బ్యానర్ – సాయిజా క్రియేషన్స్, నిర్మాతలు – ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి, దర్శకత్వం – పద్మారావు అబ్బిశెట్టి (పండు), మాటలు – వినయ్ కొట్టి, ఎడిటర్ – రాకేష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ – ఎం. ఎబెనెజర్ పాల్, సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ స్వయంభు
ప్రేక్షకుల్ని మెప్పించాలంటే భారీ ఫాంటసీ సినిమాలే అవసరం లేదు. మన జీవిత కథలు తెరపై చూపిస్తే చాలు. అందులోని డ్రామా ఎంత ఫాంటసీ ఊహించి రాసినా రాదు. సారంగదరియా చిత్రంతో ఇలాంటి ప్రయత్నమే చేశారు దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి. రాజా రవీంద్ర కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శివచందు, యశస్విని, మొయిన్ మొహమద్, మోహిత్ పేడాడ, నీల ప్రియా కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన సారంగదరియా ఎంతగా మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
ఓ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ కృష్ణ (రాజా రవీంద్ర). ఆయన తన భార్య లక్ష్మి (నీల ప్రియ) ముగ్గురు పిల్లలు అర్జున్ (మొయిన్ మొహమద్), సాయి ( మోహిత్ పేడాడ), అనుపమ (యశస్వినీ)తో ఓ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. కావ్య అనే అమ్మాయితో లవ్ ఫెయిల్యూర్ వల్ల మద్యానికి బానిస అవుతాడు అర్జున్. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం సాయికి సరదా. అతను ఫాతిమ (మధులత)ను ప్రేమిస్తుంటాడు. అందాల పోటీల్లో పాల్గొని పేరు తెచ్చుకోవాలనేది అనుపమ కోరిక. ఇద్దరు కొడుకులు చేసే బాధ్యతారహితమైన పనులతో తండ్రి కృష్ణ విసుగెత్తి పోతుంటాడు. అనుపమను రాజ్ (శివకుమార్) సిన్సియర్ గా లవ్ చేస్తాడు. ఆమె రాజ్ ప్రేమను అంగీకరించదు. ఈ క్రమంలో అనుపమ గురించి ఓ నిజం ఇరుగుపొరుగు వారికి తెలుస్తుంది. అవమానంతో అనుపమ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఇంతకీ అనుపమ జీవితంలో దాగిన ఆ నిజం ఏంటి, అనుపమ తన జీవిత లక్ష్యమైన అందాల పోటీ కిరీటం గెల్చుకుందా లేదా, కూతురు లక్ష్యానికి తండ్రిగా కృష్ణ ఎలాంటి సపోర్ట్ అందించాడు అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యంలో సొసైటీలో ఉన్న కొన్ని సమస్యలను చూపిస్తూ సారంగదరియా సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. మనం ఎంత మోడరన్ లైఫ్ లోకి వెళ్తున్నా కులం, మతం, జెండర్ అనే బేధాలు ఇంకా సమాజం నుంచి పోవడం లేదు. ఈ మూడు సమస్యలను ఎంటర్ టైనింగ్, ఎమోషన్ కలిపి ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాడు దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి. ఆయన విజన్ ను నమ్మి సినిమాను నిర్మించిన నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి అభిరుచిని ప్రశంసించారు. సినిమా సరదాగా ప్రారంభమై కృష్ణ, లక్ష్మి, అర్జున్, సాయి, అనుపమ, రాజ్, ఫాతిమా క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ వెళ్తుంది.
అర్జున్ తన లవ్ ఫెయిల్యూర్ తో మద్యానికి బానిసై ఎప్పుడూ తన లోకంలో బతుకుతుంటాడు. ఈ క్యారెక్టర్ లో ట్రాజెడీ ఉన్నా దర్శకుడు దాన్ని కొంత ఎంటర్ టైనింగ్ గా చూపించాడు. సాయి ఫాతిమ లవ్ స్టోరీ ట్రాక్ మొత్తం సరదాగా సాగుతుంది. కృష్ణ కాలేజ్ లో పిల్లలకు లైఫ్, చదువు గురించి చెప్పే సీన్ ఆలోచింపజేస్తుంది. అనుపమ్ అనుపమాగా ఎందుకు మారింది అనేది సారంగదరియా కథలో కీలకమైన అంశం. ట్రాన్స్ జెండర్స్ అలా మారేందుకు ఎన్నో రీజన్స్ ఉంటాయి. కానీ సమాజానికి ఆ కారణాలు అక్కర్లేదు. వారిని చులకనగా చూడటమే తెలుసు అనే విషయాన్ని ఈ చిత్రంలో హార్ట్ టచింగ్ గా చూపించారు. సమాజంలో ట్రాన్స్ జెండర్ కూడా భాగమేనని, వారికీ అన్ని హక్కులు ఉంటాయనే విషయాన్ని అనుపమ పాత్ర ద్వారా చెప్పిన తీరు బాగుంది. కులం కారణంగా అర్జున్ తన ప్రేమకు దూరమవడం, మతం వల్ల సాయి ఫాతిమను దక్కించుకోవడం కోసం సంఘర్షణ పడటం, ట్రాన్స్ జెండర్ కావడం వల్ల అనుపమ సొసైటీ నుంచి ఎదుర్కొన్న అవమానాలు. తన ముగ్గురు పిల్లల పరిస్థితి చూసి తండ్రిగా కృష్ణ పడే వేదన ఇవన్నీ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. చివరగా అనుపమ తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం, తండ్రి గురించి చెప్పే మాటలు గొప్పగా ఉన్నాయి.
ఓ మధ్య తరగతి తండ్రిగా, లెక్చరర్ గా రాజా రవీంద్ర నటన ప్రశంసలు అందుకునేలా ఉంది. సాయిగా మోహిత్ పేడాడ, అర్జున్ పాత్రలో మొయిన్ మొహమద్ ఆకట్టుకున్నారు. అనుపమ పాత్రలో యశస్వినీ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ట్రాన్స్ జెండర్ గా ఆమె పలికించిన ఎమోషన్స్ హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. మెయిన్ లీడ్ అంతా తమ పాత్రలకు బాగా సెట్ అయ్యారు. ఎబెనెజర్ పాల్ కంపోజిషన్ లో చిత్ర పాడిన ‘అందుకోవా’, ‘నా కన్నులే.., ‘ఈ జీవితమంటే..’ పాటలు బాగున్నాయి. వినయ్ కొట్టి రాసిన డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్, టెక్నికల్ టీమ్ ప్రతిభ మూవీలో కనిపించింది. కుల, మత, లింగ వివక్ష విషయంలో ఛాందసంగా ఉన్న సొసైటీలోని వారంతా చూడాల్సిన సినిమా సారంగదరియా.
రేటింగ్ 3/5
సారంగదరియా మూవీ రివ్యూ
Reviewed by firstshowz
on
8:58 pm
Rating: 5
No comments