక్స్ (VFX) కేటగిరి లో నేషనల్ అవార్డు పొందిన సునీల్ చరణ్ కి శ్రీ కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డు వచ్చిన సందర్భంగా సునీల్ చరణ్ మాట్లాడుతూ.. నాకు ఈ అవార్డ్ రావడం చాలా సంతోషంగా ఉంది, అవార్డ్ కమిటీ వారికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు.

ఒక టెక్నీషియన్ గా ఎన్నో సేవలు అందించాను, ఈ రోజు ఈ అవార్డ్ అందుకోవడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను.


No comments